భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
పార్లమెంటులో ప్రశ్న: వాతావరణాన్ని ముందుగా సూచించే ప్రక్రియలో కచ్చితత్వానికి మెరుగులు
Posted On:
05 DEC 2024 3:27PM by PIB Hyderabad
భారీ వర్షాలు, పొగమంచు, వడగాడ్పులు, తీవ్ర చలిగాలులు, ఉరుములతోకూడిన గాలివాన వంటి తీవ్ర వాతావరణ సందర్భాల్ని ముందస్తుగా సరైన రీతిన అంచనా కట్టడంలో భారత వాతావరణ అధ్యయన విభాగం (ఐఎండీ) ఇటీవలి అయిదేళ్ళలో 40 శాతం నుంచి 50 శాతం మెరుగైన ఫలితాల్ని సాధించింది.
వాతావరణం పరంగా పరిశీలనలను, దానికి సంబంధించిన సూచనలను, నమూనాలుగా ఉపయోగించుకొనే సాధనాలను, ముందస్తు అంచనా వ్యవస్థలను మంత్రిత్వ శాఖ అదే పనిగా పెట్టుకొని ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుతోంది. తీవ్ర వాతావరణ స్థితిగతులను ముందుగానే సూచించడానికి ఐఎడీ అత్యధునాతన సాధనాలను, టెక్నాలజీలను ఉపయోగించుకొంటోంది. దీనిలో అత్యంత ఆధునిక, గతిశీల సంఖ్యాత్మక వాతావరణ సంబంధిత భావి సందేశాలను అందించే నమూనాలు, అంతరిక్షం నుంచి అత్యంత అధిక స్పష్టతతో కూడిన చిత్రాలు, కాలసూచికలు, బహుళ విధాలైన సమాచార సేకరణ పద్ధతులు, కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ (ఏఐ,ఎంఎల్), డేటా సైన్స్‌లకు తోడు భూతల పరిశీలనలు, అప్పర్ ఎయిర్ అబ్జర్వేషన్లు, పురోగామి రిమోట్ సెన్సింగ్ నెట్‌వర్క్ ద్వారా వాస్తవ కాల ప్రాతిపదికన పర్యవేక్షణ, రాబోయే స్థితులను గురించిన సందేశాల్ని ఇవ్వడం.. వంటివన్నీ భాగంగా ఉన్నాయి. కామన్ అలర్ట్ ప్రోటోకాల్ (సీఏపీ), మొబైల్ అప్లికేషన్లు, వెబ్‌సైట్లు, ఏపీఐలు, ఇంకా ఇతర సామాజిక మాధ్యమ వేదికలను ఐఎండీ ఉపయోగించుకొని ప్రభావవంతమైన, దక్షత కలిగిన, నిర్ణీతకాల ముందస్తు హెచ్చరిక సేవల్ని అందిస్తోంది. సరికొత్త టెక్నాలజీలను అనుసరించడానికి, పని విధానాన్ని మెరుగుపర్చుకోవడానికి ఐఎండీ నిరంతరాయంగా కృషి చేస్తోంది.
ఈ సమాచారాన్ని కేంద్ర సైన్స్, టెక్నాలజీ, భూ విజ్ఞానశాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో ఈ రోజు లిఖితపూర్వక సమాధానంలో అందించారు.
***
(Release ID: 2081405)
Visitor Counter : 38