ప్రధాన మంత్రి కార్యాలయం
‘ఏక్ పేడ్ మా కే నామ్’ కు మద్దతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి;
మరింత మందిని వారి మాతృమూర్తులకు గౌరవాన్ని తెలుపుతూ, ఒక మొక్కను నాటడంతో పాటు ఈ భూమి దీర్ఘకాలం మనగలిగేలాగా వారి తోడ్పాటును అందించాల్సిందంటూ విజ్ఞప్తి
Posted On:
16 NOV 2024 9:56PM by PIB Hyderabad
మరింత మంది వారి మాతృమూర్తుల గౌరవార్థం తలా ఒక మొక్క వంతున నాటి, ఈ భూమి దీర్ఘకాలం పాటు సురక్షితంగా మనుగడ సాగించేటట్లుగా తోడ్పాటును అందించాల్సిందంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విజ్ఞప్తి చేశారు. ‘ఏక్ పేడ్ మాఁ కే నామ్’ (తల్లి పేరిట ఒక మొక్కను నాటుదాం) ఉద్యమానికి అండదండలను అందిస్తున్న వారందరికీ ప్రధాని కృతజ్ఞతలను వ్యక్తం చేశారు.
కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ పొందుపరిచిన ఒక సందేశానికి ప్రధానమంత్రి ప్రతిస్పందిస్తూ, తాను కూడా ఒక సందేశం లో ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘#एक_पेड़_माँ_के_नाम (ఏక్ పేడ్ మాఁ కే నామ్) అభియాన్ కు అండదండలను అందిస్తున్న వారందరికీ నా కృతజ్ఞతలను తెలియ చేస్తున్నాను. మరింత మంది వారి వారి మాతృమూర్తుల గౌరవార్థం ముందడుగు వేసి తలా ఒక మొక్కను నాటి, మరి ఒక సుస్థిర భూమి మనుగడకు దోహదపడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.’’
***
MJPS/SR
(Release ID: 2074140)
Visitor Counter : 21
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam