ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
విశ్వస్య-బ్లాక్ చెయిన్ సాంకేతిక వ్యవస్థను ప్రారంభించిన ప్రభుత్వం
పౌర మౌలిక సౌకర్యాలకు బ్లాక్ చెయిన్ సేవలు
విశ్వస్య - బ్లాక్ చెయిన్ టెక్నాలజీ స్టాక్, ఎన్బీఎఫ్ లైట్, ప్రామాణిక్, నేషనల్ బ్లాక్ చెయిన్ పోర్టల్ ప్రారంభం
పౌర సేవల్లో భద్రత, విశ్వాసం, పారదర్శకత కల్పిస్తున్న నేషనల్ బ్లాక్ చెయిన్ ఫ్రేమ్‌వర్క్: ఎంఈటీవై కార్యదర్శి
Posted On:
04 SEP 2024 8:17PM by PIB Hyderabad
విశ్వస్య-బ్లాక్ చెయిన్ టెక్నాలజీ స్టాక్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటివై) లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఎంఈఐటీవై కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్ ప్రారంభించారు. భౌగోళికంగా విస్తరించి ఉన్న మౌలిక సదుపాయాల ఆధారంగా బ్లాక్ చెయిన్ సర్వీస్‌ను అందించేందుకు అనుమతించిన వివిధ బ్లాక్‌చెయిన్ ఆధారిత పనులకు మద్దతు ఇస్తుంది.
తక్కువ ఫీచర్లున్న బ్లాక్ చెయిన్ ప్లాట్‌ఫామ్- ఎన్బీఎఫ్ లైట్, మొబైల్ యాప్ పుట్టుపూర్వోత్తరాలను గుర్తించ గలిగిన బ్లాక్ చెయిన్ ఆధారిత యాప్- ప్రామాణిక్ ను, జాతీయ బ్లాక్ చెయిన్ పోర్టల్‌ని ఆయన ప్రారంభించారు.
నమ్మకం, సేవల మెరుగుదల కోసం నేషనల్ బ్లాక్ చెయిన్
ఎంఈఐటీవై విశ్వసనీయ డిజిటల్ అప్లికేషన్లను రూపొందించే దృష్టితో- పరిశోధన, ఇతర ప్రయోజనాలను సాధించే దిశగా నేషనల్ బ్లాక్ చెయిన్ వ్యవస్థ (ఎన్బిఎఫ్)ను ప్రారంభించింది. దీనివల్ల పౌరులకు అత్యాధునికమైన, పారదర్శకమైన, సురక్షితమైన, విశ్వసనీయమైన డిజిటల్ సేవల్ని అందించడం సాధ్యం అవుతుంది.
నేషనల్ బ్లాక్ చెయిన్ వ్యవస్థ టెక్నాలజీ స్టాక్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కోర్ ఫ్రేమ్‌వర్క్ ఫంక్షనాలిటీ, స్మార్ట్ కాంట్రాక్టులు, ఏపిఐ గేట్‌వే, సెక్యూరిటీ, ప్రైవసీ, ఇంటర్ఆపరబిలిటీ, అప్లికేషన్ల అభివృద్ధితో బ్లాక్ చెయిన్‌ను ఒక సేవగా (బాస్) అందిస్తోంది. ఎన్బీఎఫ్ ప్రస్తుతం రెండు అనుమతించిన బ్లాక్ చెయిన్ వ్యవస్థలకు మద్దతు ఇస్తుంది. దీనిని ఇంకా విస్తరించే అవకాశం ఉంది. సాంకేతికంగా ఈ స్టాక్ ఎన్ఐసి డేటా సెంటర్లలో అంటే భువనేశ్వర్, పూణే, హైదరాబాద్‌లో భౌగోళికంగా విస్తరించి ఉన్న మౌలిక సదుపాయాలతో కలిసి ఉంది.
అంకుర సంస్థలు, విద్యారంగం కోసం బ్లాక్ చెయిన్ శాండ్ బాక్స్
ఎన్బీఎఫ్ లైట్ అనేది బ్లాక్ చెయిన్ శాండ్‌బాక్స్ అప్లికేషన్. ప్రత్యేకించి అంకుర సంస్థలు/విద్యారంగం కోసం అప్లికేషన్ల వేగవంతమైన ప్రోటో టైపింగ్, పరిశోధన, సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం అభివృద్ధి చేశారు. ఎంఈఐటీవై మద్దతు కింద సి-డాక్, ఎన్ఐసీ, ఐడిఆర్బీటి హైదరాబాద్, ఐఐటీ హైదరాబాద్, ఐఐఐటీ హైదరాబాద్, ఎస్ఈటీఎస్ చెన్నై ప్రయత్నాల సహకారంతో ఈ సాంకేతికతలు అభివృద్ధి అయ్యాయి.
