శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సీఎస్స్ఐఆర్ –ఎన్ ఐ ఎస్ సి పి ఆర్, సి ఎస్ ఐ ఆర్ – సి ఎఫ్ టి ఆర్ ఐ, యు బి ఎ, విభా సంస్థల రెండు రోజుల “సాంకేతిక ప్రదర్శన, నెట్ వర్కింగ్ సమావేశాలు”

Posted On: 23 SEP 2024 11:32AM by PIB Hyderabad

మైసూరులోని కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ (సీఎఫ్టీఆర్ఐ)లో ఈ నెల 19-20 తేదీల్లో ‘‘ఆహార తృణధాన్యాలు- టెక్నాలజీ అండ్ నెట్ వర్కింగ్’’ అనే అంశంపై ఒక సదస్సు జరిగింది. సీఎస్ఐఆర్ కు చెందిన రెండు పరిశోధనా సంస్థలు- జాతీయ శాస్త్ర సమాచార, విధాన పరిశోధనా సంస్థ (ఎన్ఐఎస్సీపీఆర్), సీఎఫ్టీఆర్ఐ, వీటితోపాటు ఉన్నత భారత్ అభియాన్, విజ్ఞాన భారతి సంస్థలు కూడా దీనిలో పాలుపంచుకున్నాయి.

ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే దిశగా సీఎఫ్టీఆర్ఐ సంస్థ చేపట్టిన సృజనాత్మక పరిష్కారాలను ప్రదర్శించారు. ఆహార రంగ పరిశోధనల్లో ముందంజలో ఉన్న ఈ సంస్థలు- ఆహార శుద్ధి, పంట అనంతరం అనుసరించాల్సిన పనులు, ఆహార భద్రత, పోషకాహార ఔషధాలు వంటి రంగాల పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. పప్పులు, పళ్ళు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు తదితర ఆహార ఉత్పత్తులకు ఈ సంస్థలు అందిస్తున్న నూతన సాంకేతికతలు, లబ్ధి చేకూరుస్తున్నాయి.


గ్రామీణ ప్రాంతాల వారికి - ఈ సాంకేతిక పద్ధతులను ఉపయోగించే విధానాలను అందించేందుకూ, మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించేందుకూ, మెరుగైన జీవన విధానాలను పరిచయం చేసేందుకూ ఈ సమావేశాలను ఏర్పాటు చేశారు. ఆహార శుద్ధి, వ్యవసాయంలో అధిక దిగుబడుల సాధనలో ఎదురయ్యే సమస్యలను గుర్తించడం, ఆర్ధికవృద్ధి, ఆహార భద్రతలను సాధించేందుకు తీసుకోవలసిన చర్యలను గురించి చర్చించారు.


గ్రామీణ ప్రాంతాల వారితోపాటు, పరిశ్రమల నిపుణులు, వ్యాపారులు, పరిశోధకులు, విధానకర్తలు.. అందరికీ ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియచేయడం, పరస్పర సహకారం ద్వారా వీటిని ఇచ్చిపుచ్చుకోవడం, ఉత్పత్తుల విక్రయ విధానాలను తెలియచేసే వేదికగా కార్యక్రమం ఉపయోగపడింది.


సీఎప్టీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ శ్రీదేవి అన్నపూర్ణ సింగ్, ఎన్ఐఎస్సీపీఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రంజనా అగర్వాల్, మైసూరు శ్చేవరన్ లాబ్స్ ఛైర్మన్ (ఎండీ) శ్రీ శామ్ చెరియన్, ఉన్నత్ భారత్ అభియాన్ జాతీయ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ విజేంద్ర కుమార్ విజయ్, సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ పి కె సింగ్, విభా వాణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఎన్పీ రాజీవె, ఎన్ఐఎస్పీపీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ యోగేష్ సుమన్ ప్రారంభ సమావేశాల్లో పాల్గొన్నారు.


దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుమారు వంద మందికి పైగా ప్రతినిధులకు పైగా హాజరైన ఈ సమావేశాన్ని ఉద్దేశించి సీఎఫ్టీటీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ శ్రీదేవి అన్నపూర్ణ సింగ్ ప్రారంభోపాన్యాసాన్ని చేశారు. సంస్థ ప్రారంభ దినాల్లో, దేశంలో స్పష్టంగా కనిపించే అస్పష్టంగా ఉండిపోయిన పోషకాహార లోపాలని సరిదిద్దేందుకు సంస్థ చేసిన ప్రయత్నాలను వివరించారు.

