బొగ్గు మంత్రిత్వ శాఖ
రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ జియోసైన్స్ అవార్డుల ప్రదానం
Posted On:
20 AUG 2024 1:36PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ‘నేషనల్ జియోసైన్స్ అవార్డ్స్-2023’ను మంగళవారం న్యూఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ, 2047కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్న భారతదేశం లక్ష్యాన్ని సాధించాలంటే ఖనిజ ఉత్పత్తిలో స్వయంసమృద్ధిని సాధించడం ముఖ్యమన్నారు. ప్రభుత్వం నేషనల్ జియోసైన్స్ డేటా రిపోజిటరీ పోర్టల్ ద్వారా జియోసైంటిఫిక్ డేటాను సమన్వయ పరచడం, ఖనిజ వనరుల అన్వేషణలో, గనుల తవ్వకాలలో కృత్రిమ మేధ తో పాటు కొత్తగా ఉనికిలోకి వస్తున్న సాంకేతికతలను ఉపయోగించడం వంటి అనేక ప్రయత్నాలను చేస్తుండడం సంతోషం కలిగిస్తోందని రాష్ట్రపతి అన్నారు. ఈ చర్యలు మనం మన ప్రాకృతిక సంపదను గురించి అవగాహనను ఏర్పరచుకొని దానిని సరైన రీతిలో ఉపయోగించేటట్టు చేస్తాయన్న విశ్వాసాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు.
అభివృద్ధి బాటలో మున్ముందుకు సాగిపోతున్న భారతదేశం కర్బన ఉద్గారాలను నికరంగా ‘సున్నా’ స్థాయికి చేర్చాలని నిశ్చయించుకొందని రాష్ట్రపతి అన్నారు. స్వచ్ఛ శక్తి ని పెద్ద ఎత్తున వినియోగించాలన్న మన ప్రయాసలు ఈ లక్ష్యానికి అనుగుణంగానే ఉన్నాయన్నారు. పలు విధాల కాలుష్యానికి పెద్దగా తావు ఉండని ‘హరిత’ లక్ష్యం దిశలో పయనించడానికి క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వంటి ఖనిజాల పైన ఇప్పటికన్నా ఎక్కువ శ్రద్ధను తీసుకోవలసిన అవసరం ఉందని శ్రీమతి ద్రౌపది ముర్ము స్పష్టంచేశారు. ‘నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్’ ను ఏర్పాటు చేయడం దేశం స్వయంసమృద్ధంగా రూపొందడంలో సాయపడుతుందని, అంతేకాక ఆర్థిక అభివృద్ధికి, కాలుష్యానికి పెద్దగా తావు ఉండని హరిత దశకు చేరుకోవడానికి అవసరమైన మహత్వపూర్ణ ఖనిజాల వేల్యూ చైన్ ను కూడా పటిష్టపరచ గలుగుతుందన్న విశ్వాసాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు. కొండచరియలు విరిగిపడటం అనే సమస్యతో సతమతం అవుతున్న రాష్ట్రాలన్నింటికి ముందస్తు అపాయ సూచనను జారీ చేయడానికి గాను కోల్ కతా లో నేషనల్ లాండ్ స్లయిడ్ ఫోర్ కాస్టింగ్ సెంటరును ఏర్పాటు చేసిన విషయం తెలిసి రాష్ట్రపతి సంతోషాన్ని వ్యక్తంచేశారు. కొండచరియలు విరిగిపడటం, వరదలు వంటి ఆపదల వల్ల వాటిల్లే హాని, నష్టం కనీస స్థాయికి పరిమితం అయ్యే విధంగా మన వ్యవస్థలను అసఫలం అయ్యేందుకు ఎంతమాత్రం తావులేనివిగాను, కచ్చితత్వంతో కూడినవిగాను తీర్చిదిద్దాలని రాష్ట్రపతి స్పష్టంచేశారు.
భారతదేశం భూవిజ్ఞాన శాస్త్ర చరిత్ర దేశంలోని శిలలు, మైదానాలు, శిలాజాలు, సముద్ర సంబంధిత పొరలలోను నిక్షిప్తమై ఉందని, దీనిని మన భౌమ వారసత్వంగా మనం వ్యవహరించ వచ్చని రాష్ట్రపతి అన్నారు. జియో-టూరిజమ్, జియో-హెరిటేజ్ స్థలాల ప్రాముఖ్యాన్ని తెలుసుకోవాలని యువతకు రాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు. జియో-టూరిజమ్ ప్రజలను జియోసైన్స్ రంగంలో చేరేందుకు ప్రోత్సహించే మాధ్యమం కాగలుగుతుందని ఆమె అన్నారు.
జియోసైన్సెస్ కు చెందిన వేరు వేరు రంగాలలో ప్రశంసయోగ్యమైన కార్యసాధనలను నెరవేర్చిన, విశేష సేవలను అందించిన వ్యక్తులను, బృందాలను సత్కరించాలన్న ధ్యేయంతో నేషనల్ జియైసైన్స్ అవార్డు ను ఇవ్వడాన్ని ప్రభుత్వ గనుల శాఖ మొదలుపెట్టింది.
***
(Release ID: 2047112)
Visitor Counter : 71