సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారీ మార్పు దిశగా- మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగం


యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీ-ఎక్స్ఆర్) కోసం

నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఎన్ సీఓఈ) ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం

ఆర్థికవృద్ధి, ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఆవిష్కర్తల ఆర్థిక వ్యవస్థను

పురోగమింపజేయడానికి ప్రభుత్వ ఊతం

కళా ప్రాభవాన్ని పెంచేందుకూ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికీ- ఎన్ సీఓఈ

విశిష్ట కార్యక్రమాల రూపకర్తగా భారత్

Posted On: 18 SEP 2024 3:27PM by PIB Hyderabad

యానిమేషన్విజువల్ ఎఫెక్ట్స్గేమింగ్కామిక్స్ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీ-ఎక్స్ఆర్కోసం నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఎన్ సీఓఈఆవిర్భవిస్తోందికంపెనీల చట్టం 2013 ప్రకారం సెక్షన్ కంపెనీగా దీనిని రూపొందిస్తున్నారుప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ ప్రతిపాదనను ఆమోదించిందిఇండియన్ చాంబర్స్ అఫ్ కామర్స్ సమాఖ్యకాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న పరిశ్రమల భాగస్వామ్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందిముంబయిలో ఎన్ సిఓఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారుదేశంలో ఏవీజీసీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కోసం కేంద్ర ఆర్థికకార్పొరేట్ వ్యవహారాల మంత్రి 2022-23 బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగా ఇది ప్రారంభం అవుతోంది

ఫిల్మ్ మేకింగ్ఓవర్ ది టాప్ (ఓటీటీ), గేమింగ్వాణిజ్య ప్రకటనలుఆరోగ్యంవిద్యఇతర సామాజిక రంగాలతో సహా మొత్తం మీడియావినోద రంగంలో ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగం నేడు ఒక అనివార్యమైన పాత్రను పోషిస్తుందిదేశం అభివృద్ధి గమనంలో వెళుతున్నదివేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతదేశవ్యాప్తంగా పెరుగుతున్న ఇంటర్నెట్చౌక డేటా రేట్లతో పోటీ పడుతూప్రపంచవ్యాప్తంగా ఏవీజీసీ-ఎక్స్ఆర్ వినియోగం విపరీతమైన వేగంతో పెరగడానికి సిద్ధంగా ఉంది.

ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగం వృద్ధి దిశగా పయనం

చురుకుగా సాగుతున్న ఈ వేగాన్ని కొనసాగించడానికిదేశంలో ఏవీజీసీ-ఎక్స్ఆర్ విస్తరణ వ్యవస్థను ప్రోత్సహించడానికిఒక అత్యున్నత సంస్థగా నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను స్థాపిస్తున్నారుఅత్యాధునిక ఏవీజీసీ-ఎక్స్ఆర్ టెక్నాలజీల్లో సరికొత్త నైపుణ్యాలతో ఔత్సాహికులునిపుణులను సన్నద్ధం చేయడానికి ప్రత్యేక శిక్షణబోధనా కార్యక్రమాలను అందిస్తుందిపరిశోధనఅభివృద్ధిని ప్రోత్సహిస్తుందికంప్యూటర్ సైన్స్ వంటి వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఒకచోట చేరుస్తుందిఇంజినీరింగ్డిజైన్ఆర్ట్... ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగంలో ప్రధాన పురోగతికి మార్గం వేస్తుందిదేశవిదేశాల మార్కెట్ల కోసం భారతదేశం ఐపీని రూపొందించడంపై నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్విస్తృతంగా దృష్టి సారిస్తుందిమొత్తంగా ఇది భారతదేశ గొప్ప చారిత్రకసాంస్కృతిక వారసత్వం ఆధారంగా కంటెంట్‌ను రూపొందించడానికి దారితీస్తుందిఇంకాఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగంలో అంకుర సంస్థలుప్రారంభ-దశ కంపెనీలకు వనరులను అందించడం ద్వారా ఎన్ సీఓఈ ఒక ఇంక్యుబేషన్ సెంటర్‌గా పని చేస్తుందిఅలాగేఎన్ సీఓఈ విద్యారంగంతోపాటుపరిశ్రమ రంగ అవసరాల కోసం కూడా పని చేస్తుంది.

ఈ  ఎన్ సీఓఈ ని  ఏవీజీసీ-ఎక్స్ఆర్  పరిశ్రమ వృద్ధికి చోదక శక్తిగా పని చేయడం ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాల యువతకు ఇది అతిపెద్ద ఉపాధి వనరులలో ఒకటిగా ఉపయోగపడుతుందిఇది సృజనాత్మక కళలుడిజైన్ రంగానికి అపారమైన ప్రోత్సాహాన్ని ఇస్తుందిఆత్మనిర్భర్ భారత్  లక్ష్యాలను మరింతగా పెంచే  ఏవీజీసీ-ఎక్స్ఆర్  కార్యకలాపాలకు భారతదేశాన్ని కేంద్రంగా మారుస్తుంది.

ఏవీజీసీ-ఎక్స్ఆర్ కోసం ఎన్ సీఓఈ అత్యాధునిక కంటెంట్‌ను అందించడానికి భారతదేశాన్ని కంటెంట్ హబ్‌గా ఉంచుతుందితద్వారా ప్రపంచవ్యాప్తంగా కళ పరంగా భారతదేశపు ప్రాభవాన్ని పెంచుతుందిమీడియాఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది.

****


(Release ID: 2056557) Visitor Counter : 52