రక్షణ మంత్రిత్వ శాఖ
కెన్యాలోని మొంబాసా రేవులో ఐఎన్ఎస్ తల్వార్: ముగిసిన సముద్ర భాగస్వామ్య విన్యాసాలు
Posted On:
30 SEP 2024 8:17PM by PIB Hyderabad
అందరికీ భద్రత, వృద్ధి కోసం ప్రధాన మంత్రి నిర్దేశించిన ‘సాగర్’ దార్శనికతలో భాగంగా తూర్పు ఆఫ్రికాతో పెరుగుతున్న భారత్ సంబంధాలను బలోపేతం చేస్తూ... ఐఎన్ఎస్ తల్వార్ నౌక 2024 సెప్టెంబర్ 22 నుండి 25 వరకు కెన్యాలోని మొంబాసా రేవును సందర్శించింది.
పరస్పర నిర్వహణ, సహకారాన్ని పెంపొందించడానికి భారత కెన్యా నావికాదళాల సిబ్బంది నౌకాశ్రయ స్థాయిలో విస్తృతంగా వృత్తిపరమైన పరస్పర భేటీల్లోనూ, సందర్శనల్లోనూ నిమగ్నం అవుతున్నారు. ఐఎన్ఎస్ తల్వార్ కమాండింగ్ ఆఫీసర్ కెన్యా నేవీ డిప్యూటీ కమాండర్ బ్రిగేడియర్ జెఎస్ కిస్వాతో మోంగ్వే నేవల్ బేస్ లో సమావేశమయ్యారు. రెండు నావికాదళాల మధ్య వృత్తిపరమైన సమావేశాలు, శిక్షణలను కొనసాగించడంపై వారు చర్చించారు.
ఐఎన్ఎస్ తల్వార్ నౌక పై రెండు నావికాదళాల సిబ్బంది విజిట్, బోర్డ్, సెర్చ్ అండ్ సీజర్ (వి బిఎస్ఎస్), న్యూక్లియర్, బయోలాజికల్, కెమికల్ డిఫెన్స్ (ఎన్ బి సి డి ) ప్రదర్శనలతో సహా వృత్తిపరమైన సంభాషణలు కూడా చోటుచేసుకున్నాయి. మరింతగా రెండు నావికాదళాల ఉద్యోగులు యోగ, క్రీడా కార్యక్రమాలతో సందడి చేశారు. ప్రజా సందర్శన కార్యక్రమంలో భాగంగా- ఐఎన్ఎస్ తల్వార్ సిబ్బంది స్థానికంగా ఉన్న అనాథాశ్రమాన్ని సందర్శించారు. కెఎన్ఎస్ షుజా కమాండ్ బృందం ఐఎన్ఎస్ తల్వార్ ను సందర్శించి ప్రత్యేక ఆర్థిక మండలి ( ఎక్స్ క్లూజీవ్ ఎకనామిక్ జోన్ - ఇ ఇ జడ్) సర్విలెన్స్, మారిటైమ్ పార్టనర్షిప్ ఎక్సర్ సైజ్ (ఎం పి ఎక్స్) కోసం విన్యాస కార్యక్రమాన్ని ఖరారు చేసింది. తిరుగు ప్రయాణంలో ఐఎన్ఎస్ తల్వార్ నౌక కెఎన్ఎస్ షుజాతో కలసి జాయింట్ ఇఇజెడ్ సర్విలెన్స్, ఎంపిఎక్స్ లో పాల్గొంది. రెండు నౌకలు ఉన్నత స్థాయి వృత్తిపరమైన సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. ఐఎన్ఎస్ తల్వార్ మొంబాసా నౌకాశ్రయ సందర్శన, భారత కెన్యా నావికా దళాల పరస్పర విన్యాసాలు 2023 డిసెంబర్ లో బహారిలో విడుదల చేసిన సంయుక్త దార్శనిక ప్రకటనలో పేర్కొన్న లక్ష్యాలను సాకారం చేసే దిశగా రెండు దేశాల సహకార ప్రయత్నాలను చాటి చెప్పాయి.
***
(Release ID: 2060536)
Visitor Counter : 43