గేదెపాల నుంచి తయారు చేసిన పాలపొడి, ఉప్పుడు బియ్యం, సుగంధ ద్రవ్యాలు, వంట నూనెలకు సంబంధించిన సాంకేతికతలు, దోశ, ఇడ్లీ, వడ, చపాతీ వంటి సాంప్రదాయిక ఆహారాల తయారీలో వినియోగించే మిషన్లు, ఎండుటాకుల దొన్నెలు వంటి ఉత్పత్తుల తయారీలో సీఎఫ్టీటీఆర్ఐ అందించిన టెక్నాలజీల గురించి ఆమె ప్రస్తావించారు. ఔషధ గుణాలు కల ఆహార తయారీ రంగంలో చేస్తున్న కృషిని కూడా వివరిస్తూ, ఆహార రంగంలో నిపుణుల కొరతను అధిగమించేందుకు సంస్థ ఫుడ్ టెక్నాలజీలో అందిస్తున్న ఎమ్మెస్సీ కోర్సును గురించి తెలియచేసారు.


సీఎఫ్టీటీఆర్ఐ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ మిల్లింగ్ టెక్నాలజీ స్కూల్ విద్యార్థులు గోధుమ పిండి తయారీ పరిశ్రమలోని నిపుణుల అవసరాలను తీరుస్తున్నారన్నారు. మనదేశంలో ఆహార పరీక్షలో సీఎఫ్టీటీఆర్ఐ సంస్థ ప్రముఖమైనదిగా గుర్తింపు తెచ్చుకున్నదని, ఆహార భద్రత సంస్థ ఎఫ్ఎస్ఎస్ఎఐతో కలిసి కల్తీలను నిరోధించేందుకు 550కి పైగా పరీక్షలను అభివృద్ధి చేశామన్నారు.


సీఎఫ్టీటీఆర్ఐ అభివృద్ధి పరచిన సాంకేతికతలను వినియోగించుకుని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, వ్యాపార అవకాశాలను మెరుగుపరిచేందుకు ఉన్నత్ భారత్ అభియాన్/విభా సంస్థలతో కలిసి, తమ సంస్థ చేస్తున్న కృషిని ఎన్ఐఎస్సీపీఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రంజనా అగర్వాల్ తెలియచేశారు. పట్టణ ప్రాంతాలకి వలసలను తగ్గించేందుకు గ్రామీణ ప్రాంతాల్లోనే మెరుగైన అవకాశాలను కల్పించడం ద్వారా నిలకడైన అభివృద్ధి సాధ్యపడగలదని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రంగానికి సంబంధమున్న వ్యక్తులను గుర్తించి వారికి సహకారం అందించేందుకు ఉన్నత్ భారత్ అభియాన్/విభా సంస్థల అనుభవం తమకు ఉపయోగకరంగా ఉందని చెప్పారు. సంస్థల ఉమ్మడి సహకారం వల్ల సాధ్యపడ్డ విజయగాధలని ప్రొఫెసర్ రంజనా అగర్వాల్ ఉటంకించారు.


గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎస్ఐఆర్ సహకారంతో చేపట్టిన పథకాల గురించి ఉన్నత్ భారత్ అభియాన్ సంస్థకు చెందిన ప్రొఫెసర్ విజేంద్ర కుమార్ విజయ్ వివరించారు.


ఉన్నత్ భారత్ అభియాన్, ఎన్ సి ఐ - న్యూఢిల్లీ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రొఫెసర్ పి కె సింగ్ ప్రసంగిస్తూ, తమ సంస్థలో పని చేస్తున్న విషయ నిపుణుల బృందం కార్యకలాపాలు, అందించిన తోడ్పాటు గురించి పేర్కొన్నారు. భాగస్వామ్య పక్షాలు తమ ముందు ఉంచిన ఆలోచనలకు క్రియారూపం ఇచ్చేందుకు తమ సంస్థ చేసిన కృషిని వివరించారు.


విభా వాణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఎన్ పి రాజీవె ప్రసంగిస్తూ, ప్రజల సాంకేతికావసరాలను గుర్తించేందుకు ఈ కార్యక్రమం తొలి అడుగని, సి ఎస్ ఐ ఆర్ వద్ద అందుబాటులో ఉన్న సాంకేతికతల ద్వారా సమస్యలని పరిష్కరించవచ్చని అభిప్రాయపడ్డారు. సి ఎస్ ఐ ఆర్ – సి ఎఫ్ టి ఆర్ ఐ సాంకేతకతలను క్షేత్రస్థాయిలో శీఘ్రతరంగా అమలు చేయడంలో, మరిన్ని నూతన అంశాలను చేర్చడంలో విభా వాణి సహాయపడగలదని చెప్పారు.


సి ఎస్ ఐ ఆర్ సాంకేతికతలను వినియోగించి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో సి ఎస్ ఐ ఆర్ –ఎన్ ఐ ఎస్ సి పి ఆర్ సంస్థలు ఉమ్మడిగా చేస్తున్న కృషి ప్రాముఖ్యాన్ని గురించి సి ఎస్ ఐ ఆర్ –ఎన్ ఐ ఎస్ సి పి ఆర్ ఛీఫ్ సైంటిస్ట్ డాక్టర్ యోగేష్ సుమన్ ప్రసంగించారు.


