గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్ ( పిఎంఎవై-జి ) అమలుకు మంత్రివర్గం ఆమోదం
Posted On:
09 AUG 2024 10:19PM by PIB Hyderabad
2024-25 నుండి 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు "ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్ (పిఎమ్ఎవై-జి) అమలు కోసం గ్రామీణాభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మైదాన ప్రాంతాల్లో యూనిట్ కు ప్రస్తుత రూ.1.20 లక్షలు, ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్ లలో యూనిట్ కు రూ.1.30 లక్షల చొప్పున మరో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తారు.
వివరాలు:
మంత్రివర్గం తెలిపిన ఆమోదం కింది అంశాలకు వర్తిస్తుంది.
-
ఆవాస్ + (2018) జాబితా (నవీకరణ తర్వాత) లోని మొత్తం అందరికి, సామాజిక ఆర్థిక కుల గణన (ఎస్ ఇ సి సి ) 2011 శాశ్వత నిరీక్షకుల జాబితా (పి డబ్ల్యు ఎల్) లోని అర్హత ఉన్న మిగిలిన కుటుంబాల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ ( పిఎంఎవై- జి ) ను కొనసాగిస్తారు దీని కింద 2024 ఏప్రిల్ నుంచి 2029 మార్చి వరకు కనీస సౌకర్యాలతో పక్కా ఇళ్లు నిర్మిస్తారు.
-
2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు రూ.2,05,856 కోట్ల కేంద్రవాటా, రూ.1,00,281 కోట్ల రాష్ట్ర వాటా కలిపి మొత్తం రూ.3,06,137 కోట్లు కేటాయించారు.
-
పిఎంఎవై- జి ని నీతి ఆయోగ్ మదింపు, ఇ ఎఫ్ సి పునఃసమీక్ష అనంతరం 2026 మార్చి తర్వాత కూడా ఈ పథకాన్ని కొనసాగించాలి.
-
సవరించిన మినహాయింపు ప్రమాణాలను ఉపయోగించి అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించడం కోసం ఆవాస్+ జాబితాను నవీకరిస్తారు.
-
లబ్దిదారులకు యూనిట్ కింద ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లో ఇస్తున్న రూ.1.20 లక్షలు, ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాల్లో ఇస్తున్న రూ.1.30 లక్షల చొప్పున సహాయం కొనసాగుతుంది.
-
పథకం నిధులలో 2% పరిపాలనా నిధులు అందించబడతాయి, ఇందులో 1.70% రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేస్తారు. 0.30% కేంద్రం వద్ద ఉంచుతారు.
-
పిఎంఎవై- జి ఇంతకు ముందు దశలో 31-03-24 నాటికి ఇంకా పూర్తి కాకుండా ఉన్న ఇళ్లను ప్రస్తుత రేట్ల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలి.
ప్రయోజనాలు:
-
31.03.2024 నాటికి పూర్తికాని మిగిలిన 35 లక్షల ఇళ్లను పూర్తి చేసి మునుపటి దశ లోని 2.95 కోట్ల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకోనున్నారు.
-
2024-2029 ఆర్థిక సంవత్సరం నుంచి తరువాతి ఐదేళ్లలో ఏర్పడే అవసరాల కోసం పి ఎం ఎవై-జీ కింద మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మించనున్నారు. మరో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణంతో దాదాపు 10 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది.
-
ఇళ్లు లేనివారందరికీ, , శిథిలావస్థలో ఉన్న కచ్చా ఇళ్లలో నివసిస్తున్న వారికి అన్ని మౌలిక వసతులతో నాణ్యమైన సురక్షితమైన ఇంటిని నిర్మించుకునేందుకు ఈ ఆమోదం దోహదపడుతుంది. ఇది లబ్ధిదారుల భద్రత, పరిశుభ్రత, సామాజిక సమ్మిళితకు దోహదపడుతుంది.
నేపథ్యం:
గ్రామీణ ప్రాంతాల్లో 'అందరికీ ఇళ్లు' లక్ష్యాన్ని సాధించడానికి కేంద్ర ప్రభుత్వం 2016 ఏప్రిల్ నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (పిఎంఎవై- జి) ను అమలు చేస్తోంది. ఇది 2024 మార్చి నాటికి దశలవారీగా ప్రాథమిక సౌకర్యాలతో 2.95 కోట్ల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
***
(Release ID: 2044206)
Visitor Counter : 122