బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు గనుల వేలం

प्रविष्टि तिथि: 02 APR 2025 6:11PM by PIB Hyderabad

2020 నుంచి వాణిజ్య బొగ్గు గనుల వేలం ద్వారా మొత్తం 109 బొగ్గు గనులను కేటాయించగా, వీటిలో 15 గనులు పనిచేస్తున్నాయి. అదే సమయంలో,  392 బొగ్గుయేతర  (నాన్-కోల్)ప్రధాన ఖనిజాల బ్లాకులకు వేలం నిర్వహించగా, వాటిలో 32 బ్లాకుల్లో నిర్వహణ కార్యకలాపాలు సాగుతున్నాయి.

రాజస్థాన్‌లో వాణిజ్య బొగ్గు గనుల వేలంలో బొగ్గు, లిగ్నైటు గనులను వేటినీ బొగ్గు మంత్రిత్వ శాఖ కేటాయించలేదు.

 

పర్యావరణ అనుమతులుభూ సేకరణ సహా అనేక ముఖ్య చర్యలను బొగ్గు శాఖ చేపడుతూ, గనుల నిర్వహణ కార్యకలాపాలలో అవుతున్న జాప్యాన్ని నివారిస్తోంది. నిర్దిష్ట కాలాల్లో సమీక్షల నిర్వహణతోపాటు బ్లాకుల అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడానికి సంబంధిత రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుకార్యదర్శి (ఎంఓఈఎఫ్సీసీ)బొగ్గు నియంత్రణదారు సంస్థ (సీసీఓ)సీఎంపీడీఐఎల్‌లు సభ్యులుగా ఉంటూ బొగ్గు శాఖ కార్యదర్శి అధ్యక్షతన పనిచేసే ఒక పర్యవేక్షక సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి లోక్‌సభలో ఈ రోజు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానంలో తెలిపారు.

 

***


(रिलीज़ आईडी: 2118214) आगंतुक पटल : 28
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी