సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో కన్హా శాంతి వనం వద్ద ప్రపంచంలోనే మొట్టమొదటి ఎనర్జీ ట్రాన్స్ మిషన్ గార్డెన్ అయిన బాబూజీ వనంను ప్రారంభించిన తెలంగాణ గవర్నర్


కన్హా శాంతి వనంలో పూజ్య బాబూజీ మహరాజ్ 15వ జయంతి ముగింపు కార్యక్రమం

పూజ్య బాబూజీ మహరాజ్ జీవితం, ఘన వారసత్వానికి అంకితమైన ప్రత్యేక ప్రదర్శన, ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో ఏర్పాటు

Posted On: 30 APR 2025 8:34PM by PIB Hyderabad

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ హార్ట్‌ఫుల‌్‌నెస్ అనే సంస్థ సహకారంతో పూజ్య బాబూజీ మహరాజ్ 125వ జయంతి వేడుకల ముగింపును కార్యక్రమాన్ని నిర్వహించింది. 65,000 గ్రామాల్లోని 12 కోట్ల మంది ప్రజలను చేరుకోవడమే లక్ష్యంగా భారతదేశంలోని తమిళనాడు, ఉత్తర‌ ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలలో ఏక్తం అభియాన్, ధ్యానం, జీవనశైలిని మెరుగుపరిచే కార్యక్రమాలు, నైపుణ్య నిర్మాణం తదితరాలతో సహా ఏడాది పాటు స్మారక కార్యక్రమాలు నిర్వహించారు. ఇవి పూజ్యనీయులైన  బాబూజీ మహారాజ్ సందేశాన్ని, ఆయన చేపట్టిన కార్యక్రమాల పరివర్తన ప్రభావాన్ని భారత్‌, ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు తీసుకెళ్లాయి.

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో ప్రత్యేక స్మారక వారసత్వ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఎనర్జీ ట్రాన్స్ మిషన్ గార్డెన్ "బాబూజీ వనం"ను తెలంగాణ గవర్నర్ ప్రారంభించారు.

యోగతో ఆత్మ శక్తి ప్రసారానికి సంబందించిన ప్రాణహుతిని గ్రహించి ప్రసరింపజేసే నలభై జాతుల చెట్లను కలిగి ఉన్న ఈ థీమాటిక్ ఉద్యానవనం ఇలాంటి వాటిలో ప్రపంచంలోనే మొట్టమొదటిది. ఉద్యానవనంలో ఉన్న జలాశయం సృష్టి మూలాన్ని తెలియజేస్తోంది. ప్రతి నీటి బొట్టును సంరక్షించేలా ఉద్యానవనాన్ని జాగ్రత్తగా రూపొందించారు. కంకరతో వేసిన మార్గాలు ఆక్యుప్రెషర్ మార్గాలుగా పనిచేస్తాయి. ఉపరితల నీటిని ఉపయోగించుకునేలా గుంతలు, సున్నితమైన వాలులు నీటిని చెరువుకు పంపిస్తాయి. తోటలోని చెట్లలో ఔషధ విలువలు ఉన్న వేప, ఎర్ర చందనం, తులసి, ఉష్ణమండల బాదం కూడా ఉన్నాయి. ఇక్కడున్న జీవవైవిధ్యం వివిధ రకాల జంతుజాలం, పక్షులను ఆకర్షిస్తుంది. ఆవుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆవులు బాబూజీకి ప్రియమైనవి మాత్రమే కాదు.. పిల్లలు వాటిని పెంచుకోవడానికి, ప్రకృతికి మరింత దగ్గరవటానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ఉద్యానవనంలో ఉపయోగించిన వాటిని ఎంతో లోతైన ఆలోచనతో ఎంపిక చేశారు. దీనివల్ల ఇది పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. రాళ్లతో కూడుకున్న దారులు, ఎలాంటి ప్రతిధ్వని ఉండకుండా పొద మొక్కలతో చేసిన ఏర్పాట్లు.. బాబూజీ, సహజ్ మార్గ్ సాహిత్యం నుంచి వ్యాఖ్యలతో కూడిన బోర్డులు ఈ ఉద్యానవనంలో ఉన్నాయి.

