ఆయుష్

మూడు అవగాహనా ఒప్పందాలు: ఎం.డి.ఎన్.ఐ.వై చరిత్రలో ఓ కీలకఘట్టం!

Posted On: 14 AUG 2024 7:11PM by PIB Hyderabad

మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ (ఎండిఎన్ ఐవై) ఒకే రోజు మూడు సంస్థలతో అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేయడం ద్వారా గణనీయమైన పురోగతిని సాధించింది. ఎం.ఒ.యులు కుదుర్చుకున్న మూడు సంస్థలలో- ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గి కళాశాలజాతీయ భద్రతా దళం(ఎన్.ఎస్.జి)కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సిఐఎస్ఎఫ్) ఉన్నాయి.

ఎండిఎన్ఐవై చరిత్రలో దీనిని ఒక మైలురాయిగా అభివర్ణించవచ్చు. విద్యా సంస్థలనుంచి జాతీయ భద్రతా దళాల  వరకు వివిధ రంగాలకు  యోగా ప్రయోజనాలను అందించడం ఈ  ఒప్పందాల  లక్ష్యం.

 

ఎం.డి.ఎన్.ఐ.వై, – ఢిల్లీ విశ్యవిద్యాలయానికి చెందిన గార్గి కళాశాల మధ్య అవగాహనా ఒప్పందం:

ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గి కళాశాల, ఎం.డి.ఎన్,ఐ.వై కి మధ్య తొలి అవగాహనా ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఎం.డి.ఎన్.ఐ.వై డైరక్టర్ డాక్టర్ కాశీనాథ్ సమగండిగార్గి కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సంగీతా భాటియా ఈ ఒప్పందానికి ప్రాతినిధ్యం వహించారు.

ఫౌండేషన్ కోర్సుప్రొటోకాల్ ఇన్స్ట్రక్టర్ కోర్సు (సిసివైపిఐ)వెల్ నెస్ కోర్సు ఇన్స్ట్రక్టర్(సిసివైడబ్ల్యుఐ) వంటి ప్రాథమిక సర్టిఫికేషన్ కోర్సులను ప్రవేశపెట్టడం, అలాగే విద్యార్థినులలో వృత్తిపరమైన సమర్ధతను పెంచడంమహిళల సాధికారత కోసం పూర్తిస్థాయి ప్రత్యేక డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టడానికి గల అవకాశాలను పరిశీలించడం ఈ ఒప్పందం ఉద్దేశం.

ఎండిఎన్ఐవైఎన్.ఎస్.జిసిఐఎస్ఎఫ్ ల మధ్య ఎం.ఒ.యులపై సంతకాలు:

ఎం.డి.ఎన్.ఐ.వై మరో రెండు కీలక అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేసింది. ఎన్.ఎస్.జిసిఐఎస్ఎఫ్ ల కోసం క్రమం తప్పకుండా యోగా శిక్షణ కార్యక్రమాలు, ఇతర అనుబంధ కార్యక్రమాలు నిర్వహించడం ఈ ఒప్పందాల లక్ష్యం.  

రెండో ఒప్పందాన్ని హర్యానాలోని మనేసర్ లోగల జాతీయ భద్రతా గార్డుల (ఎన్.ఎస్.జి) శిక్షణ కేంద్రంతో కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంపై ఎండిఎన్ఐవై డైరక్టర్ డాక్టర్ కాశీనాథ్ సమగండి, ఎన్.ఎస్.జి కేంద్ర కార్యాలయ డిఐజి(ఆపరేషన్స్ట్రైనింగ్) బ్రిగేడియర్ శంకర్ జి తివారి సంతకాలు చేశారు. అలాగే మూడో అవగాహనా ఒప్పందాన్ని సిఐఎస్ఎఫ్ (పరిశోధనశిక్షణ) ఐ.జి శిఖాగుప్తా సమక్షంలోకేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సిఐఎస్ఎఫ్) శిక్షణ కేంద్రంతో కుదుర్చుకున్నారు.

ప్రత్యేక యోగా ప్రొటోకాల్స్ రూపొందించడంవర్క్ షాపులుసదస్సులు నిర్వహించడం భద్రతా దళాల సిబ్బందిపై యోగా ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు పరిశోధన కార్యక్రమాలు చేపట్టడం ఈ అవగాహనా ఒప్పందాల పరిధిలో ఉన్నాయి. దేశ భద్రతా బలగాల ఆరోగ్య కార్యక్రమాల్లో యోగాను చేర్చడం కీలకమైన ఒక ముందడుగుగా చెప్పుకోవచ్చు. ఫలితంగా ఈ బలగాల పనితీరు, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ గణనీయంగా మెరుగుపడనున్నాయి.

వివిధ రంగాల ఆరోగ్య అభ్యున్నతికి, ఒక సంపూర్ణ విధానంగా యోగాను ప్రోత్సహించడం ఎం.డి.ఎన్.ఐ.వై నిబద్ధతకు నిదర్శనం.

ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గి కాలేజి వంటి విద్యాసంస్థలతోఎన్.ఎస్.జిసిఐఎస్ఎఫ్ వంటి భద్రతా దళ సంస్థలతో భాగస్వామి కావడం ద్వారా ఎం.డి.ఎన్.ఐ.వై తన విస్తృతినీ, ప్రభావాన్నీ పెంచుకుంటున్నది. తద్వారా ప్రాచీన యోగా విధానం ద్వారా, ఆరోగ్య సంస్కృతిని పెంపొందించడంతోపాటు, వ్యక్తుల సాధికారతకు పాటుపడుతోంది.

 

***



(Release ID: 2045945) Visitor Counter : 28


Read this release in: English , Urdu , Hindi , Hindi_MP