మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
పౌర, రక్షణ రంగాల కింద 85 నూతన కేంద్రీయ విద్యాలయాల ప్రారంభానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం:
కర్ణాటక శివమొగ్గ కేంద్రీయ విద్యాలయంలోని అన్ని తరగతుల్లో రెండేసి అదనపు సెక్షన్లకు కూడా ఆమోదం
Posted On:
06 DEC 2024 8:02PM by PIB Hyderabad
కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన కీలక నిర్ణయాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయాల ప్రకారం పౌర, రక్షణ రంగాలకు కలిపి 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలు (కేవీ) మంజూరయ్యాయి. పెరిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యార్థం కేంద్రీయ విద్యాలయ పథకం (కేంద్ర రంగ పథకం) ద్వారా కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని కేవీ శివమొగ్గలో ప్రతి తరగతికీ రెండు అదనపు సెక్షన్లను మంజూరు చేయాలన్న సీసీఈఏ నిర్ణయం పాఠశాల విస్తరణకు దోహదపడుతుంది. 86 కేవీలతో కూడిన జాబితా దిగువన చూడొచ్చు.
2025-26 తో ప్రారంభమై ఎనిమిదేళ్ళ వ్యవధిలో రూ. 5872.08 కోట్ల ఖర్చుతో 85 కొత్త కేవీల స్థాపన, శివమొగ్గ కేవీ విస్తరణ పనులు పూర్తవగలవని అంచనా. మూలధన వ్యయం కింద సుమారు రూ. 2862.71 కోట్లు, నిర్వహణ పనుల కోసం సుమారు రూ. 3009.37 కోట్లను ఖర్చు చేస్తారు.
దేశవ్యాప్తంగా గల 1256 క్రియాశీల పాఠశాలలు, విదేశాల్లోని మూడు కేవీలు - మాస్కో, ఖాట్మండు, టెహరాన్ శాఖల్లో కలిపి సుమారు 13.56 లక్షల మంది విద్యార్థులు కేవీల్లో విద్యనభ్యసిస్తున్నారు.
960 విద్యార్థులతో, పూర్తి సామర్థ్యంతో నడిచే కేవీల్లో సేవలందించేందుకు సంఘటన్ నిబంధనల మేరకు పలు పోస్టులు అవసరమవుతాయి. దరిమిలా 960 X 86 = 82,560 విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక్కో పూర్తి స్థాయి కేవీ 63 మందికి ఉపాధిని అందిస్తుంది. తాజాగా ఆమోదించిన 85 కేవీలు, విస్తరణ మంజూరైన ఒక కేవీ కలిపి ఒక్కో పాఠశాలలో 33 అదనపు పోస్టులు అవసరమవుతాయి. దీనివల్ల 5,388 మందికి నేరుగా శాశ్వత ఉపాధి లభిస్తుంది. పాఠశాలల నిర్మాణ పనులు సహా అనుబంధ కార్యకలాపాల కోసం నైపుణ్యం కలిగిన, నైపుణ్యం అవసరం లేని అనేకమంది కార్మికులకు ఉపాధి దొరికే అవకాశం ఉంది. బదిలీలు కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణరంగ ఉద్యోగుల పిల్లలకు ప్రాంతాలవారీ తారతమ్యాలు లేని ఉన్నత విద్యను అందించాలన్న ఉద్దేశంతో 1962 నవంబర్ లో భారత ప్రభుత్వం కేవీలను ప్రారంభించింది. తదనంతరం, కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖలో “సెంట్రల్ స్కూల్స్ ఆర్గనైజేషన్” భాగమయ్యింది. తొలుత, 1963-64 విద్యా సంవత్సరంలో సైనిక కేంద్రాల్లోని 20 రెజిమెంటల్ పాఠశాలలను కేంద్రీయ విద్యాలయాలుగా మార్పు చేశారు.
బదిలీలు కలిగిన, బదిలీలు లేని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు – సైనికోద్యోగులు, పారామిలిటరీ దళాలు, ఒక ప్రాంతం నుంచీ మరో ప్రాంతానికి ఉద్యోగరీత్యా, లేక ఇతర కారణాల వల్ల నివాసాన్ని మార్చుకునే వారు, మారుమూల ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాల్లో నివసించే ఉద్యోగుల పిల్లల కోసం ప్రాథమికంగా కేవీలను ప్రారంభించారు.
