వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

బాయిలర్స్ బిల్ 2024ను రాజ్యసభలో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం


శతాబ్దం నాటి పాత చట్టం స్థానంలో కొత్త బిల్లు

గతంలో నేరాలుగా పరిగణించిన వాటిని నేర రహితమైనవిగా పరిగణించడం ద్వారా బాయిలర్ బిల్లు విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

7 నేరాలలో మూడింటిని నేర రహితమైనవిగా పరిగణిస్తారు.

క్రిమినల్ నేరాల కిందికి రాని నేరాల విషయంలో సత్వర పరిష్కారం.
సులభతర వ్యాపారానికి వీలుగా, పనికిరాని నిబంధనల తొలగింపు.
కార్మికుల భద్రతకు ప్రాధాన్యతనివ్వనున్న కొత్త చట్టం.

Posted On: 08 AUG 2024 6:02PM by PIB Hyderabad

బాయిలర్స్ బిల్ 2024ను ఆగస్టు 8 గురువారం కేంద్ర వాణిజ్య ,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు బాయిలర్స్ చట్టం ,1923 (5 ఆఫ్ 1923)ను రద్దు చేస్తుంది.

అంతకుముందు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆగస్టు 2న కేంద్ర కేబినెట్ సమావేశమై 1923నాటి ప్రస్తుత బాయిలర్ చట్టాన్ని రద్దుచేసేందుకు , దాని స్థానంలో బాయిలర్స్ బిల్లు ,2024 ను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లులోని ముఖ్యాంశాలు కింది విధంగా ఉన్నాయి.

ఆధునిక బిల్లు రూపకల్పన పద్దతులకు అనుగుణంగా , బిల్లులోని ప్రొవిజన్లకు మరింత స్పష్టత నిచ్చేలా ఈ బిల్లును రూపొందించారు. బాయిలర్స్ చట్టం 1923లో ఒకే రకమైన ప్రొవిజన్లు  వివిధ చోట్ల ఉండడంతో అలాంటి వాటిని కొత్త బిల్లులోని ఆరు చాప్టర్లలో ఒక చోట చేర్చారు. దీనివల్ల ఈ ప్రావిజన్లను సులభంగా చదవడానికి,అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది.

 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వాలు, కేంద్ర బాయిలర్స్ బోర్డుల విధులు, అధికారాలను ఎలాంటి గందరగోళానికి తావులేకుండా, సవివరంగా పొందుపరిచారు.

సులభతర వ్యాపారానికి (ఇఒడిబి) వీలుగా ఈ బిల్లు బాయిలర్లను ఉపయోగించే వారికి , ఎం.ఎస్.ఎం.ఇ రంగంలోని వారితో సహా అందరికీ ప్రయోజనం కలిగించనుంది. ఇందుకు అనుగుణంగా ఈ బిల్లులో కొన్ని నేరాలను , క్రిమినల్ నేరాల పరిధి నుంచి తొలగించే ప్రొవిజన్లను చేర్చారు. బాయిలర్ల భద్రత, బాయిలర్లను పనిచేయించే వారి భ్రదత ను దృష్టిలో ఉంచుకుని ప్రాణ, ఆస్తి నష్టం కలిగించే ఏడు నేరాలలోని నాలుగు ప్రధాన నేరాల విషయంలో క్రిమినల్ పెనాల్టీలను అలాగే ఉంచారు. మిగిలిన నేరాల విషయంలో ఆర్ధిక పెనాల్టీలకు వీలుగా ప్రొవిజన్లు ఉండనున్నాయి. దీనికితోడు, క్రిమినల్ నేరాల పరిధిలోకి రాని వాటి విషయంలో ఫైన్ ను  పెనాల్టీగా మార్చి, ఇంతకు ముందులా కోర్టులు విధించేలా కాకుండా దీనిని ఎగ్జిక్యుటివ్ యంత్రాంగం విధించేలా చూడనున్నారు. ప్రతిపాదిత బిల్లు కార్మికుల భద్రతను మరింత పెంచనుంది. ఇందులో బాయిలర్లో పనిచేసేవారి భద్రతకు  వీలు కల్పించారు. అలాగే బాయిలర్ రిపేర్ పనులను తగిన అర్హతలుగల, సమర్ధులతో చేయించేలా చూడనున్నారు.

నేపథ్యం:

రాజ్యాంగం అమలులోకి రాకముందు ఉన్న అన్ని చట్టాలను అవి ప్రస్తుత కాలానికి ఏమేరకు పనికివస్తాయన్న దానిని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

బాయిలర్స్ చట్టం 1923 , రాజ్యాంగం అమలులోకి రాకముందరి చట్టం. ఇది బాయిలర్ల విషయంలో ప్రాణ రక్షణ, ఆస్తి రక్షణకు సంబంధించినది. అందువల్ల ప్రస్తుత చట్టంలోని ప్రొవిజన్లను సమీక్షించి , కొత్త బాయిలర్స్ బిల్లు 2024ను పార్లమెంటులో ప్రవేశపెట్టడం అవసరమని కేంద్ర ప్రభుత్వం భావించింది.

బాయిలర్స్ బిల్లును 2007 వ సంవత్సరంలో సమగ్రంగా సవరిస్తూ ఇండియన్ బాయిలర్స్ (సవరణ)చట్టం 2007 ను తీసుకువచ్చారు. ఇందులో  తనిఖీ , సర్టిఫికేషన్ వంటి వాటిని స్వతంత్ర తృతీయపక్షం తనిఖీ అథారిటీలకు అప్పగించే అంశాన్ని ప్రవేశపెట్టారు. అయితే, తదుపరి ప్రస్తుత చట్టాన్ని సమీక్షించిన మీదట,  జనవిశ్వాస్ (సవరణ ప్రొవిజన్ల) చట్టం 2023కు అనుగుణంగా  క్రిమినల్ నేరాలనుంచి తొలగించే ప్రొవిజన్లను చేర్చాల్సిన అవసరాన్ని గుర్తించారు.

