జల శక్తి మంత్రిత్వ శాఖ
స్వచ్ఛతా హై సేవ 2024: దశాబ్ద కాలంలో పరిశుభ్రత విషయంలో చోటు చేసుకున్న మార్పులు
Posted On:
12 SEP 2024 9:31PM by PIB Hyderabad
తాగునీరు, పారిశుద్ధ్య విభాగం (డీడీడబ్ల్యూఎస్).. గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఓహెచ్‌యూఏ) చేపట్టనున్న స్వచ్ఛతా హై సేవ (ఎస్‌హెచ్ఎస్) 2024కు సంబంధించి రేపు దిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్‌లో ముందస్తు కార్యక్రమం(కర్టెన్ రైజర్ ఈవెంట్) నిర్వహించనున్నారు. స్వచ్ఛభారత్ మిషన్ పదో వార్షికోత్సవం, స్వచ్ఛతా హై సేవా కార్యక్రమం 7వ ఏట అడుగుపెడుతోన్న ప్రస్తుత తరుణంలో జరుగుతోన్న ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు.
స్వచ్ఛతా హై సేవ 2024 ఇతివృత్తం "స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత". దేశమంతటా పరిశుభ్రతకు సంబంధించిన కార్యకలాపాల్లో సమష్టి కార్యాచరణ, పౌరుల భాగస్వామ్య స్ఫూర్తిని పునరుద్ధరించేందుకు ఎస్‌హెచ్‌ఎస్ తోడ్పాటు అందిస్తుంది. సమాజం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకునే విధానంతో కింది మూడు ప్రధాన అంశాలపై ఆధారపడి ఈ కార్యక్రమం కొనసాగనుంది:
* లక్షిత పరిశుభ్రత ప్రాంతాలు(సీటీయూలు) - శ్రమదానం కార్యకలాపాలు: నిర్దిష్ట లక్షిత ప్రాంతాల్లో నిర్ణీత వ్యవధిలోగా స్వచ్ఛత దిశగా తేవాల్సిన మార్పులు, పూర్తి పరిశుభ్రతపై దృష్టి.
* స్వచ్ఛతలో ప్రజల సామూహిక భాగస్వామ్యం – ప్రజల భాగస్వామ్యం, అవగాహన, సిఫారసు: వివిధ భాగస్వామ్య కార్యక్రమాల ద్వారా పరిశుభ్రతకు సంబంధించి కార్యకలాపాలలో ప్రజలను నిమగ్నం చేయడం.
* సఫాయి మిత్ర సురక్షా శిబిరాలు: పారిశుద్ధ్య కార్మికుల విషయంలో ముందస్తు ఆరోగ్య పరీక్షలు, సామాజిక భద్రతను అందించడం.
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలు, విద్యుత్ శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్.. జల్ శక్తి మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ సీ.ఆర్.పాటిల్.. గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ తోఖాన్ సాహు..డీడీడబ్ల్యూఎస్, ఎంఓహెచ్‌యూఏ, ఎంఓఆర్‌డీ, ఎంఓపీఆర్ కార్యదర్శులు ఈ ముందస్తు కార్యక్రమంలో పాల్గొననున్నారు. సహాయ మంత్రులు, పట్టణాభివృద్ధి, పారిశుద్ధ్యం, పీఆర్&ఆర్‌డీ కార్యదర్శులతో పాటు మిషన్ డైరెక్టర్లు, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు కూడా భౌతికంగా లేదా ఆన్‌లైన్ ద్వారా హాజరుకానున్నారు. జాతీయ పారిశుద్ధ్య మిషన్‌కు వెన్నెముకగా నిలిచే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, భాగస్వాములు, కార్పొరేట్లు, పౌరులు ఈ కార్యక్రమంలో త్వరలో చేపట్టనున్న ఎస్‌హెచ్‌ఎస్‌పై పాత్రికేయ సమావేశం నిర్వహించనున్నారు.
ఎస్‌హెచ్‌ఎస్ 2024 లోగో ఆవిష్కరణ, అందులోని ప్రధాన కార్యక్రమాల ఆవిష్కరణ ఇక్కడ జరగనున్నాయి.
స్వచ్ఛ భారత్ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హై సేవ 2024 జరగనుంది. పౌరులు, భాగస్వాములు ఇతరులందరూ చురుగ్గా పాల్గొనే అవకాశాన్ని ఈ కార్యక్రమం అందిస్తోంది. పరిశుభ్రతను కాపాడటానికి, మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవించడానికి, స్వచ్ఛతను ఒక జీవన విధానంగా మార్చడానికి మనందరం సమష్టిగా ప్రతిజ్ఞ చేద్దాం.
***
(Release ID: 2054447)
Visitor Counter : 252