కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎం 2 ఎం సర్వీస్ ప్రొవైడర్లు ఈ నెలాఖరులోగా సంచార్ సాథీ పోర్టల్ లో నమోదు కావాలని సూచించిన డాట్


ఉపేక్షిస్తే, అధీకృత టెలికాం లైసెన్సుల నుండి

టెలికాం వనరుల ఉపసంహరణ

నాడు పోస్టు చేయడమైనది: 03 SEP 2024 6:48PM by PIB Hyderabad

టెలికమ్యూనికేషన్స్ విభాగం (డాట్) వారి ఎం2ఎం సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు, ఆ సేవల వినియోగం కోసం ఇప్పటి వరకూ నమోదుకాని ఎం2ఎం సర్వీస్ ప్రొవైడర్లు (ఎం2ఎం ఎస్పిలు), డబ్ల్యూపాన్/డబ్ల్యూలాన్ కనెక్టివిటీ ప్రొవైడర్‌లను ఈనెల 30వ తేదీ లోగా డాట్ వద్ద నమోదు చేసుకోవాలని కోరింది. లేనిపక్షంలో, అధీకృత టెలికాం లైసెన్సుల నుండి పొందిన టెలికాం వనరుల ఉపసంహరణ లేదా సేవల నిలిపివేతకు ఇది దారితీయవచ్చు. గతంలో అధీకృత టెలికాం లైసెన్సుదారుల నుండి టెలికాం వనరులను పొందిన అన్ని నమోదుకాని సంస్థల రిజిస్ట్రేషన్ గడువు సెప్టెంబర్ 30, 2024తో ముగియనున్నది.

ట్రాయ్ సిఫార్సులు, ఎం2ఎం పరిశ్రమ వాటాదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఫిబ్రవరి 2022లో ఎంటిఎం సేవల కోసం అన్ని ఎం2ఎం సర్వీస్ ప్రొవైడర్లు (ఎం2ఎం ఎస్పిలు),  డబ్ల్యూపాన్/డబ్ల్యూలాన్ కనెక్టివిటీ ప్రొవైడర్ల నమోదు కోసం టెకలికం విభాగం వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది. సరళ సంచార్ పోర్టల్ (https://saralsanchar.gov.in/) ద్వారా రిజిస్ట్రేషన్ అనేది సరళమైన, పారదర్శకమైన ఆన్‌లైన్ ఒకసారికే పరిమితమైన ప్రక్రియ.
 

తదనంతరం, ప్రామాణికంగానూ, సురక్షితంగానూ- ఎం2ఎం/ఐఓటీ  విస్తారిత వ్యవస్థ ఏర్పాటు కోసం, అన్ని రకాల కార్యకలాపాలను అనుమతించేందు కోసం, రిజిస్ట్రేషన్ గడువుని పొడిగించారు.

కంపెనీలు, ప్రభుత్వ విభాగాలు/సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, ఎల్ఎల్పిలు, సంస్థలు, అండర్‌టేకింగ్‌లు, యాజమాన్య సంస్థలు, సొసైటీలు, ట్రస్ట్‌లు వంటి సంస్థలు ఎం2ఎం సర్వీస్ ప్రొవైడర్లుగా, డబ్ల్యూపాన్/డబ్ల్యూలాన్ కనెక్టివిటీ ప్రొవైడర్‌గా నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలి. 

దేశంలో సురక్షితమైన, వినూత్నమైన ఎం2ఎం/ఐఓటీ వాతావరణాన్ని నిర్మించడానికి డాట్ కట్టుబడి ఉంది. నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ-2018 పటిష్టమైన డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థాపనను సృష్టించడం, తర్వాతి తరం సాంకేతికతను  ప్రారంభించడం,  ఎం2ఎం/ఐఓటీ వంటి ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించడం కోసం సమగ్రమైన, సామరస్య పూర్వకమైన  విధానాన్ని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2051593) సందర్శకుల సూచీ సంఖ్య : : 109
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil