బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రెండు సిసిఎల్ ప్రాజెక్టులకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే శంకుస్థాపన

Posted On: 07 OCT 2024 1:32PM by PIB Hyderabad

కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే నిన్న సిసిఎల్ కు చెందిన  బొకారో, కర్గాలీ ప్రాంతంలో కారో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కు, కోనార్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. ఈ రెండు ప్రాజెక్టులు  ఏడాదికి 7 మిలియన్ టన్నులు, 5 మిలియన్ టన్నుల సామర్ధ్యం కలిగి ఉంటాయి. ఈ కార్యక్రమంలో గిరిధ్ పార్లమెంటు సభ్యుడు శ్రీ చంద్ర ప్రకాశ్ చౌదరి, బెర్మో శాసన సభ్యుడు శ్రీ కుమార్ జయమంగళ్ (అనూప్ సింగ్), కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ శ్రీ పిఎం ప్రసాద్, సిసిఎల్ సిఎండి శ్రీ నీలేంద్ కుమార్ సింగ్, సిసిఎల్ సీనియర్ అధికారులు, కార్మిక సంఘం ప్రతినిధులు, ఇతర భాగస్వాములు పాల్గొన్నారు.

అమ్మ పేరు మీద ఒక చెట్టు (ఏక్ పెడ్ మా కే నామ్) ప్రచారం కింద కోనార్ ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా మంత్రి దూబే మొక్కలు నాటారు.


కారో , కోనార్ బొగ్గు హ్యాండ్లింగ్ ప్లాంట్లు మొదటి మైలు రైలు అనుసంధాన (ఫస్ట్ మైల్ రైల్ కనెక్టివిటీ ) దిశలో ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తాయి. దీని కింద బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి అయిన బొగ్గును సమీప రైల్వే సర్క్యూట్ కు తీసుకువెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తారు. అక్కడ నుండి దేశవ్యాప్తంగా ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్లు , ఇతర వినియోగ సంస్థలకు రవాణా చేస్తారు. ప్రస్తుతం ఈ గనుల నుంచి బొగ్గును రోడ్డు మార్గం ద్వారా రైల్వే మార్గం వైపు తీసుకొస్తున్నారు.

కోనార్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్: ఈ ప్లాంటులో హూపర్, క్రషర్, 10000 టన్నుల సామర్థ్యం కలిగిన బొగ్గు నిల్వ బంకర్ ,1.6 కిలోమీటర్ల పొడవైన కన్వేయర్ బెల్ట్ ఉన్నాయి, వీటి సహాయంతో బొగ్గును 1,000 టన్నుల నిల్వ సామర్థ్యం గల సిలో బంకర్ ద్వారా రైల్వే వాగన్లకు తరలిస్తారు. ఏడాదికి 5 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు వ్యయం రూ.322 కోట్లు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభంతో, ప్రస్తుత ర్యాక్ లోడింగ్ సమయం 5 గంటల నుంచి  1 గంటకు తగ్గుతుంది, ఇది బొగ్గు రవాణాను వేగవంతం చేస్తుంది , ర్యాక్ ల లభ్యతను పెంచుతుంది.

కారో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్: ఈ ప్లాంటులో 15000 టన్నుల సామర్థ్యం కలిగిన బొగ్గు నిల్వ బంకర్, ఒక కిలో మీటర్ పొడవైన కన్వేయర్ బెల్ట్ ఉన్నాయి, దీని సహాయంతో 4000 టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన సిలో బంకర్ ద్వారా బొగ్గును రైల్వే వ్యాగన్లకు తరలిస్తారు. సంవత్సరానికి 7 మిలియన్ టన్నుల సామర్ధ్యం కలిగిన ఈ ప్రాజెక్టు వ్యయం ₹ 410 కోట్లు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభంతో, ప్రస్తుత ర్యాక్ లోడింగ్ సమయం 5 గంటల నుండి 1 గంటకు తగ్గుతుంది, ఇది బొగ్గు తరలింపును వేగవంతం చేస్తుంది.

ఈ క్లోజ్డ్-లూప్, పూర్తిగా యాంత్రిక వ్యవస్థలు రహదారి ద్వారా రవాణాను తొలగించడం ద్వారా బొగ్గు రవాణాలో వేగం, సామర్ధ్యం పెరుగుతాయి.  తద్వారా డీజిల్ వినియోగాన్ని తగ్గిస్తాయి. ఈ ప్రాంతంలో దుమ్ము, వాహనాల ద్వారా వచ్చే కాలుష్యాన్ని తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది.

 

***


(Release ID: 2063013) Visitor Counter : 40


Read this release in: English , Urdu , Hindi , Tamil