పౌరులకు భద్రత, పారదర్శకతను పెంచడానికి జాతీయ బ్లాక్ చెయిన్ వ్యవస్థ
విశ్వసనీయమైన డిజిటల్ సేవల్ని అందించేందుకు కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా, వివిధ పౌర సేవలకు భద్రత, నమ్మకం, పారదర్శకతను కల్పించడంలో నేషనల్ బ్లాక్ చెయిన్ వ్యవస్థ ముఖ్య పాత్ర పోషిస్తుందని ఎంఈఐటీవై కార్యదర్శి శ్రీ ఎస్ కృష్ణన్ తెలిపారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా ఉంచడం, ప్రపంచ స్థాయిలో సేవలు అందించడం కోసం అభివృద్ధి చెందిన పరిష్కారాలను విస్తరించడం, ఆర్థిక వృద్ధి, సామాజికాభివృద్ధి, డిజిటల్ సాధికారత కోసం దీనిని ఉపయోగించుకోవడం వాటాదారులు లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
పాలనలో మార్పులను తేవడంలో బ్లాక్ చెయిన్ పాత్ర
ప్రజలకు అందించే సేవల్ని మరింత పారదర్శకంగా, సమర్ధవంతంగా, జవాబుదారీగా చేయడం ద్వారా దేశంలోని పాలనలో మార్పులు తేవడానికి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని ఎంఈఐటీవై అదనపు కార్యదర్శి శ్రీ భువనేష్ కుమార్ అన్నారు. వివిధ రాష్ట్రాలు, విభాగాలల్లో ఎన్బీఎఫ్ లో అప్లికేషన్లను విస్తృతంగా ఉపయోగించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. ఎన్బీఎఫ్ స్టాక్‌లో కొత్త అప్లికేషన్లు/ ప్లాట్‌ఫారమ్‌లు / వినూత్న భాగాలను ప్రారంభించాలని కూడా సూచించారు.
సవాళ్లను ఎదుర్కోవడానికి ఎన్బీఎఫ్ లక్ష్యాలు
బ్లాక్ చెయిన్‌ను నిర్మించడంలో నిపుణులు అవసరం ఉంటుంది. ఈ సవాళ్లను పరిష్కరించడానికి పంపిణీ చేయబడిన మౌలిక సదుపాయాలపై బ్లాక్ చెయిన్ టెక్నాలజీ స్టాక్‌తో విస్తరించదగిన ఫ్రేమ్‌వర్క్ ను అభివృద్ధి చేయడం జాతీయ బ్లాక్ చెయిన్ ఫ్రేమ్ వర్క్ (ఎన్బీఎఫ్) ఉద్దేశమని ఎంఈఐటీవైలో ఎలక్ట్రానిక్స్, ఐటీ పరిశోధన, అభివృద్ధి విభాగం గ్రూప్ కోఆర్డినేటర్, సైంటిస్ట్ 'జి' శ్రీమతి సునీతా వర్మ అన్నారు. నైపుణ్యం గల మానవ వనరులు, బ్లాక్ చెయిన్ ఆధారిత అప్లికేషన్లు, వెండర్ లాక్-ఇన్, భద్రత, ఇంటర్ ఆపరబిలిటీ, పనితీరు, ఇతర అంశాలకు సంబంధించిన పరిశోధన సవాళ్లకు బ్లాక్ చెయిన్ సాంకేతిక స్టాక్ అభివృద్ధి ముఖ్యమని ఆమె తెలిపారు.
ఎన్బీఎఫ్ అనేది పరిశోధనా సవాళ్లను ఎదుర్కోవడానికి, ప్రభుత్వ సంస్థలతో కలిసి అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి, సాంకేతికత ప్రయోజనాలను ఉపయోగించడం కోసం ఒక కన్సార్టియం మాదిరి ప్రయత్నం అని సి-డాక్ డైరెక్టర్ జనరల్ ఈ.మాగేష్ అన్నారు. ఈ చొరవలో భాగంగా అనేక పేటెంట్లు, పరిశోధన ప్రచురణలు రూపొందించినట్లు ఆయన తెలిపారు.
నేషనల్ బ్లాక్ చెయిన్ ఫ్రేమ్‌వర్క్ వివిధ సాంకేతిక లక్షణాల గురించి సి-డాక్ హైదరాబాద్ సెంటర్ హెడ్ శ్రీమతి పీఆర్ లక్ష్మీ ఈశ్వరి వివరించారు. మొబైల్ యాప్ మూలాన్ని ధ్రువీకరించడానికి ప్రామాణిక్ - బ్లాక్ చెయిన్ ఎలా పని చేస్తుందో వివరించారు.
***
(Release ID: 2052402)
Visitor Counter : 80