వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2023 జూలై తో పోలిస్తే, 2024 జూలైలో ఎనిమిది కీలక పరిశ్రమల


ఉమ్మడి సూచిక 6.1 శాతం (తాత్కాలిక) పెరుగుదల

ఉక్కు, విద్యుత్తు, బొగ్గు, రిఫైనరీ ఉత్పత్తులు, సిమెంట్, ఎరువుల

ఉత్పత్తి జూలై 2024లో సానుకూల వృద్ధి నమోదు.

Posted On: 30 AUG 2024 5:00PM by PIB Hyderabad

2023, జులైలోని సూచికలతో పోలిస్తే 2024 జూలైలో ఎనిమిది కీలక పరిశ్రమల (ఎయిట్ కోర్ ఇండస్ట్రీస్- ఐసిఐ) ఉమ్మడి సూచిక 6.1 శాతం (తాత్కాలిక) పెరిగింది. ఉక్కు, విద్యుత్, బొగ్గు, రిఫైనరీ ఉత్పత్తులు, సిమెంటు, ఎరువుల ఉత్పత్తి జులై 2024లో సానుకూలంగా నమోదైంది. వార్షిక సూచికలు, నెలవారీ సూచికలు, పెరగుదల రేటు అనుబంధం-I, అనుబంధం-II లో ఉన్నాయి.

సిమెంటు, బొగ్గు, ముడిచమురు, విద్యుత్తు, ఎరువులు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, స్టీలు- ఈ ఎనిమిది  రంగాల వ్యక్తిగత పనితీరును ఐసీఐ లెక్కిస్తుంది. ఈ ఎనిమిది రంగాలూ పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియర్ ప్రొడక్షన్-ఐఐపీ)లో 40.27 శాతాన్ని ఆక్రమించాయి.

ఈ ఏడాది ఏప్రిల్ లో ఈ ఎనిమిది ప్రధాన పరిశ్రమల వృద్ధి రేటు సూచీ 6.9 శాతంగా నమోదైంది. 2024-25 ఏప్రిల్ నుండి జూలై వరకు ఐసిఐ సంచిత వృద్ధి రేటు గత సంవత్సరం సంబంధిత కాలంతో పోలిస్తే 6.1 శాతం (తాత్కాలికం).

ఎనిమిది ప్రధాన పరిశ్రమల సూచిక సారాంశం ఇది:

సిమెంటు:  సిమెంటు ఉత్పత్తి (వాటా: 5.37 శాతం) 2023 జూలై కంటే 2024 జూలైలో 5.5 శాతం పెరిగింది. దీని సంచిత సూచిక 2024-25 ఏప్రిల్ నుండి జూలై వరకు మునుపటి సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 1.6 శాతం పెరిగింది.
 

బొగ్గు: బొగ్గు ఉత్పత్తి (వాటా: 10.33 శాతం) 2024 జూలైలో 6.8 శాతం పెరిగింది. దీని సంచిత సూచిక ఏప్రిల్ నుండి జూలై, 2024-25లో మునుపటి సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 9.9 శాతం పెరిగింది.

ముడిచమురు: ముడి చమురు ఉత్పత్తి (వాటా: 8.98 శాతం) ఈ జూలైలో 2.9 శాతం క్షీణించింది. దీని సంచిత సూచీ ఏప్రిల్ నుండి జూలై, 2024-25లో మునుపటి సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 1.3 శాతం క్షీణించింది. 

విద్యుత్తు:  విద్యుదుత్పత్తి (వాటా: 19.85 శాతం)  2023 జూలైతో పోలిస్తే ఈ జూలైలో 7.0 శాతం పెరిగింది. దీని సంచిత సూచిక 2024-25 ఏప్రిల్ నుండి జూలై వరకు మునుపటి సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 9.9 శాతం పెరిగింది.

ఎరువులు:  ఎరువుల ఉత్పత్తి (వాటా: 2.63 శాతం) జూలై, 2024లో 5.3 శాతం పెరిగింది. దీని సంచిత సూచిక 2024-25 ఏప్రిల్ నుండి జూలై వరకు మునుపటి సంవత్సరంతో పోలిస్తే 1.3 శాతం పెరిగింది.

సహజ వాయువు: సహజ వాయువు ఉత్పత్తి (వాటా: 6.88 శాతం) 2023 జూలై కన్నా 2024లో 1.3 శాతం క్షీణించింది. దీని సంచిత సూచీ ఏప్రిల్ నుండి జూలై, 2024-25లో మునుపటి సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 4.3 శాతం పెరిగింది. .

పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు: - పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తి (వాటా: 28.04 శాతం) 2023 జూలై కన్నా ఈ జూలైలో 6.6 శాతం పెరిగింది. దీని సంచిత సూచీ 2024-25 ఏప్రిల్ నుండి జూలై మధ్య కాలంలో మునుపటి కాలంతో పోల్చితే 2.3 శాతం పెరిగింది.

స్టీల్: స్టీలు ఉత్పత్తి (వాటా: 17.92 శాతం) 2023 జూలై కంటే ఈ జూలైలో 7.2 శాతం పెరిగింది. దీని సంచిత సూచీ ఏప్రిల్ నుండి జూలై, 2024-25లో మునుపటి సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 7.6 శాతం పెరిగింది.

నోట్ 1: మే 2024, జూన్ 2024, జూలై 2024 సమాచారం తాత్కాలికం. కీలక పరిశ్రమల సూచికలను సమీక్షించడం లేదా నిర్ణయించడంగానీ సంబంధిత సంస్థల నుంచి సేకరించిన  తాజా సమాచారం ఆధారంగా ఉంటుంది.

నోట్2:  ఏప్రిల్ 2014 నుండి ఉన్న విద్యుదుత్పత్తి సమాచారాన్ని పునరుత్పాదక వనరుల నుంచి తీసుకుని, ఇందులో చేర్చాం.

నోట్3: ప్రతి పరిశ్రమ ప్రభావాన్ని ఐసీఐ సూచికలో 100కు సమానంగా చూసి దామాషా విధానంలో తీసుకున్నవి.

నోట్4: మార్చి 2019 నుంచి కోల్డు రోల్డు (సీఆర్) కాయిల్స్ విభాగంలో హాట్ రోల్డు పికిల్డ్ అండ్ ఆయిల్డ్ అనే కొత్త స్టీలు ఉత్పత్తి వచ్చింది. దీని సమాచారం ‘‘మొత్తం స్టీలు ఉత్పత్తి’’లో భాగంగా చేర్చాం.

నోట్5: ఆగస్టు 2024 సూచికలను 30వ తేదీ (సోమవారం) 2024న విడుదల చేస్తాం.

 

***


(Release ID: 2050340) Visitor Counter : 89
Read this release in: English , Hindi , Manipuri