రక్షణ మంత్రిత్వ శాఖ
అతివాహక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా 6 క్యూబిట్ క్వాంటం ప్రాసెసర్ పరీక్షించిన డీఆర్డీవో యువ శాస్త్రవేత్తలు
Posted On:
28 AUG 2024 4:15PM by PIB Hyderabad
ఫుణేలోని డీఆర్డీవో- క్వాంటం టెక్నాలజీస్ యంగ్ సైంటిస్ట్స్ లెబొరేటరీ (డీఎస్ఎల్-క్యూటీ), ముంబయి టాటా ఫండమెంటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లకు చెందిన శాస్త్రవేత్తలు- అతివాహకత (సూపర్ కండక్టివిటీ) కలిగిన సర్క్యూట్ ఆధారంగా 6 క్యూబిట్ క్వాంటం ప్రాసెసర్ పని విధానాన్ని విజయవంతంగా పరీక్షించారు. డీఎస్ఎల్-క్యూటీ పర్యవేక్షక అత్యున్నత స్థాయి కమిటీ కూడా దీనిని పరిశీలించింది. క్లౌడ్ నుండి క్వాంటం సర్క్యూట్ ను సమర్పించడం, క్వాంటమ్ హార్డ్ వేర్ పై ప్రోగ్రాంను అమలు చేయడం, మదింపు ఫలితాలతో క్లౌడ్ అనుసంధానాన్ని(ఇంటర్ ఫేస్) కొత్త రూపంలోకి మార్చడం వంటివి ఈ పరీక్షలో భాగంగా ఉన్నాయి.
డీఎస్ఎల్-క్యూటీ, టిఐఎఫ్ఆర్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మధ్య త్రిముఖ భాగస్వామ్యంతో టిఐఎఫ్ఆర్ ముంబయిలోని కొలాబా క్యాంపస్‌లో ఈ ప్రాజెక్టును అమలు తీరును పరీక్షిస్తున్నారు. మార్కెట్టులో లభించే ఎలక్ట్రానిక్ పరికరాలు, స్వయంగా తయారు చేసుకున్న అభివృద్ధి బోర్డుల సాయంతో డీఎస్ఎల్-క్యూటీ శాస్త్రవేత్తలు క్వాంటం పరీక్షను నియంత్రించగలిగే, పరీక్ష సమాచారాన్ని సేకరించగలిగే పరికరాన్ని రూపొందించుకున్నారు.
శాస్త్రవేత్తలు క్యూబిట్లను టిఐఎఫ్ఆర్ లో రూపొందించగా, క్వాంటం ప్రాసెసర్ ను టిఐఎఫ్ఆర్ లో కొత్త రింగ్-రెసోనేటర్ డిజైన్ (టిఎప్ఐఆర్ నూతన ఆవిష్కరణ) ఆధారంగా అభివృద్ధి చేశారు. క్వాంటం పరికరాలతో మాట్లాడగలిగిన క్లౌడ్ ఆధారిత అనుసంధానాన్ని (ఇంటర్ ఫేస్)ని టీసీఎస్ అభివృద్ధి చేసింది.
క్వాంటం స్థాయి పరీక్షలు నిర్వహించుకునేందుకు దీనిని సిద్ధం చేస్తున్నారు. విద్య, పరిశోధన అవసరాలతోపాటు , అతి వాహక (సూపర్ కండక్టివిటీ) క్వాంటం పరికరాలను పరీక్షించడానికి ఈ కొత్త వ్యవస్థ ఉపకరిస్తుంది.
వివిధ స్థాయీ క్వాంటం కంప్యూటర్ల అభివృద్ధి, కార్యకలాపాలు, వాణిజ్యీకరణ, ఇందులో ఉన్న సాంకేతికపరమైన సవాళ్లు, అభివృద్ధి ప్రయత్నాలు, సమయం, ఆర్థిక వనరులకు అనుగుణంగా క్యూబిట్ల సంఖ్యను పెంచడం, స్కేలింగ్ ధోరణులను అంచనా వేయడం తదుపరి లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. క్వాంటం సిద్ధాంతం నుంచి ఇంజినీరింగ్, వాణిజ్యం వరకు అన్ని కోణాల్లో దీనిని వినియోగించుకోవాలన్న ఆలోచనతో ఈ క్వాంటం కంప్యూటర్లను పరీక్షిస్తున్నారు.
***
(Release ID: 2049598)
Visitor Counter : 84