గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్, చిలీ మైనింగ్ రంగ సహకారం బలోపేతం

Posted On: 01 APR 2025 8:42PM by PIB Hyderabad

మైనింగ్ రంగంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో భారత్-చిలీ మైనింగ్ పరిశ్రమల రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక చర్చలు జరిగాయిభారత ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జీ.కిషన్ రెడ్డి నేతృత్వం వహించారుగనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వీ.ఎల్.కాంతారావుమంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులుకోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్), హిందాల్కోవేదాంతఅదానీజేఎస్‌డబ్ల్యూజేఎస్పీఎల్ వంటి ప్రముఖ భారతీయ కంపెనీల సీఎండీలుసీఈఓలు భారత ప్రతినిధి బృందంలో ఉన్నారుచిలీ ప్రతినిధి బృందానికి చిలీ గనుల శాఖ మంత్రి హెచ్..అరోరా విలియమ్స్ నేతృత్వం వహించారు.

రాగిలిథియంఇతర కీలక ఖనిజాలకు సంబంధించి చిలీతో సహకారాన్ని బలోపేతం చేయడానికి భారత్‌ కట్టుబడి ఉందని శ్రీ జీ.కిషన్ రెడ్డి ప్రధానంగా తెలియజేశారుదేశ పారిశ్రామిక వృద్ధిసుస్థిర ఇంధనానికి పరివర్తనలో ఈ ఖనిజాలకు పెరుగుతున్న ప్రాముఖ్యతను ముఖ్యంగా ప్రస్తావించారు

చిలీ గనుల మంత్రి అరోరా విలియమ్స్ మాట్లాడుతూ.. ప్రపంచ మైనింగ్ రంగంలో ముఖ్యంగా రాగిలిథియంలో చిలీ నాయకత్వం గురించి మాట్లాడారురెండు దేశాల ఖనిజ అవసరాలను తీర్చడానికిహరిత సాంకేతికతలకు పరివర్తన చెందడానికి సహాయపడేందుకు భారత్‌తో సహకారాన్ని పెంచుకోవటంపై ఉత్సాహంగా ఉన్నట్లు తెలియజేశారు

ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ నిర్వహించింది. ఖనిజ అన్వేషణసుస్థిర మైనింగ్ పద్ధతులువిలువ ఆధారిత ఖనిజ ప్రాసెసింగ్‌తో సహా మైనింగ్ రంగంలోని వివిధ కీలక విభాగాలల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకోవటంపై భారత్ దృష్టి సారించిందిభూగర్భ శాస్త్రంఖనిజ వనరులపై ప్రస్తుతం ఉన్న భారత్-చిలీ అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరించడంకీలకమైన ఖనిజాలకు సంబంధించి సహకారం కోసం మరింత దృఢమైనభవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఫ్రేమ్‌వర్క్ ఉండేలా చూసుకోవటంపై కూడా చర్చలు జరిగాయి.

కీలకమైన ఖనిజాలైన రాగి, లిథియంతో పాటు భూమిలో దొరికే అరుదైన మూలకాలకు భారత్‌లో డిమాండ్ పెరుగుతూనే ఉన్నందున ఎలక్ట్రిక్ రవాణాపునరుత్పాదక శక్తిఎలక్ట్రానిక్స్ తయారీ వంటి రంగాల్లో ఈ ఖనిజాల వ్యూహాత్మక ప్రాముఖ్యతను ఈ సమావేశం ప్రధానంగా తెలియజేసిందిఈ సహకారంతో ఉమ్మడి సంస్థలుదీర్ఘకాలిక సరఫరా ఒప్పందాలుసీమాంతర పెట్టుబడులకు కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

రాగి, లిథియం ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న చిలీ గ్రీన్ ఫీల్డ్బ్రౌన్ ఫీల్డ్ మైనింగ్ ప్రాజెక్టుల ద్వారా ఈ ఖనిజాలను పొందాలనుకునే భారత కంపెనీలకు మంచి అవకాశాలను అందిస్తుందిసాంకేతిక పరిజ్ఞానం బదిలీసుస్థిర మైనింగ్‌లో ఉత్తమ పద్ధతులుప్రపంచ ఖనిజ సరఫరా గొలుసును బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో చర్చించారు.

ఈ సరికొత్త సహకారం భారత్చిలీ మధ్య ఆర్థిక సంబంధాలను పెంపొందించమే కాకుండా రెండు దేశాల దీర్ఘకాలిక ఇంధనఆర్థిక లక్ష్యాలకు మద్దతు ఇచ్చే ధృడమైనస్థిరమైన మైనింగ్ సరఫరా వ్యవస్థను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందిపరస్పర వృద్ధిసాంకేతికత బదిలీమైనింగ్ విషయంలో సుస్థిర భవిష్యత్తును పెంపొందించడంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం కీలకమైన పరిణామంగా చెప్పుకోవచ్చు

 

***


(Release ID: 2117639) Visitor Counter : 15


Read this release in: English , Urdu , Hindi