నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

2020-21 నుంచి 2025-26 వరకు ప్రధాన ఓడరేవులు, డాక్ లేబర్ బోర్డు ఉద్యోగులు, కార్మికుల కోసం ఉత్పాదకత అనుసంధానిత రివార్డు (పీఎల్ఆర్) సవరణ పథకానికి కేబినెట్ ఆమోదం

Posted On: 03 OCT 2024 8:37PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ 2020-21 నుండి 2025-26 వరకు ప్రధాన ఓడరేవులుడాక్ లేబర్ బోర్డు ఉద్యోగులుకార్మికుల కోసం ప్రస్తుతమున్న ఉత్పాదకత అనుసంధానిత రివార్డు (పీఎల్ఆర్పథకాన్ని సవరించడానికి ఆమోదం తెలిపింది.

ఈ సవరించిన పీఎల్ఆర్ పథకం 2020-21 నుండి 2025-26 ఆర్థిక ఏడాది వరకు అమలులో ఉండనుందిఈ నిర్ణయం ద్వారా ప్రధాన పోర్టులుడాక్ లేబర్ బోర్డులో పని చేసే దాదాపు 20,704 మందికి ఉద్యోగులుకార్మికులకు ప్రయోజనం చేకూరనుందిఈ మొత్తం కాలానికి అంచనా వ్యయం రూ.200 కోట్లు కానుంది.

పోర్టులుషిప్పింగ్జలమార్గాల మంత్రిత్వ శాఖ తదనుగుణంగా 2020-21 నుండి 2025-26 సంవత్సరాల వరకు అన్ని ప్రధాన పోర్టు అథారిటీలు/ప్రాధికార సంస్థలుడాక్ లేబర్ బోర్డు ఉద్యోగులుకార్మికుల కోసం ఉత్పాదకత అనుసంధానిత రివార్డు (పిఎల్ఆర్పథకాన్ని సవరించిందిఇది ప్రస్తుత దేశవ్యాప్త పనితీరు ఆధారంగా ఇచ్చే వెయిటేజీకి బదులు పోర్టు నిర్దిష్ట పనితీరు ఆధారంగా వెయిటేజీని లెక్కించి ఇస్తారువేతన గరిష్ఠ పరిమితి ప్రకారం బోనస్ ను నెలకు రూ.7,000గా తీసుకునిపీఎల్ ఆర్ ను నిర్ణయిస్తారునౌకాశ్రయ పనితీరు ఆధారంగా వెయిటేజీని 50 నుంచి 55 శాతానికీతర్వాత 60 శాతానికీ పెంచి పీఎల్ఆర్ ను ప్రతి ఏడాదీ చెల్లించాల్సి ఉంటుంది2025-26 నాటికి దేశవ్యాప్త వెయిటేజీ భారం 40 శాతానికి తగ్గనుందిఇది దేశవ్యాప్త పోర్టుల పనితీరునిర్దిష్ట నౌకాశ్రయ పనితీరుకు.. ప్రస్తుతం 50 శాతంగా ఉన్న సమాన వెయిటేజీ విధానాన్ని ఇది భర్తీ చేస్తుందిప్రస్తుతం చేసిన ప్రతిపాదిత సవరణ ప్రధాన పోర్టుల మధ్య పోటీతో పాటుసామర్థ్య ప్రభావాన్ని తీసుకువస్తుందని భావిస్తున్నారు.

ఈ పీఎల్ఆర్ పథకం మెరుగైన ఉత్పాదకతను ప్రేరేపించడంతో పాటుపోర్టు రంగంలో మెరుగైన పారిశ్రామిక సౌకర్యాలనుఅనుకూలమైన పని వాతావరణాన్ని పెంపొందిస్తుంది.

 

ఉత్పాదకత అనుసంధానిత రివార్డ్ (పీఎల్ఆర్ప్రధాన పోర్టు ట్రస్టులుడాక్ లేబర్ బోర్డ్ ఉద్యోగులుకార్మికుల కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న పథకందీనిలో ప్రధాన పోర్ట్ అథారిటీల యాజమాన్యంలేబర్ ఫెడరేషన్ల మధ్య కుదిరిన ఒప్పందం ఆధారంగా ఉద్యోగులుకార్మికులకు వార్షిక ప్రాతిపదికన ఆర్థిక రివార్డును అందిస్తారు.

 

 

***



(Release ID: 2061795) Visitor Counter : 18