రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కుదించిన వాల్తేర్ డివిజన్ తో విశాఖపట్నం డివిజన్: ప్రతిపాదిత సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లో మార్పు

प्रविष्टि तिथि: 07 FEB 2025 8:47PM by PIB Hyderabad

దిగువ పేర్కొన్న అంశాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది.

i.   28.02.2019లో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని స్వల్పంగా మార్పు చేశారుదీని ప్రకారం.. కుదించిన రూపంలో వాల్తేర్ డివిజన్‌ కొనసాగుతుందిఅయితే ఈ డివిజన్ పేరు విశాఖపట్నంగా ఉంటుంది.

 ii. వాల్తేరు డివిజన్లోని ఒక భాగమైన పలాస-విశాఖపట్నం-దువ్వాడకూనేరు-విజయనగరంనౌపడ జంక్షన్-పర్లాకిమిడిబొబ్బిలి జంక్షన్-సాలూరుసింహాచలం నార్త్-దువ్వాడ బైపాస్వాడలపూడి-దువ్వాడవిశాఖపట్నం స్టీల్ ప్లాంట్-జగ్గయ్యపాలెం స్టేషన్ల మధ్య సెక్షన్లు (సుమారుగా 410 కి.మీ.) ఇకపై కొత్తగా ఏర్పాటు చేసిన సౌత్ కోస్టు రైల్వేలో భాగం కానున్నాయివలసపాలన నాటి గుర్తులను మార్చాల్సిన నేపథ్యంలో వాల్తేరు పేరును విశాఖపట్నం డివిజన్ గా మార్చారు.

 iii.    వాల్తేర్ డివిజన్లోని మరో భాగమైన కొత్తవలస – బచేలికూనేరు-తేరువల్లి జంక్షన్సింగాపూర్ రోడ్డు – కోరాపుట్ జంక్షన్పర్లాకిమిడి – గున్పూర్ స్టేషన్ల మధ్య సెక్షన్లు (మొత్తం 680 కి.మీ.)తో ఈస్ట్ కోస్టు రైల్వేలో కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయనున్నారుదీనికి రాయగడ కేంద్రం కానుంది.

కుదించినప్పటికీ, వాల్తేర్ డివిజన్ ను కొనసాగించడం వల్ల ఈ ప్రాంత ప్రజల అవసరాలుఆకాంక్షలను నెరవేరుస్తుంది.

***


(रिलीज़ आईडी: 2100929) आगंतुक पटल : 84
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati , Malayalam