రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

నావికాదళ నవకల్పన, స్వదేశీకరణల మూడో సంచిక ‘స్వావలంబన్ -2024’ను నిర్వహించనున్న భారతీయ నౌకాదళం


నూతన ఆవిష్కరణ, స్వదేశీకరణలతో సమకూరనున్న ఇతోధిక శక్తి, సామర్థ్యాలు

Posted On: 11 OCT 2024 12:18PM by PIB Hyderabad

నావికాదళానికి సంబంధించిన నవకల్పనస్వదేశీకరణ మూడో ఎడిషన్ లో భాగంగా ‘స్వావలంబన్ 2024 సదస్సును ఈ నెల 28, 29 తేదీల్లో న్యూఢిల్లీ లోని భారత్ మండపమ్ లో నిర్వహించనున్నారు.

ఇంతవరకు నిర్వహించిన స్వావలంబన్ రెండు ఎడిషన్లలో భారత పారిశ్రామిక రంగం వద్ద నుంచి 2000 కు పైగా ప్రతిపాదనలు భారతీయ నౌకా దళానికి అందాయి. ొలి నమూనాలను (ప్రోటోటైప్స్)ను అభివృద్ధి పరచడానికి వీలుగా వాటిని155 సవాళ్లకు కుదించారు. ఐడీఈఎక్స్ (iDEX) పథకంలో 200 సూక్ష్మలఘుమధ్యతరహావాణిజ్య వ్యవస్థలు (ఎమ్ఎస్ఎమ్ఈస్)అంకుర సంస్థల (స్టార్ట్-అప్స్)తో సమన్వయాన్ని నెలకొల్పుకోవడానికి ఈ కార్యక్రమం తోడ్పడింది.

ఇది వరకు నిర్వహించిన సదస్సుల్లో గడించిన అనుభవం స్వావలంబన్ 2024 కు దోహద పడుతుందని ఆశిస్తున్నారునవకల్పనస్వదేశీ కరణల దిశలో సరికొత్త ఉత్తేజం కూడా లభిస్తుందన్న భావన ఉందిఈ కార్యక్రమంలో వైమానిక(సముద్రఉపరితల నిఘాఉపరితలవైమానికజలగర్భ రంగాల్లో స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయగల వ్యవస్థలుకృత్రిమ మేధ (ఏఐ)ఇంకా క్వాంటమ్ టెక్నాలజీ ల వంటి విశిష్ట సాంకేతికతల ఆలంబనగా రూపొందిన ఉత్పాదనలను ప్రగతి మైదాన్ లోని పద్నాలుగో పెద్ద గదిలో ఈ నెల 28 , 29 వ తేదీలలో ప్రదర్శించనున్నారుఆయా రంగాలకు సంబంధించిన ఇష్టాగోష్ఠిలను భారత్ మండపంలో ఈ నెల 29న నిర్వహించనున్నారుఈ సందర్భంగా కొత్తగా ఉనికిలోకి వస్తున్న సాంకేతికతలురాబోయే కాలంలో యుద్ధం  ఎలాంటి రూపురేఖలను సంతరించుకొంటుందిస్వదేశీకరణనవకల్పనలకు ప్రోత్సాహాన్ని ఇవ్వడంనవకల్పనల సంస్కృతిని పెంపొందింప చేయడం వంటి అంశాలపై విధాన రూపకర్తలునూతన ఆవిష్కర్తలుఅంకుర సంస్థలుఎమ్ఎస్ఎమ్ఈ స్ఆర్థిక సహాయ సంస్థలుపెట్టుబడిదారులు చర్చోపచర్చలు చేయనున్నారు.  మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి niio-tdac@navy.gov.in, mprcnavy.321[at]gmail[dot]com అన్న వెబ్ చిరునామాలో సంప్రదించవచ్చు.

 

****


(Release ID: 2064185) Visitor Counter : 96


Read this release in: English , Urdu , Hindi