సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
మహాకుంభమేళా 2025: ఆధ్యాత్మికత, భారతీయ సంస్కృతి, దేశభక్తి సంగమంలో మునక - గణతంత్ర దినోత్సవం రోజున, దేశభక్తి స్ఫూర్తిని చాటనున్న త్రివేణి సంగమం
మహాకుంభమేళా 11వ రోజున, గంగా పెవిలియన్‌లో ప్రదర్శన ఇవ్వనున్న బాలీవుడ్ గాయని సాధనా సర్గం:
శ్రోతలకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించనున్న క్లాసికల్, సెమీ-క్లాసికల్ సంగీత ప్రదర్శనలు
Posted On:
25 JAN 2025 7:27PM by PIB Hyderabad
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా (2025) లో పుణ్యస్నానాలకు ముఖ్యమైన 11 వ రోజు గణతంత్ర దినోత్సవం కూడా కావడంతో భక్తుల త్రివేణీ సంగమ స్నానం ఆధ్యాత్మికత, భారతీయ సంస్కృతితోపాటు దేశభక్తి కూడా వెల్లివిరియనుంది. ఈ సందర్భంగా ఉత్తర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ జనవరి 26 న గంగా, యమునా, సరస్వతి, త్రివేణి- మొత్తం నాలుగు పెవిలియన్లలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. గంగా పెవిలియన్ లో జరిగే ప్రధాన కార్యక్రమంలో బాలీవుడ్ గాయని సాధనా సర్గం తన పాటలతో ప్రేక్షకులను అలరించనున్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా వైవిధ్యభరిత కార్యక్రమాలు
గణతంత్ర దినోత్సవం రోజున మహాకుంభ్ లో వైవిధ్యభరితమైన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఒకవైపు ఫరూవాహి, బిర్హా, అల్హా వంటి ప్రదర్శనల ద్వారా ఉత్తరప్రదేశ్ గ్రామీణ సంస్కృతిని ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే, మరోవైపు కూచిపూడి, భరతనాట్యం, కథక్ తో పాటు ఇతర శాస్త్రీయ సంగీతం, నృత్యాలతో సహా క్లాసికల్, సెమీ క్లాసికల్ ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. గణతంత్ర దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాల వివరాలు:
గంగా పెవిలియన్:
1. సాధనా సర్గం - బాలీవుడ్ సింగర్
2. దీపికా రెడ్డి (హైదరాబాద్) - కూచిపూడి నృత్యం
3. కళా రామ్ నాథ్ (మహారాష్ట్ర) - వయోలిన్, మ్యూజిక్ అకాడమీ అవార్డు గ్రహీత
త్రివేణీ పెవిలియన్:
1. స్నేహలతా మిశ్రా (ఢిల్లీ) - క్లాసికల్/ సెమీ క్లాసికల్ సింగింగ్
2. రవిశంకర్ ఉపాధ్యాయ్ (ఢిల్లీ) - క్లాసికల్/సెమీ క్లాసికల్ ఇన్ స్ట్రుమెంటల్ పెర్ఫార్మెన్స్ (పఖవాజ్)
3. కాంతికా మిశ్రా (లక్నో) - క్లాసికల్ / సెమీ క్లాసికల్ డాన్స్ (కథక్)
4. అశుతోష్ పాండే (కాన్పూర్) - భజన్
యమునా పెవిలియన్:
1. అభా-విభా చౌరాసియా (మధ్యప్రదేశ్) - హిందుస్తానీ గాత్రం
2. ప్రియా వెంకటరామన్ (ఢిల్లీ) - భరతనాట్యం నృత్యం
3. సందీప్ మాలిక్ - కథక్ డాన్స్
4. రాజన్ తివారీ (బెనారస్) - భజన్
5. ఓంకార్ నాథ్ అవస్థి (ఉన్నావ్) - అల్హా
6. సుదర్శన్ యాదవ్ (చందౌలి) - బిర్హా
7. ప్రతిమాయాదవ్ (అంబేద్కర్‌నగర్) - అవధి సింగింగ్
8. రాంహిత్ (గోరఖ్ పూర్) - ఫరూవాహి
9.ర జనీష్ (పిలిభిత్) - తరు గిరిజన ప్రదర్శన
సరస్వతీ పెవిలియన్:
1. అశోక్ భంతియా (ముంబై) - మాధవ్ నాటక ప్రదర్శన
2. మనోజ్ యాదవ్ (లక్నో) - భజన
3. అఖిలేష్ మిశ్రా (లక్నో) - భజన్
***
(Release ID: 2096286)