రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సి.పి.ఇ.ఎన్.జి.ఆర్.ఎ.ఎమ్.ఎస్. పై పెండింగ్ లో ఉన్న కుటంబ పింఛను కేసుల పరిష్కారం కోసం 2024, జూలై 1వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించిన పింఛను మరియు పింఛనుదారుల సంక్షేమ శాఖ (డి.ఓ.పి.పి.డబ్ల్యూ.).


31.07.2024 వరకు సంబంధిత ఉద్యోగుల కృషితో డి.ఓ.పి.పి.డబ్ల్యూ. షేర్ చేసిన మొత్తం 72 కేసుల్లో 70 కేసులను పరిష్కరించిన భారతీయ రైల్వే.

Posted On: 01 AUG 2024 6:02PM by PIB Hyderabad

ప్రభుత్వం యొక్క 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, కేంద్రీకృత పింఛను ఫిర్యాదుల పరిష్కార మరియు పర్యవేక్షణ వ్యవస్థ (సి.పి.ఇ.ఎన్.జి.ఆర్.ఎ.ఎమ్.ఎస్.) అనే ఒక ఆన్‌లైన్ పోర్టల్‌లో పెండింగులో ఉన్న కుటుంబ పింఛను కేసులను సకాలంలో పరిష్కరించడం కోసం పింఛను మరియు పింఛనుదారుల సంక్షేమ శాఖ (డి.ఓ.పి.పి.డబ్ల్యూ.) 2024, జూలై 01 నుండి జూలై 31 వరకు మిషన్ మోడ్ విధానంలో ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.  

పైన పేర్కొన్న కార్యక్రమంలో భాగంగా, 01.07.2024 నుండి భారతీయ రైల్వేల సిబ్బంది ఈ ప్రత్యేక ప్రచారంలో రెట్టించిన ఉత్సాహంతో పాలుపంచుకుని విస్తృత లక్ష్యాలను చేపట్టారు.

భారతీయ రైల్వేలో ఈ ప్రచారం భారీ విజయాన్ని సాధించింది. భారతీయ రైల్వేలోని వివిధ స్థాయిలలో నోడల్ అధికారులు ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహించారు. పైస్థాయి నుండి కిందిస్థాయి వరకు ఉద్యోగులందరూ లక్ష్యాలను చేరుకోవడంలో చురుగ్గా కృషి చేసిన క్రమంలో 31.07.2024 నాటికి డి.ఓ.పి.పి.డబ్ల్యు. ద్వారా షేర్ చేయబడిన మొత్తం 72 కేసులలో 70 కేసులను రైల్వే శాఖ పరిష్కరించింది.

 కుటుంబ పింఛను ఫిర్యాదులు విజయవంతంగా పరిష్కరించబడిన కొన్ని విజయగాథలు కింది విధంగా ఉన్నాయి:

శ్రీమతి కవితా రాణి (సుభాష్ నగర్, ఉత్తర్ ప్రదేశ్) యొక్క ఫిర్యాదు – “పి.పి.ఓ.లో రివిజన్”

దివంగత తిలక్ రాజ్ సతీమణి శ్రీమతి కవితా రాణి తనకు సరైన కుటుంబ పింఛను రావడం లేదని సి.పి.ఇ.ఎన్.జి.ఆర్.ఎ.ఎమ్.ఎస్. పోర్టల్‌లో 05.06.204 తేదీన ఫిర్యాదు చేసింది అలాగే తన పి.పి.ఓ.లో రివిజన్ కోసం అభ్యర్థించింది. కొనసాగుతున్న ప్రత్యేక ప్రచారంలో భాగంగా ఆమె కేసును తీసుకుని, చురుగ్గా విచారణ చేశారు. చివరకుఆమెకు ఆర్థిక ఉపశమనం కల్పిస్తూ 10.06.2024న ఆమెకు సవరించిన పి.పి.ఓ. జారీ చేశారు. ఆమె ఫిర్యాదు చాలా తక్కువ వ్యవధిలో అంటే కేవలం 5 రోజుల్లోనే పరిష్కరించబడింది.

 శ్రీ సందీప్ కుమార్ (షహదరఢిల్లీ) యొక్క ఫిర్యాదు - “కుటుంబ పింఛనులో డి.ఏ. బకాయిలను చేర్చడం”

శ్రీ సందీప్ కుమార్ కుటుంబ పింఛనులో డి.ఏ. బకాయిలను చేర్చడం గురించి తన తల్లి శ్రీమతి ఆర్తి తరపున సి.పి.ఇ.ఎన్.జి.ఆర్.ఎ.ఎమ్.ఎస్. పోర్టల్‌లో 05.06.2024 తేదీన ఫిర్యాదు చేశారు. కొనసాగుతున్న ప్రత్యేక ప్రచారంలో భాగంగా అతని కేసు తీసుకోబడి, చురుగ్గా విచారించబడింది. చివరకుఏ.బీ.నంబరు 00784 తేదీ- 25.06.2024 ద్వారా ఆమోదించబడిన డి.సి.ఆర్.జి వ్యత్యాస మొత్తము రూ. 47460 మరియు డి.ఏ. బకాయిలు కలిపి 2024 జూలై నెల పింఛనుతో విడుదల చేయబడతాయని పేర్కొంటూ 04.07.2024న ఫిర్యాదును పరిష్కరించారు.

 

***


(Release ID: 2040619) Visitor Counter : 75


Read this release in: English , Urdu , Hindi , Hindi_MP