కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ఈపిఎఫ్ఓలో ఈ ఏడాది 19.29 లక్షల కొత్త సభ్యులు
ఒక్క జూన్ లో 10.25 లక్షల మంది నమోదు
Posted On:
20 AUG 2024 6:40PM by PIB Hyderabad
ఈపిఎఫ్ఓ తాజాగా తాత్కాలిక డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం 2024 జూన్ నెలలో నికరంగా 19.29 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది.
అంతేకాకుండా, 2023 జూన్ తో పోలిస్తే నికర సభ్యుల జోడింపులో ఈ సంవత్సరానికి సంబంధించిన విశ్లేషణ ప్రకారం 7.86 శాతం వృద్ధిని సూచిస్తోంది. ఈ సభ్యత్వం పెరుగుదలకు ఉపాధి అవకాశాలు పెరగడం, ఉద్యోగులకు చేకూరే ప్రయోజనాలపై అవగాహన పెరగడం, ఈపిఎఫ్ఓ మరింత అందుబాటులోకి రావడం అనేక అంశాలు కారణమని చెప్పవచ్చు.
2024 జూన్ లో దాదాపు 10.25 లక్షల మంది కొత్త సభ్యులు నమోదు చేసుకున్నారని సమాచారం సూచిస్తుంది. మునుపటి 2024 మే నెలతో పోలిస్తే కొత్త సభ్యులు 4.08 శాతం మంది పెరిగారు. అంతకుముందు సంవత్సరం 2023 జూన్ తో పోలిస్తే పెరుగుదల 1.05 శాతంగా ఉంది. డేటాలో గుర్తించదగిన అంశం, జూన్ 2024లో జోడించిన మొత్తం కొత్త సభ్యుల సంఖ్యను చుస్తే, దానిలో గణనీయంగా 59.14 శాతం మంది 18-25 ఏళ్ల వయస్సు ఉన్న వారే ఉన్నారు. సంఘటిత రంగంలో చేరిన చాలా మంది- యువకులూ, మొదటిసారిగా ఉద్యోగంలో చేరిన వారు.
సుమారు 14.15 లక్షల మంది సభ్యులు నిష్క్రమించి, ఆ తర్వాత మళ్లీ ఈపిఎఫ్ఓలో చేరినట్లు హాజరుపట్టీ సమాచారం సూచిస్తోంది. ఈ సంఖ్య జూన్ 2023తో పోల్చితే ఏటా 11.79 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. ఈ సభ్యులు పాత ఉద్యోగాలను వదిలి కొత్త వాటికి మారారు. ఈపిఎఫ్ఓ పరిధిలోకి వచ్చే సంస్థల్లో తిరిగి చేరారు. అప్పటి వరకు దీర్ఘ-కాలంగా పిఎఫ్ లో పొదుపు చేసుకుంటూ వచ్చిన డబ్బుని, వెనక్కి తీసుకోకుండా సంచితాలను వేరే ఉద్యోగంలో చేరిన ఖాతాలోకి బదిలీ చేయడాన్ని ఎంచుకున్నారు. ఈ విధంగా ఆర్థిక శ్రేయస్సు, వారి సామాజిక భద్రతను కాపాడుకుంటున్నారు.
ఈ నెలలో జోడించిన కొత్త సభ్యులలో దాదాపు 2.98 లక్షల మంది కొత్త మహిళా సభ్యులు ఉన్నారని హాజరుపట్టీ సమాచారం వెల్లడించింది. 2023 జూన్ తో పోలిస్తే ఈ సంఖ్య సంవత్సరానికి 5.88 శాతం వృద్ధిని చూపుతోంది. అలాగే, 2023 జూన్ తో పోలిస్తే ఈ నెలలో నికర మహిళా సభ్యుల చేరిక 4.28 లక్షలకు చేరుకుంది. ఇది 2023 జూన్ తో పోలిస్తే 8.91 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తుంది. మరింత సమగ్రమైన, విభిన్నమైన దిశగా శ్రామికశక్తి విస్తృత మార్పును సూచిస్తుంది.
రాష్ట్రాల వారీగా హాజరుపట్టీ సమాచార విశ్లేషణ చుస్తే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, హర్యానా... ఈ ఐదు రాష్ట్రాలు/యూటీలలో నికర సభ్యుల చేరిక అత్యధికంగా ఉంది. ఈ రాష్ట్రాలు దాదాపు 61.16 శాతం నికర సభ్యుల చేరికను కలిగి ఉన్నాయి, ఈ నెలలో మొత్తం 11.8 లక్షల మంది నికర సభ్యులను జోడించారు. అన్ని రాష్ట్రాలలో, నెలలో 21.09 శాతం నికర సభ్యులను జోడించడం ద్వారా మహారాష్ట్ర ముందంజలో ఉంది.
పరిశ్రమల వారీగా వివరాల్లోకి వెళ్తే విశ్వవిద్యాలయం, కళాశాల, పాఠశాల వంటి చోట పని చేసే సభ్యులలో గణనీయమైన వృద్ధిని కనిపిస్తుంది. అలాగే ఫైనాన్సింగ్ , జనరల్ ఇన్సూరెన్స్, కాలేజీ, సొసైటీస్ క్లబ్‌లు లేదా అసోసియేషన్‌లు, యూనివర్శిటీ, ప్రైవేట్ రంగంలో ఎలక్ట్రానిక్ మీడియా కంపెనీలు మొదలైన వాటిలో కూడా ఈ వృద్ధి చోటుచేసుకుంది. మొత్తం నికర సభ్యత్వంలో, దాదాపు 40.70 శాతం మంది అదనంగా ఉన్న వారు నైపుణ్య సేవల (మ్యాన్ పవర్ సప్లయర్లు, సాధారణ కాంట్రాక్టర్‌లు, భద్రతా సేవలు, ఇతర కార్యకలాపాలు మొదలైనవి)కు చెందిన వారే.
ఉద్యోగి రికార్డును అప్‌డేట్ చేయడం నిరంతర ప్రక్రియ కాబట్టి, సమాచార నిధి సేకరణ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. హాజరు పట్టీ సమాచారం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మునుపటి డేటా ప్రతి నెలా నవీకరించడం జరుగుతుంది.
2017 సెప్టెంబర్ నుండి కవర్ చేస్తూ ఈపిఎఫ్ఓ 2018 ఏప్రిల్ నుండి హాజరుపట్టీ డేటాను విడుదల చేస్తూ వస్తోంది. నెలవారీ డేటాలో, ఆధార్ చెల్లుబాటు అయ్యే యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యుఏఎన్) ద్వారా మొదటిసారి ఈపిఎఫ్ఓలో చేరిన సభ్యుల సంఖ్య, ఈపిఎఫ్ఓ కవరేజీ నుండి నిష్క్రమించిన ప్రస్తుత సభ్యులు, నిష్క్రమించి తిరిగి సభ్యులుగా చేరిన వారి సంఖ్య లెక్క వేసి నికరంగా నెలవారీ ఖాతాదారుల సంఖ్య తో హాజరుపట్టీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నారు.
***
(Release ID: 2047181)
Visitor Counter : 61