ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2024 జులై నెల (ఎఫ్ వై 2024-25) వరకు భారత ప్రభుత్వ ఖాతాల నెలవారీ సమీక్ష

నాడు పోస్టు చేయడమైనది: 30 AUG 2024 5:15PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ నెలవారీ ఖాతాలను జులై 2024 వరకు క్రోడీకరించిన తర్వాత ఒక నివేదిక రూపంలో విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు:  

భారత ప్రభుత్వానికి 2024 జులై వరకు రూ.10,23,406 కోట్ల రాబడి వచ్చింది. (2024-25 బడ్జెట్ రాబడి 31.9%). ఈ మొత్తం రాబడిలో పన్నుల ఆదాయం (కేంద్రం నికర రాబడి) రూ.7,15,224 కోట్లు, పన్నుయేతర ఆదాయం రూ.3,01,796 కోట్లు. రుణభారంలేని మూలధన ఆదాయం రూ.6,386 కోట్లు. పన్ను రూపేణా భారత ప్రభుత్వానికి వసూలైన ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా రూ.3,66,630 కోట్లను తిరిగి రాష్ట్రాలకు చెల్లించారు. ఇది గత ఏడాది కన్నా రూ.57,109 కోట్లు అధికం.  

భారత ప్రభుత్వ వ్యయం రూ.13,00,351 కోట్లు (2024-25 బడ్జెట్ అంచనాలో 27%). దీనిలో రెవిన్యూ పద్దు కింద రూ.10,39,091 కోట్లు,  మూలధన పద్దు కింద రూ.2,61,260 కోట్లు ఖర్చయ్యాయి. వడ్డీ చెల్లింపులకు రూ.3,27,887 కోట్లు, ప్రధాన సబ్సిడీలకు రూ.1,25,639 కోట్లు ఖర్చయ్యాయి. 

 

***


(రిలీజ్ ఐడి: 2050356) సందర్శకుల సూచీ సంఖ్య : : 256
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी