సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏకీకృత పెన్షన్ పథకాన్ని (యూపీఎస్) ఎంచుకున్న ఉద్యోగులకు పదవీ విరమణ గ్రాట్యుటీ, మరణ గ్రాట్యుటీ ప్రయోజనం విస్తరణ

Posted On: 18 JUN 2025 7:09PM by PIB Hyderabad

ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం జనవరి 24న జారీ చేసిన నోటిఫికేషన్ నెం. FS-1/3/2023-PR ద్వారా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్ కింద ఏకీకృత పెన్షన్ పథకాన్ని (యూపీఎస్) ఎంచుకునే ఒక ఎంపికను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలియజేసింది. జాతీయ పెన్షన్ విధానం (ఎన్‌పీఎస్) కింద గల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏకీకృత పెన్షన్ పథకంలో చేరేందుకు ఒకేసారి అవకాశం కల్పించే ఈ నిర్ణయం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది.

పైన పేర్కొన్న నిర్ణయాలకు అనుగుణంగా.. సెంట్రల్ సివిల్ సర్వీస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద గ్రాట్యుటీ చెల్లింపు) నియమాలు-2021లోని నిబంధనల ప్రకారం ఏకీకృత పెన్షన్ పథకాన్ని ఎంచుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 'పదవీ విరమణ గ్రాట్యుటీ, మరణ గ్రాట్యుటీ' ప్రయోజనాలను పొందేందుకు అర్హులు అని పింఛను, పింఛనుదారుల సంక్షేమ శాఖ ఈరోజు ఓఎమ్ నంబరు 57/01/2025-P&PW(B)/UPS/10498 ద్వారా స్పష్టం చేసింది.


 

****


(Release ID: 2137501) Visitor Counter : 4
Read this release in: English , Urdu , Marathi , Hindi