సూక్ష్మ శక్తి అనుభవం పొందేందుకు, అంతర్గత నిశ్చలతను పెంచుకునేందుకు ఈ చెట్లను ఆనుకొని కూర్చోవాలని సందర్శకులను నిర్వాహకులు సూచిస్తున్నారు. ఈ ఉద్యానవనంలో తప్పనిసరిగా మౌనం పాటించాలి. ఇది దైవానికి దగ్గరయ్యేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా హృదయాన్ని గాఢమైన నిశ్శబ్దం వైపు నడిపిస్తుంది.

ప్రత్యేకమైన ప్రదర్శనలో బాబూజీ మహారాజ్‌కు చెందిన అరుదైన కళాఖండాలు, ఛాయాచిత్రాలు, జ్ఞాపకాలను ఉంచారు. ఈ ప్రదర్శన డిజిటల్ వెర్షన్‌ను‌ డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలు కల్పించారు. 165 దేశాల్లో వీక్షించేందుకు ఇది అందుబాటులో ఉంది.

హార్ట్‌ఫుల్‍నెస్ మార్గనిర్దేశకులు, శ్రీ రామ్ చంద్ర మిషన్ అధ్యక్షుడు రెవరెండ్ దాజీ మాట్లాడుతూ.. "మనం గతం ఫలితంగా తయారైన వాళ్లం. ఇప్పుడు మనం చేసే పనులు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. గత అనుభవాలు మాత్రమే మనల్ని కట్టడి చేయవు. ఆ గతం నుంచి ఏర్పడిన ఆలోచనలు ద్వారా వచ్చిన కోరికలు కూడా దీనికి దారి తీస్తాయి. గతం, భవిష్యత్తు మనల్ని కట్టిపడేస్తాయి. మీ దృష్టిని మూలం వైపు మళ్లించండి. ఇప్పటికే ఉన్న ధోరణులు, భవిష్యత్తుకు సంబంధించిన కోరికలు రెండింటినీ అధిగమించడమే దీనికి పరిష్కారం. సంస్కారాలు లేని స్వచ్ఛమైన స్థితిని పొందేందుకు బాబూజీ సహజ్ మార్గ్ వ్యవస్థను రూపొందించారు. ప్రాణాహుతి లేదా యోగ ప్రసారం ద్వారా ధ్యానాన్ని సులభతరం చేశారు” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో రెండు ప్రత్యేక ప్రచురణలు కూడా విడుదల చేశారు. ఇందులో మొదటిది "పవిత్ర తీర్థంకర్లు" అనే పుస్తకం. ఇందులో రెవరెండ్ దాజీ 24 మంది జైన తీర్థంకర్ల జీవితాల సారాన్ని పొందుపరిచారు. జైన మతం, హర్ట్‌ఫుల్‌నెస్‌ మధ్య ఉమ్మడిగా ఉన్న లోతైన ఆధ్యాత్మిక వారసత్వాన్ని తెలిపారు. ఈ పుస్తకం రెండు సంప్రదాయాల మూలాలు, వారసత్వంపై లోతైన వివరాలను అందిస్తోంది. తద్వారా ఆధునిక జీవితానికి కాలాతీత జ్ఞానాన్ని అందిస్తోంది. చారిత్రాత్మక లేదా తాత్వికత కంటే ఎక్కువగా బాబూజీ జీవిత తత్వానికి మూలమైన ఆధ్యాత్మిక అవగాహన, పర్యావరణ బాధ్యతతో కూడిన జీవితాన్ని సామాన్య ప్రజలు అవలంభించిలాని ఈ పుస్తకం పిలుపునిస్తోంది.

