రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

నౌకావాణిజ్య సంబంధాలు పటిష్టం.. ఇండొనేషియా నౌకాదళ ప్రతినిధి వర్గానికి భారతీయ నౌకాదళం అతిథి సత్కారం

Posted On: 27 JAN 2025 4:07PM by PIB Hyderabad

ఈ సంవత్సరం మన దేశ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన ఇండొనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రబొవొ సుబియాంతో వెంట ఉన్నతస్థాయి ప్రతినిధి వర్గం కూడా తరలివచ్చిందిఆ ప్రతినిధి వర్గంలో ఇండొనేషియా నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ ముహమ్మద్ అలీ కూడా ఒకరుఆయన భారత్‌లో ఆధికారిక పర్యటనకు వచ్చారుఆయన రాక సందర్భంగా భారతీయ నౌకాదళం ప్రధానాధికారి అడ్మిరల్ దినేశ్ కెత్రిపాఠి ఆయనతో కలసినౌకా వాణిజ్యాన్ని నెరపుతున్న రెండు సన్నిహిత ఇరుగు పొరుగు దేశాలైన భారత్ఇండొనేషియాల పరస్పర సంబంధాలను పటిష్టపర్చుకోవడంతోపాటు నౌకావాణిజ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవడం అనే అంశంపైన చర్చలు నిర్వహించారు.

రెండు దేశాల నౌకాదళ ప్రధానాధికారుల మధ్య జరిగిన చర్చల్లో ‘సముద్ర శక్తి సహకారం’ వంటి  సంయుక్త కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడంకార్యకలాపాల నిర్వహణలో పరస్పరం సహకరించుకోవడంసముద్ర మార్గంలో దోపిడీలుతదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలు సహా ఉభయ దేశాలకు ఎదురవుతున్న సవాళ్లను కలిసికట్టుగా పరిష్కరించుకోవడం వంటివి ప్రస్తావనకు వచ్చాయి.
ఈ పర్యటనలో భాగంగా ఇన్ఫర్మేషన్ ఫ్యుజన్ సెంటర్-ఇండియన్ ఓషన్ రీజియన్ (ఐఎఫ్‌సి-ఐఓఆర్), వెపన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ అండ్ ఇంజినీరింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డబ్ల్యూఈఎస్ఈఈవంటి కీలక నౌకావాణిజ్య సంస్థలతో చర్చించడం కూడా ఇందులో భాగంగా ఉన్నాయిప్రాంతీయ సహకారాన్ని పెంచుకోవడంపై ఇప్పటికన్నా ఎక్కువ శ్రద్ధ వహించడంనౌకావాణిజ్య రంగంలో చైతన్యాన్ని పెంచుకోవడంపై ఈ సందర్భంగా దృష్టి పెడుతున్నారుబ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఏపీఎల్)ను కూడా అడ్మిరల్ ముహమ్మద్ అలీ సందర్శించారురక్షణవ్యూహాత్మక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలపర్చుకొనే విషయాల్లో తనకున్న ఆలోచనలనూలోతైన అవగాహననూ ఈ సందర్భంగా భారత్ అధికారులకు వెల్లడించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.  
భారతీయ నౌకాదళంతోనూరక్షణ రంగ ఆసక్తిదారులతోనూ అడ్మిరల్ ముహమ్మద్ అలీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రాంతీయ సహకారాన్ని ప్రోత్సహించుకోవాలన్న ఉమ్మడి కట్టుబాటుకు అద్దంపట్టడంతోపాటు నౌకావాణిజ్యానికి భద్రమైనశాంతియుత వాతావరణాన్ని ఏర్పరచాలనే తపనను కనబరుస్తోంది.

 

***


(Release ID: 2096757) Visitor Counter : 25