ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హర్దోయ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి నివాళి


పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌-గ్రేషియా ప్రకటన

Posted On: 06 NOV 2024 5:59PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, ఆత్మీయులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. పీఎంవో ఇండియా ద్వారా సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన ఓ ప్రకటనలో బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరితగతిన కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

‘‘ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం హృదయ విదారకమైనది. ఈ ఘటనలో చాలా కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయాయి. ఈ దు:ఖాన్ని భరించే శక్తి వారికి భగవంతుడు అందించాలని ప్రార్థిస్తున్నాను. అలాగే గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులకు అన్ని విధాలా సాయం అందిస్తోంది’’ అని ప్రధానమంత్రి తెలిపారు.

ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఇవ్వనున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారు.

 

 

 

***

MJPS/SR


(Release ID: 2071356) Visitor Counter : 39