రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

కలైంజర్ కరుణానిధి శత జయంతి స్మారక నాణేన్ని విడుదల చేసిన రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్


సామాజిక న్యాయ యోధుడు, పారిపాలనాదక్షుడు, ఆదరణీయుడు అంటూ కితాబు: మంత్రి

ప్రజాస్వామ్య విలువ, సహకార సమాఖ్య విధానాలపై పీఎం- మోదీ ప్రభుత్వ విశ్వాసం: రక్షణ మంత్రి

Posted On: 18 AUG 2024 8:08PM by PIB Hyderabad

తమిళనాడుకు అయిదు సార్లు ముఖ్యమంత్రిగా సేవలను అందించిన కలైంజర్ యం. కరుణానిధి శత జయంతి స్మారక నాణేన్ని ఆగస్టు 18, 2024న రక్షణ శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి ప్రసంగిస్తూ, శ్రీ యం. కరుణానిధి దేశంలోని అత్యంత ఆదరణీయ నాయకులలో ఒకరనీ, భారత రాజకీయ శిఖరమనీ, పరిపాలనాదక్షుడనీ, సామాజిక న్యాయ యోధుడనీ, సాంస్కృతిక ఉద్యమసారధి అనీ కొనియాడారు.

ప్రజల మంచి కోసం తమిళనాడు పూర్వ ముఖ్యమంత్రి చేసిన సేవలను రక్షణమంత్రి గుర్తు చేశారు: ‘‘ తిరు కరుణానిధిలో తమిళ ఐక్యవాదం ఎంతో బలంగా ఉంది. అయితే, ప్రాంతీయ వాదం కారణంగా, దేశ సమైక్యతకు విఘాతం రాకూడదన్న అవగాహన ఆయనకు ఉంది. భారతదేశ ప్రజాస్వామ్యానికి ఉన్న బలం- విభిన్న గళాలను, వివిధ జాతులను ఐక్యపరచడంలోనే ఉందని ఆయన గ్రహించారు. ఆయన రాష్ట్రాల హక్కుల కోసం పోరాటం చేసేవారినీ, సమాఖ్యలో అందరికీ సమాన హక్కులు ఉండాలన్నదే ఆయన కోరిక. సమాఖ్యవాదానికి కట్టుబడి ఉండటంలోనే భారతీయత ఉంది. భారత దేశపు శక్తి- దాని భిన్నత్వంలోనే ఉంది. ఈ భిన్నత్వాన్ని సమతౌల్యం చేస్తూ, అందరూ అభివృద్ధి చెందడానికి సమాఖ్య విధానం దోహదపడుతున్నది’’ అని రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాధ్ సింగ్ అన్నారు. 

జాతీయ పరిపాలనలో, ప్రజాస్వామ్య సిద్ధాంతాలను సమర్ధించడంలో తన వంతు పాత్రను పోషించిన కరుణానిధి భారతదేశ ప్రజాస్వామ్యంపై చెరగని ముద్రను వేశారని శ్రీ రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఆయన విధానాల్లో అందరినీ కలుపుకుని పోవాలన్న భారతీయవాదం కనిపిస్తుందన్నారు. ఆయా విధానాలతో- పిల్లలు, మహిళలు వంటి బలహీన వర్గాలకు విద్యను అందించారు.

‘‘మహిళలు, సమాజంలో ఆదరణకు నోచుకోని వారి హక్కుల కోసం నిలబడిన వ్యక్తి- కలైంజర్ కరుణానిధి. లింగ వివక్షను తగ్గించేందుకు ప్రయత్నించారు. తద్వారా మహిళల సాధికారితను సుసాధ్యం చేశారు. మహిళలకు స్థానిక సంస్థలలో 33 శాతం రిజర్వేషను కల్పిస్తూ ఆయన ప్రభుత్వం చట్టం తెచ్చింది. మహిళల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడం వెనుక ఆయన కృషి ఉంది. వ్యవసాయ కార్మికులు, ట్రాన్స్ జెండర్ వ్యక్తులు సహా అసంఘటిత రంగంలోని వర్కర్ లకు సంక్షేమ మండళ్లను ఏర్పాటు చేయడంలో కూడా ఆయన కీలక పాత్రను పోషించారు. బలహీనులైన పౌరులతో ఒక దేశం వ్యవహరించే తీరును బట్టి ఆ దేశపు ప్రగతి ఆధారపడి ఉంటుందన్న మాటలు ఆయన చేపట్టిన కార్యక్రమాలు గుర్తు చేస్తున్నాయి’’ అని రక్షణ మంత్రి అన్నారు.

