ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్స్ భేటీ

Posted On: 13 FEB 2025 11:39PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్స్ ఈ రోజు సమావేశమయ్యారు.

భారత్అమెరికా మధ్య సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు కొనసాగాయివ్యూహాత్మక సాంకేతికతలురక్షణ రంగంలో పారిశ్రామిక సహకారంపౌర అణుశక్తిలో చిన్న మాడ్యులర్ రియాక్టర్లకు ప్రాధాన్యంఉగ్రవాద నిరోధక కార్యాకలాపాలు ప్రధానాంశాలుగా ఈ భేటీ జరిగింది.
పరస్పర ఆసక్తి ఉన్న అంతర్జాతీయప్రాంతీయ అంశాలపై ఇరువురూ చర్చించారు.


(Release ID: 2103166) Visitor Counter : 34


Read this release in: English