రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ తీరప్రాంత పరిశుభ్రతా దినోత్సవం 2024: దేశవ్యాప్త ప్రచారం నిర్వహిస్తున్న భారత తీరరక్షక దళం

Posted On: 21 SEP 2024 7:59PM by PIB Hyderabad

ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్వచ్ఛ భారత్ అభియాన్’కు అనుగుణంగాఈరోజు అన్ని తీరప్రాంత రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాల్లో భారత తీరరక్షక దళం (ఐసీజీఅంతర్జాతీయ తీరప్రాంత పరిశుభ్రతా దినోత్సవం 2024 (ఐసీసీ-2024)ని నిర్వహించిందిపర్యావరణ పరిరక్షణ పట్ల భారత యువతలో పెరుగుతున్న నిబద్ధతను చాటుతూ దేశవ్యాప్తంగా ఎన్‌సిసి క్యాడెట్‌లుఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లుపాఠశాలకళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలుమునిసిపల్ కార్పొరేషన్లుప్రభుత్వేతర సంస్థలుమత్స్యకారుల సంఘాలుఓడరేవులుచమురు ఏజెన్సీలుఇతర ప్రైవేట్ సంస్థల గణనీయ సహకారంతో ఐసీసీ-2024 ప్రచారం దేశవ్యాప్తంగా నిర్వహించారుఈ ఐక్య ప్రయత్నం సముద్ర సంరక్షణపర్యావరణ పరిరక్షణ పట్ల వారి అంకితభావాన్ని చాటింది.

ఈ కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలందరూ దేశంలోని తీరప్రాంతాల్లో చెత్తనువ్యర్థాలను తొలగించడమే కాకుండాపరిశుభ్రమైనఆరోగ్యకరమైన సముద్ర పర్యావరణ వ్యవస్థ ఆవశ్యకతను ప్రచారం చేశారుభౌతిక శుభ్రతతో పాటుసుస్థిరమైన పద్ధతులుసముద్ర జీవులపై కాలుష్యం వల్ల కలిగే హానికరమైన ప్రభావం గురించి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.

ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమందక్షిణాసియా సహకార పర్యావరణ కార్యక్రమం ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా సెప్టెంబరు మూడో శనివారం నిర్వహించే ఐసీసీ డే ఒక కీలకమైన పర్యావరణ కార్యక్రమంగా కొనసాగుతున్నదిసమాజ భాగస్వామ్యాన్నిపర్యావరణపరమైన నాయకత్వ భావనను పెంపొందించే లక్ష్యంతో భారత తీర రక్షక దళం ఆధ్వర్యంలో 2006 నుంచి మన దేశంలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

 

***


(Release ID: 2057645) Visitor Counter : 63


Read this release in: English , Hindi , Marathi