మైసూరు శ్చేవరన్ లాబ్స్ ఛైర్మన్/ఎండీ శ్రీ శామ్ చెరియన్ మాట్లాడుతూ, ఆహార పరిశ్రమ, ఆహార భద్రత, సుస్థిరమైన ఆహార అందుబాటుకు అనుసరించవలసిన పద్ధతులను తెలియచేయడంలో సి ఎస్ ఐ ఆర్ – సి ఎఫ్ టి ఆర్ ఐ పాత్రను ప్రస్తావించారు.


సాంకేతిక అంశాలు ప్రధానంగా జరిగిన సదస్సులో, సి ఎస్ ఐ ఆర్ – సి ఎఫ్ టి ఆర్ ఐల్లో జరుగుతున్న వివిధ పరిశోధనలు, సృజనాత్మకత, వ్యాపార దృక్పథం, అంకుర పరిశ్రమల అభివృద్ధి, భాగస్వామ్యాలు తదితరాలని ప్రోత్సహించేందుకు ఆయా పరిశోధనలు ఉపయోగపడుతున్న విధానాన్ని తెలియచేసారు.


రెండో రోజు ప్రారంభ కార్యక్రమంలో సి ఎస్ ఐ ఆర్ – సి ఎఫ్ టి ఆర్ ఐ అందించే సాంకేతికతల వినియోగ విధానాన్ని తెలుసుకునేందుకు వాటిని రూపొందించిన శాస్త్రవేత్తలతో ప్రతినిధులు నేరుగా సంభాషించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎస్ హెచ్ ఆశిష్ ఇనామ్ దార్ సంధానకర్తగా వ్యవహరించారు. చర్చలో సి ఎస్ ఐ ఆర్ – సి ఎఫ్ టి ఆర్ తరుఫున డాక్టర్ ఉమేష్ హెబ్బార్, డాక్టర్ ప్రదీప్ సింగ్ నేగి, డాక్టర్ మీరా ఎం ఎస్, డాక్టర్ అత్తర్ సింగ్ చౌహాన్, డాక్టర్ పి వి సురేష్, డాక్టర్ పుష్పా ఎస్ మూర్తి, డాక్టర్ ఆశుతోష్ ఇనామ్ దార్ పాల్గొన్నారు. పళ్ళు, కూరగాయలు, ధాన్యాలు, సాంప్రదాయిక ఆహార పదార్థాలు, జంతు సంబంధ ఆహారాల ప్రాసెసింగ్, మిరియాలు/పసుపు/అల్లం/మసాలా దినుసుల వినియోగం ద్వారా ఆహార పదార్థాల విలువని పెంపొందించడం సహా సి ఎస్ ఐ ఆర్ – సి ఎఫ్ టి ఆర్ అభివృద్ధి పరిచిన సాంకేతికతలను గురించి వీరు ప్రస్తావించారు. సి ఎస్ ఐ ఆర్ – ఎన్ ఐ ఎస్ సి పి ఆర్ లో విధులు నిర్వహిస్తున్న ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ యోగేష్ సుమన్ మాట్లాడుతూ, పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను అందించడంలో సి ఎస్ ఐ ఆర్ చేస్తున్న కృషిని వివరించారు.


వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పథకాల అమలుకు చేయూతనిచ్చే బాంకింగ్ రంగ అధికారులతో ఒక కార్యక్రమానాన్ని ఏర్పాటు చేశారు, డాక్టర్ రాఘవేంద్ర సి కె సంధానం చర్చను నిర్వహించారు. నూతన సాంకేతికతల అమలు కోసం అవసరమైన ఋణాలు అందించే పథకాలు, వ్యవసాయంలో అంకుర/ ఇతర పరిశ్రమల ఏర్పాటు గురించి ఈ సదస్సులో చర్చించారు. ఈ చర్చలో కర్ణాటక రాష్ట్ర వ్యవసాయ రంగ సంస్థ ‘కాపెక్’ అధికారి శ్రీ చంద్ర కుమార్; మెడికేర్ కు చెందిన శ్రీ చంద్రశేఖర్; యూనియన్ బాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన సయ్యద్ రిజ్వీ; స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా మైసూర్ శాఖ అధికారి శ్రీ కృష్ణమూర్తి పాల్గొన్నారు. కొత్త పరిశ్రమల స్థాపనకు అవసరమైన ఋణాలను అందించేందుకు ప్రధానమంత్రి ఫుడ్ ప్రాసెసింగ్ పథకం - పి ఎఫ్ ఎం ఇ, వ్యవసాయ సదుపాయాలు నిధి – ఎఐఎఫ్, రీటైల్ ఆస్తుల ఋణ కేంద్రం - ఆర్ ఎ సి సి తదితర సూక్ష్మకాల, దీర్ఘకాలిక పథకాల గురించి వీరు చర్చించారు.

 

***



(Release ID: 2058060) Visitor Counter : 49


Read this release in: English , Urdu , Hindi , Tamil