వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లింక్డ్ఇన్ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్ 2024లో అగ్రస్థానంలో నిలిచిన ఐఐఎఫ్‌టీ.. టాప్ 100 సంస్థల్లో 51వ స్థానంలో ఐఐఎఫ్‌టీ

Posted On: 10 SEP 2024 7:51PM by PIB Hyderabad

వాణిజ్య, పరిశ్రమల  శాఖ ఆధ్వర్యంలోని దేశంలోని ప్రధాన బిజినెస్ స్కూల్ అయిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) నెట్ వర్కింగ్ లో  ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచంలోని టాప్ 100 ఎంబీఓ కోర్సులలో 51వ స్థానంలో నిలిచింది.


ఈ సందర్భంగా వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఐఐఎఫ్‌టీని అభినందించారు.
ప్రపంచవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకోవటానికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా మారేందుకు ఐఐఎఫ్‌టీలో పెరుగుతున్న చైతన్యాన్ని ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు సూచిస్తుందని అన్నారు. భవిష్యత్‌పై ఆశాభావం వ్యక్తం చేసిన వాణిజ్య శాఖ కార్యదర్శి శ్రీ సునీల్ బర్త్వాల్.. పూర్వ విద్యార్థులు, కార్పొరేట్లు, బహుళజాతి సంస్థలు, ప్రభుత్వాలతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడంతో పాటు విద్యా, పరిశోధనలో శ్రేష్టతలను సాధించడానికి ఈ సంస్థ చేస్తున్న స్థిరమైన ప్రయత్నాలకు ఈ విజయం నిదర్శనమని అన్నారు.


వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాకేష్ మోహన్ జోషి మాట్లాడుతూ.. విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, కార్పొరేట్, ప్రభుత్వం వంటి భాగస్వాముల సహాయంతో విద్యా, పరిశోధన, శిక్షణలో ప్రపంచ స్థాయి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ సంస్థగా మార్చడానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.


అంతర్జాతీయ స్థాయిలో కార్పొరేట్లు, విధాన నిర్ణేతలకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించేందుకు అత్యాధునిక సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డిస్కషన్స్ (సీఐఎన్)ను ఐఐఎఫ్‌టీ నెలకొల్పుతోంది.


ఎగుమతిదారులు, కార్పొరేట్, ప్రభుత్వ సన్నిహిత సహకారంతో భారతీయ కంపెనీలు, విధాన నిర్ణేతలు సాధించిన విజయాలు, అనుభవాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రపంచ స్థాయి కేస్ స్టడీలను తెలియజేసేందుకు హార్వర్డ్ తరహాలో ఇంటర్నేషనల్ బిజినెస్ కేస్ స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేసే పనిలో ఈ సంస్థ ఉంది.

 

****


(Release ID: 2053731) Visitor Counter : 52


Read this release in: English , Urdu , Hindi , Tamil