ఆమేరకు ప్రస్తుత చట్టాన్ని సమీక్షించి, ఈ చట్టంలో పనికిరాని, కాలం చెల్లిన ప్రొవిజన్లను మినహాయించి,  గతంలో లేని, మరింత స్పష్టత నిచ్చే ప్రొవిజన్లు, నిబంధనలను చేర్చారు. కొన్ని కొత్త నిర్వచనాలనిచ్చి, ప్రస్తుతం ఉన్న కొన్ని నిర్వచనాలను సవరించి మరింత స్పష్టతనిచ్చేలా బిల్లులో ప్రొవిజన్లను చేర్చారు. (ఇందుకు సంబంధించన వివరాలు అనుబంధంలో ఉన్నాయి).

 

అనుబంధం:

బాయిలర్స్ బిల్లు 2024లోని ముఖ్యాంశాలు

దీనిని ఆరు చాప్టర్లుగా విభజించి, చాప్టర్ల వారీగా ప్రొవిజన్లు ఉండేలా చూశారు.( ప్రస్తుత చట్టంలో చాప్టర్లు లేవు, ఒకే రకమైన ప్రొవిజన్లు పలు చోట్ల ఉన్నాయి)

బాయిలర్స్ చట్టం 1923లోని కాలం చెల్లిన, పనికిరాని కింది నిబంధనలను తొలగించారు.

సెక్షన్ 1(2) : దేశం మొత్తానికి చట్టం వర్తింపు

సెక్షన్ 2ఎ :ఫీడ్ పైప్ లకు  చట్టం వర్తింపు

సెక్షణ్ 2బి : ఎకనోమైజర్ కు  చట్టం వర్తింపు

బాయిలర్స్ బిల్లు 2024 లోని క్లాజు 2 లో కింద పేర్కొన్న నిర్వచనాలను చేర్చారు.

2(కె) నోటిఫికేషన్, 2(పి) రెగ్యులేషన్ , 2(క్యు) రాష్ట్ర ప్రభుత్వం

బాయిలర్స్ చట్టంలోని ప్రొవిజన్లకు అనుగుణంగా, బాయిలర్స్ బిల్ 2024, క్లాజ్ –2లో కింద పేర్కొన్న నిర్వచనాలను సవరించారు.

2(డి) : బాయిలర్ కాంపొనెంట్

2(ఎఫ్) కాంపొనెంట్ అథారిటీ

2(జె) తనిఖీ అథారిటీ

బాయిలర్స్ చట్టం 1923 లోని కొన్ని ప్రొవిజన్లను , జన్ విశ్వాస్ (ప్రొవిజన్ల సవరణ)బిల్లులో పేర్కొన్న విధంగా క్లాజ్ 27,28,29,30,31, 39,42 లలో చేర్చారు. అలాగే రెండు కొత్త క్లాజులు 35(పరిష్కారం),  క్లాజ్ 36 ( అప్పీలు)లను బాయిలర్స్ బిల్లు 2024 లో చేర్చారు. ఆ మేరకు క్రిమినల్ నేరాల పరిధి కిందికి రాని నేరాల విషయంలో ఫైన్ ను, పెనాల్టీగా మార్చారు.(క్లాజులు 27,28,30(1), 31)

చట్టంలోని నిబంధనలు, రెగ్యులేషన్ల అమలుకు వీలు కల్పించే ప్రొవిజన్లను బిల్లులో పొందుపరిచారు. అవి క్లాజ్ 3(7), 5(8), 10(1)(ఎఫ్), 10(2),11(2), 12(9),23(4), 32(2).

నిబంధనలు రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వానికి గల అధికారం (క్లాజ్ 39), రెగ్యులేషన్లు చేసేందుకు బోర్టుకుగల అధికారం (క్లాజ్ 40), నిబంధనలు రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి గల అధికారం  (క్లాజ్ 42) లను బిల్లులోని వివిధ ప్రొవిజన్లకు అనుగుణంగా సవివరంగా పేర్కొన్నారు.

 

కింద పేర్కొన్న కొత్త ప్రొవిజన్లను బిల్లులో చేర్చారు.

1) క్లాజ్ 43 (ఇబ్బందులను తొలగించే అధికారం): బాయిలర్స్ చట్టం 2024 కింద మూడేళ్ల వ్యవధిలో, ప్రొవిజన్ల అమలులో తలెత్తే ఏవైనా ఇబ్బందులను తొలగించడం.

2) క్లాజ్ 44 ( తొలగింపు, రక్షణ) :  1923 నాటి బాయిలర్ల చట్టం కిందగల వివిధ నిబంధలు, రెగ్యులేషన్లు, ఆర్డర్లు తదితరాలను, కొత్త బాయిలర్ల చట్టం 2024 నోటిఫై అయ్యే వరకు కాపాడడానికి వీలు కల్పించడం.

ప్రస్తుతం ఉన్న డ్రాఫ్టింగ్ విధానాలకు అనుగుణంగా, వివిధ క్లాజులను   తిరగరాశారు. అలాగే వివిధ ప్రొవిన్లకు రెఫరెన్సులు చేర్చారు.

***



(Release ID: 2043543) Visitor Counter : 74


Read this release in: English , Urdu , Hindi , Hindi_MP