మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ప్రధాన మంత్రి మాతృ వందన యోజన ద్వారా గర్భిణులు, బాలింతలకు ఆర్థిక సాయం
प्रविष्टि तिथि:
07 AUG 2024 4:43PM by PIB Hyderabad
జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013లోని సెక్షన్ 4 ప్రకారం గర్భిణులు, బాలింతలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి మాతృ వందన యోజనను అమలు చేస్తున్నారు.
ప్రధానమంత్రి మాతృ వందన యోజన ద్వారా ప్రసూతి ప్రయోజనాలు మొదటి బిడ్డకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ విధానంలో ₹5,000/- లబ్ధిదారుని బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఖాతాకు నేరుగా బదిలీ అవుతాయి. ప్రసూతి ప్రయోజనాల కోసం ఆమోదించిన నిబంధనల ప్రకారం ప్రసవం తర్వాత జననీ సురక్ష యోజన కింద అర్హులైన మహిళలు, మిగిలిన నగదు ప్రోత్సాహకాన్ని పొందుతారు. తద్వారా, ఒక మహిళ సగటున రూ .6,000/- నగదు ప్రయోజనాన్నీ పొందగలుగుతుంది. ఈ పథకం కింద గర్భిణీ స్త్రీల రెండో కాన్పులో ఆడపిల్ల జన్మిస్తే ₹6,000/- నగదు ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తారు. ఆడపిల్లల పట్ల సానుకూల ప్రవర్తనా మార్పును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇది అమలు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అందిన సమాచారం ప్రకారం, ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృ వందన యోజన, జననీ సురక్ష యోజన పథకాలతో పాటు, డాక్టర్ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వైద్య సేవ అనే రాష్ట్ర ప్రాయోజిత ప్రసూతి ప్రయోజన పథకాన్ని అమలు చేస్తోంది, దీని కింద రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎంపిక చేసిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసవించే గర్భిణీ స్త్రీలందరికీ రూ .5,000/- ఇస్తున్నారు.
ఈ విషయాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2043095)
आगंतुक पटल : 212