ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం.. ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

Posted On: 24 JAN 2025 8:53AM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

ఉత్తరప్రదేశ్ ఏర్పాటు దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నా సోదర, సోదరీమణులందరికీ నేను అనేకానేక శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. భారతీయ సంస్కృతిలో లెక్కపెట్టలేనన్ని పౌరాణిక, చరిత్రాత్మక కళాఖండాలకు సాక్షిగా నిలిచిన ఈ పవిత్ర ధరణి గత ఎనిమిది సంవత్సరాలుగా అభివృద్ధిలో ప్రతి రోజూ ఒక కొత్త అధ్యయాన్ని లిఖించడంలో నిమగ్నమైంది. ప్రజల సంక్షేమానికి అంకితమైన ప్రభుత్వం, ఇక్కడి ప్రజల అద్భుత ప్రతిభ, వారి అలుపెరుగక శ్రమించే తత్వం.. ఇవి మన ఈ ప్రియమైన రాష్ట్రం వికసిత్ భారత్ నిర్మాణంలో వాటి అమూల్య తోడ్పాటును అందిస్తాయని నాకు పూర్తి భరోసా ఉంది.’’

 

 

***

MJPS/SR


(Release ID: 2095876) Visitor Counter : 12