2020 నూతన విద్యా విధానం అమలవుతున్న పాఠశాలుగా, దాదాపు అన్ని కేంద్రీయ విద్యాలయాలు ‘పీఎంశ్రీ’ పాఠశాలలుగా గుర్తింపు పొందాయి. ఇతర పాఠశాలలకు మార్గదర్శులుగా నిలుస్తున్నాయి. ఉత్తమ విద్యా ప్రమాణాలు, సృజనాత్మక బోధనా పద్ధతులు, మెరుగైన సౌకర్యాలు కలిగిన కేవీల్లో తమ పిల్లలను చేర్చాలని తల్లితండ్రులు ఉబలాడపడటం పరిపాటి. ప్రజాదరణ చూరగొన్న ఈ పాఠశాలల్లో ప్రవేశానికి ఆదరణ పెరుగుతూ ఒకటో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. సీబీఎస్సీ నిర్వహించే బోర్డు పరీక్షలలో కేవీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తూ, ఇతర బోర్డుల విద్యార్థులకు సరిసమానంగా రాణిస్తున్నారు.
ANNEXURE
LIST of 86 (85 new and 01 existing) KVs
Name of State/UT
|
Sl. No
|
Name of Proposals
|
OPENING OF 85 NEW KENDRIYA VIDYALAYAS
|
Andhra Pradesh
|
-
|
Anakapalle, District Anakapalle
|
Andhra Pradesh
|
-
|
Valasapalle Village, Madanapalle Mandal, District Chittoor
|
Andhra Pradesh
|
-
|
Palasamudram Village, Gorantala Mandal, District Sri Satya Sai
|
Andhra Pradesh
|
-
|
Tallapalli Village, Macherla Mandal, District Guntur
|
Andhra Pradesh
|
-
|
Nandigama, District Krishna
|
Andhra Pradesh
|
-
|
Rompicherla Village, Narasaraopet Division District Guntur
|
Andhra Pradesh
|
-
|
Nuzvid, District Krishna (Now Eluru District )
|
Andhra Pradesh
|
-
|
Dhone, District Nandyal
|
Arunachal Pradesh
|
-
|
Pitapool, Lower Subansiri
|
Assam
|
-
|
Jagiroad, District Morigaon
|
Chhattisgarh
|
-
|
Mungeli, District-Mungeli
|
Chhattisgarh
|
-
|
Surajpur, District Surajpur
|
Chhattisgarh
|
-
|
Bemetara District, Chhattisgarh
|
Chhattisgarh
|
-
|
Hasoud, District JanjgirChampa
|
Gujarat
|
-
|
Chakkargarh, District Amreli
|
Gujarat
|
-
|
Ognaj, District Ahmedabad
|
Gujarat
|
-
|
Veraval, District Gir-Somnath
|
Himachal Pradesh
|
-
|
Riri Kuthera, District Kangra
|
Himachal Pradesh
|
-
|
Gokulnagar, UpparBhanjal, District- Una
|
Himachal Pradesh
|
-
|
Nandpur, District Una
|
Himachal Pradesh
|
-
|
Thunag, District Mandi
|
Jammu & Kashmir (UT)
|
-
|
Gool, District Ramban
|
Jammu & Kashmir (UT)
|
-
|
Ramban, District Ramban
|
Jammu & Kashmir (UT)
|
-
|
Bani, District Kathua
|
Jammu & Kashmir (UT)
|
-
|
Ramkot, District Kathua
|
Jammu & Kashmir (UT)
|
-
|
Reasi, District Reasi
|
Jammu & Kashmir (UT)
|
-
|
Katra (Kakriyal), District Reasi
|
Jammu & Kashmir (UT)
|
-
|
Ratnipora, District Pulwama
|
Jammu & Kashmir (UT)
|
-
|
Galander (Chandhara), District Pulwama
|
Jammu & Kashmir (UT)
|
-
|
Mughal Maidan, District Kisthwar
|
Jammu & Kashmir (UT)
|
-
|
Gulpur, District Poonch
|
Jammu & Kashmir (UT)
|
-
|
Drugmulla, District Kupwara
|
Jammu & Kashmir (UT)
|
-
|
Vijaypur, District Samba
|
Jammu & Kashmir (UT)
|
-
|
Panchari, District Udhampur
|
Jharkhand
|
-
|
Barwadih, District Latehar (Railway)
