బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జూన్‌లో 3.48 శాతం తగ్గిన జాతీయ బొగ్గు సూచీ

Posted On: 16 AUG 2024 3:21PM by PIB Hyderabad

జాతీయ బొగ్గు సూచీ(తాత్కాలిక అంచనా) గత ఏడాది జూన్‌లో నమోదైన 147.25 పాయింట్లతో పోలిస్తే  ఈ జూన్‌లో 3.48% తగ్గి  142.13 పాయింట్లుగా నమోదైంది. ఈ గణనీయమైన తగ్గుదలను గమనిస్తే మార్కెట్ లో డిమాండ్ కు తగినంత బొగ్గు లభ్యత ఉన్నవిషయాన్నితెలియజేస్తోంది.

జాతీయ బొగ్గు సూచీ(ఎన్‌సీఐ) బొగ్గు ధరను సూచిస్తుంది. అన్ని అమ్మకపు మార్గాల నుంచి అనగా నోటిఫైడ్ ధరలు, వేలం ధరలు, దిగుమతి ధరలను మిళితం చేసి ఈ సూచీని తయారు చేస్తారు. నియంత్రిత (విద్యుత్, ఎరువులు), అనియంత్రిత రంగాల్లో వివిధ రకాల కోకింగ్, నాన్ కోకింగ్ బొగ్గు ధరలను ఈ సూచీ పరిగణనలోకి తీసుకుంటుంది.
2017-18 ను ఆధార సంవత్సరంగా తీసుకుని ఈ  సూచీ ని తయారుచేశారు. మార్కెట్‌ పరిస్థితులు, ధరల హెచ్చుతగ్గుల వివరాలను ఇది తెలియజేస్తుంది.

వేలంలో బొగ్గు పలికే ధర పరిశ్రమ స్థాయిని తెలియజేస్తుంది. ఈ ధరల్లో గణనీయమైన తగ్గుదల ఉండటం మార్కెట్లో తగినంత బొగ్గు లభ్యతను సూచిస్తోంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2024 జూన్‌లో దేశ బొగ్గు ఉత్పత్తిలో 14.58% వృద్ధి నమోదైంది. ఇది బొగ్గుపై ఆధారపడిన వివిధ రంగాలకు స్థిరమైన సరఫరా ఉండటాన్ని నిర్ధారించటమే కాకుండా దేశ ఇంధన భద్రతకు గణనీయంగా దోహదం చేస్తుంది.

ఎన్‌సీఐలో తగ్గుదల మరింత సమతౌల్య మార్కెట్‌ను..సరఫరా, డిమాండ్ సమన్వయాన్ని కూడా సూచిస్తోంది. బొగ్గు లభ్యత సరిపడా ఉండటంతో దేశంలో పెరుగుతోన్న డిమాండ్‌ సమస్య పరిష్కారమవటమే కాకుండా, దీర్ఘకాలిక ఇంధన అవసరాలు కూడా తీరనున్నాయి. తద్వారా బొగ్గు లభ్యత విషయంలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా, దేశ సంపన్న భవిష్యత్తుకు ధీమా కలగజేస్తుంది.

***


(Release ID: 2046242) Visitor Counter : 55


Read this release in: English , Urdu , Hindi , Tamil