 

తిరు కరుణానిధిని ఒక పరిపాలన దక్షునిగా శ్రీ రాజ్ నాథ్ సింగ్ అభివర్ణించారు. శ్రీ కరుణానిధి అమలు చేసిన ‘మను నీతి తిట్టమ్’ కార్యక్రమాన్ని గురించి ప్రస్తావిస్తూ.. జిల్లాల అధికారులు వారంలో ఒక రోజు ప్రజల సమస్యలను వినడం కోసం కేటాయించారు. ‘‘శ్రీ కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అత్యంత ముఖ్యమైన వాటిలో - విద్యాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన ముఖ్యమైనవి. ఆయన దార్శనికత ఒక్క తమిళనాడుకు పరిమితం కాలేదు. ఏ ఒక్క రాష్ట్రం పురోగమించినా అది దేశ సమగ్రాభివృద్ధికి తోడ్పాటును అందిస్తుందని ఆయన గుర్తించారు. ఆయన సేవలు భారతదేశ పురోగతికీ, స్వయం సమృద్ధికీ ప్రతీక. దేశాభివృద్దిలోనే ప్రాంతీయాభివృద్ధి అంతర్భాగంమన్నది ఆయన ప్రయాణం గుర్తు చేస్తుంది. సహకారాత్మక సమాఖ్య వాదాన్ని ఇది ప్రతిఫలిస్తున్నది’’ అని శ్రీ రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

ప్రజాస్వామ్య విలువనీ, సహకారాత్మక సమాఖ్యవాదాన్నీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం నమ్ముతోందని రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ అన్నారు.  భారతదేశం 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే కాకుండా,  అభివృద్ధి, ప్రజలకు సాధికారిత- ప్రజాస్వామ్యం వల్లనే అన్న భరోసాని కూడా ప్రజలకు కలిగిస్తోందని మంత్రి అన్నారు.

 

అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత పక్షపాత రాజకీయాలకు మించినదని శ్రీ రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేస్తూ, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లను ఉత్తర్ ప్రదేశ్ లోను, తమిళనాడు లోను ఏర్పాటు చేయడాన్ని గుర్తు చేశారు. ‘‘దేశీయ రక్షణ తయారీ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు దిగుమతులపై ఆధార పడడాన్ని తగ్గించాలన్నదే ఈ కారిడార్ల స్థాపన లక్ష్యం. పెట్టుబడిని ఆకర్షించడం, నూతన ఆవిష్కరణలను పెంచడం, భారతదేశంలో రక్షణ సంబంధ ఉత్పత్తికి అనువైన ఒక పటిష్ట వ్యవస్థను నెలకొల్పడానికే ఈ కారిడార్లు రూపొందుతున్నాయి’’ అని ఆయన అన్నారు. కాశీ-తమిళ్ సంగమమ్, సౌరాష్ట్ర-తమిళ్ సంగమమ్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఉత్తర, పశ్చిమ భారతాల సంస్కృతులను దక్షిణ భారత సంస్కృతితో అనుబంధాన్ని ఏర్పరుస్తున్నాయని అన్నారు.

కలైంజర్ యం. కరుణానిధిని ఒక అధిక ఫలప్రదమైన రచయితగా, కవిగా, నాటక రచయితగా రక్షణ మంత్రి అభివర్ణించారు. శ్రీ కరుణానిధి సృజనలు తమిళ సాహిత్యాన్ని, తమిళ చలనచిత్ర రంగాన్ని సమృద్ధం చేశాయని మంత్రి అన్నారు. 

‘‘తమిళ భాషనీ, తమిళ సంస్కృతినీ ప్రోత్సహించడానికి శ్రీ కరుణానిధి చేసిన ప్రయత్నాల వెనుక- ఒక ప్రాంతానికి చెందిన సంస్కృతిని పరిరక్షించుకోవడంలోనే భారతదేశం ఉందన్న ఆయన గట్టి నమ్మకమే అందుకు కారణం. ఈ కార్యక్రమాన్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ యం.కె. స్టాలిన్, కేంద్ర సమాచార ప్రసార శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ తదితరులు హాజరయ్యారు.

***



(Release ID: 2046722) Visitor Counter : 54