|
Jharkhand
|
-
|
Dhanwar Block, District Giridih
|
Karnataka
|
-
|
Mudnal Village, Yadgiri District
|
Karnataka
|
-
|
Kunchiganal Village, District Chitradurga
|
Karnataka
|
-
|
Elargi (D) Village, Sindhanur Taluk, District Raichur
|
Kerala
|
-
|
Thodupuzha, District Idduki
|
Madhya Pradesh
|
-
|
Ashok Nagar, District- Ashok Nagar
|
Madhya Pradesh
|
-
|
Nagda, District Ujjain
|
Madhya Pradesh
|
-
|
Maihar, District Satna
|
Madhya Pradesh
|
-
|
Tirodi, District Balaghat
|
Madhya Pradesh
|
-
|
Barghat, District Seoni
|
Madhya Pradesh
|
-
|
Niwari, District Niwari
|
Madhya Pradesh
|
-
|
Khajuraho, District Chhatarpur
|
Madhya Pradesh
|
-
|
Jhinjhari, District Katni
|
Madhya Pradesh
|
-
|
Sabalgarh, District Morena
|
Madhya Pradesh
|
-
|
Narsinghgarh, District Rajgarh
|
Madhya Pradesh
|
-
|
CAPT (Central Academy Police Training) Bhopal, Kanhasaiya
|
Maharashtra
|
-
|
Akola, District Akola
|
Maharashtra
|
-
|
NDRF Campus, Sudumbare, Pune
|
Maharashtra
|
-
|
Nachane, District Ratnagiri
|
NCT of Delhi (UT)
|
-
|
Khajuri Khas District- North East Delhi
|
Odisha
|
-
|
Railway Titlagarh, District Bolangir
|
Odisha
|
-
|
Patnagarh, District Bolangir
|
Odisha
|
-
|
ITBP khurda, District Khurda
|
Odisha
|
-
|
Athmallik District Angul
|
Odisha
|
-
|
Kuchinda, District Sambalpur
|
Odisha
|
-
|
Dhenkanal (Kamakhyanagar)
|
Odisha
|
-
|
Jeypore, Koraput District
|
Odisha
|
-
|
Talcher, District Angul
|
Rajasthan
|
-
|
AFS Phalodi, District Jodhpur
|
Rajasthan
|
-
|
BSF Satrana, District Sriganganagar
|
Rajasthan
|
-
|
BSF Srikaranpur, District Sriganganagar
|
Rajasthan
|
-
|
Hindaun City, District Karauli
|
Rajasthan
|
-
|
Merta City, District Nagaur
|
Rajasthan
|
-
|
Rajsamand District Rajsamand
|
Rajasthan
|
-
|
Rajgarh, District Alwar
|
Rajasthan
|
-
|
Bhim, District Rajsamand
|
Rajasthan
|
-
|
Mahwa, District Dausa
|
Tamil Nadu
|
-
|
Theni, District Theni
|
Tamil Nadu
|
-
|
Pillaiyarpatti, District Thanjavur
|
Tripura
|
-
|
Udaipur, District Gomati
|
Tripura
|
-
|
Dharmanagar, District North Tripura
|
Uttar Pradesh
|
-
|
Payagpur, District Jaunpur
|
Uttar Pradesh
|
-
|
Maharajganj, District Maharajganj
|
Uttar Pradesh
|
-
|
Bijnor District Bijnor
|
Uttar Pradesh
|
-
|
Chandpur, District Ayodhya
|
Uttar Pradesh
|
-
|
Kannauj District Kannauj
|
Uttarakhand
|
-
|
Narendra Nagar, District Tehri Garhwal
|
Uttarakhand
|
-
|
Dwarahat, District Almora
|
Uttarakhand
|
-
|
Kotdwar, District Pauri Garhwal
|
Uttarakhand
|
-
|
Madan Negi, District Tehri Garhwal
|
EXPANSION OF 01 EXISTING KENDRIYA VIDYALAYA BY ADDING 2 ADDITIONAL SECTIONS IN ALL THE CLASSES
|
Karnataka
|
86.
|
KV Shivamogga, District Shivamogga
|
****
(Release ID: 2082212)
|