రెండవ పుస్తకం పేరు "ఎ సింఫనీ ఆఫ్ లవ్". 2012 నుంచి 2015 వరకు మదర్ హెలెన్ పెరెట్ నిర్వహించిన సోమవారం ధ్యాన సెషన్ల సందర్భంగా అందుకున్న సందేశాల సంకలనం ఇది. ఈ సెషన్లను రెవరెండ్ దాజీతో కలిసి నిర్వహించారు. బాబూజీ మహారాజ్‌కు వ్యక్తిగత ‌రచయిత్రి మదర్ హెలెన్ పెరెట్. ఈ ఆత్మీయ, ఉద్వేగభరిత సంభాషణలు మానవ మనుగడలో దాగివున్న కోణాలను అన్వేషిస్తూ, పాఠకుల చైతన్యాన్ని పెంపొందిస్తాయి.

తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ.. “బాబూజీ మహరాజ్ 125వ జయంతిని అక్షయ తృతీయ పర్వదినాన జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ రణగొణ ధ్వనులతో కూడిన ప్రస్తుత ప్రపంచంలో నిశ్శబ్దం ఒక అరుదైన లగ్జరీ. నిశ్శబ్దం అంటే ధ్యానం. ఇది పునరుత్పత్తి అవుతుంది. నిశ్శబ్దానికి సంబంధించిన గొప్ప వారసత్వాన్ని వేడుక చేసుకునే బాబూజీ వనంను ఈ రోజు ప్రారంభిస్తున్నాను. ఒకరి లోపలికి ఎలా చూడాలో, మౌనం ద్వారా ఎలా పునరుత్తేజం పొందాలో నాకు తెలుసు. 'సహజ్ మార్గ్' అంటే అర్థం సత్యం సంక్లిష్టమైనది. ఇదే విషయాన్ని చెప్పే ఆధ్యాత్మిక వాతావరణం కన్హాలో కనిపిస్తోంది. వాస్తవానికి సత్యం సంక్లిష్టమైనది అని దీని అర్థం. ఆనందం అనేది వివరణ కాదు.. అది అనుభవం నుంచి రావాలి. సహజ్ మార్గ్ చెప్పిన నిజం ఇదే. స్వామి వివేకానందుడు..  సిద్ధాంతాన్ని అనుసరించడం కాదు, మన సంస్కృతి ఎలా ఉండాలో, అది ఏం కావాలో నేర్పుతుందని అన్నారు. ఈ పవిత్ర భూమి అనేక దివ్య గ్రంథాలకు పుట్టినిల్లు. సత్యం క్లిష్టమైనది కాదని ప్రపంచానికి బోధించడమే బాబూజీ మహరాజ్ లక్ష్యం. సత్యాన్ని తెలుసుకోవాలని మన ఋషులు మనకు ఎల్లప్పుడూ నేర్పించారు.” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహాకారంతో రూపొందించిన ఆకర్షణీయమైన ప్రొజెక్షన్ మ్యాపింగ్ బాబూజీ మహారాజ్ జీవత ప్రయాణాన్ని కనుల ముందు ఉంచింది. ఆయన జీవిత ప్రారంభాన్ని, ఆధ్యాత్మిక మేల్కొలుపును, మానవాళిపై పరివర్తన ప్రభావాన్ని తెలియజేసింది. కన్హా శాంతి వనం నేపథ్యంలో సాగే ఈ దృశ్య కథనం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి, ఆయన కాలాతీత వారసత్వానికి హృదయపూర్వక నివాళి అర్పించింది.

బాబూజీ 125వ జయంతి వేడుకల ముగింపు వేడుకలు శ్రీమతి స్నితి మిశ్రా సంగీత ప్రదర్శనతో ముగిశాయి. ఆధ్యాత్మికంగా ఉత్తేజపరిచే సంగీతం ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్న లక్షలాది మందిలో ప్రతిధ్వనించి.. బాబూజీ మహరాజ్ ఉదాత్త లక్షణాలను అలవర్చుకోవడానికి వారిని ప్రేరేపించింది.

 

***


(Release ID: 2125665) Visitor Counter : 8
Read this release in: English , Urdu , Hindi