గనుల మంత్రిత్వ శాఖ
కీలక ఖనిజాల కోసం వ్యూహాత్మక సరఫరా నిర్వహణ వ్యవస్థ
Posted On:
24 MAR 2025 5:20PM by PIB Hyderabad
జాతీయ కీలక ఖనిజాల మిషన్ (ఎన్‌సీఎంఎం)కు కేంద్ర మంత్రిమండలి గత జనవరి 29న ఆమోదం తెలిపింది. ఖనిజాల అన్వేషణ, తవ్వకం కార్యకలాపాలు మొదలు ఖనిజాలకు అదనపు విలువను జోడించడం, శుద్ధి చేయడం, అంతిమ ఉత్పాదనల పున:ప్రాప్తి వరకు అన్ని దశలను కలుపుకొని ముందుకు సాగుతూ కీలక ఖనిజాల దీర్ఘకాలిక సరఫరా కు పూచీపడడంతోపాటు భారత కీలక ఖనిజాల వేల్యూ చైన్లను బలోపేతం చేయడం ఎన్‌సీఎంఎం ఉద్దేశం. ఎన్‌సీఎంఎం కంపోనంట్లలో ‘దేశీయ కీలక ఖనిజాల ఉత్పాదనలో వృద్ధి’, ‘విదేశాల్లో కీలక ఖనిజాల ఆస్తుల కొనుగోలు’ కూడా భాగంగా ఉన్నాయి.
విదేశాల్లో ఖనిజ రూప ఆస్తులను కొనుగోలు చేయడానికి ఒక సంయుక్త సంస్థను (జేవీ) గనుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఈ జేవీ పేరు ఖనిజ్ బిదేశ్ ఇండియా (కేఏబీఐఎల్.. ‘కాబిల్’). అర్జెంటీనాలో 15703 హెక్టార్ల విస్తీర్ణంలో లిథియం బ్రైన్ బ్లాకులో అన్వేషణ, గనుల తవ్వకం కార్యకలాపాలను చేపట్టడానికి అర్జెంటీనాలోని కాటమర్క ప్రావిన్సులో ప్రభుత్వ యాజమాన్యంలోని వాణిజ్య సంస్థ సీఏఎంవైఈఎన్ (‘కామ్యెన్’)తో కాబిల్ ఒక అన్వేషణ, అభివృద్ధి ప్రధాన ఒప్పందంపై సంతకాలు చేసింది.
ఇదే కాక, డ్యూ డిలిజెన్సును చేపట్టడానికి, ఆస్ట్రేలియాకు చెందిన లీ అండ్ కో ఖనిజ సంబంధ ఆస్తులలో సంయుక్తంగా పెట్టుబడిని పెట్టడానికి కాబిల్, ఆస్ట్రేలియా ప్రభుత్వ క్రిటికల్ మినరల్ ఫెసిలిటేషన్ ఆఫీస్, పరిశ్రమ, సైన్సు, రిసోర్సెస్ విభాగం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులకు కూడా ఎన్‌సీఎంఎంలో ఏర్పాటుంది. దీనికోసం రూ.500 కోట్లను బడ్జెటులో కేటాయించారు. అంతేకాకుండా, రీసైక్లింగుకూ రూ.1500 కోట్ల బడ్జెటును ప్రత్యేకించారు. దీనికి అదనంగా, నైపుణ్యాల అభివృద్ధికి, పరిశోధన.. అభివృద్ధి కార్యక్రమాలకు కూడా సాయం అందించే అవకాశాన్ని కల్పించారు.
ఎన్‌సీఎంఎం పాలన సంబంధిత ఫ్రేంవర్క్‌లో కేబినెట్ సెక్రటరీ అధ్యక్షతన ఒక సాధికార సంఘం భాగంగా ఉంటుంది. నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, ఆసక్తి కలిగిన ఇతర మంత్రిత్వ శాఖల కార్యదర్శులు ఈ సంఘంలో సభ్యులుగా ఉంటారు.
ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ రోజు రాజ్య సభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.
****
(Release ID: 2114635)
Visitor Counter : 21