వ్యవసాయ మంత్రిత్వ శాఖ
కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశమైన కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు
Posted On:
07 FEB 2025 5:05PM by PIB Hyderabad
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ రోజు కృషి భవన్‌లో కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని మిరప రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో శ్రీ రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎర్ర మిరపను సేకరించాలని యోచిస్తోందని, వివిధ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సాయం అందించాలని కోరినట్లు తెలిపారు. ఈ విషయంలో శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్ సానుకూలంగా స్పందించారని వివరించారు.
మిరప రైతుల సమస్యలను వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు రాసిన లేఖను శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌కు అందజేసినట్లు శ్రీ రామ్మోహన్ నాయుడు తెలిపారు.
(Release ID: 2100880)
Visitor Counter : 43