పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
దేశంలోని వివిధ ప్రాంతాల్లో విమాన రవాణా సేవలు మెరుగైన కనెక్టివినీ సాధించడంకోసం రూట్ డిస్పర్సల్ మార్గదర్శకాలను (ఆర్ డి జీలు) అమలు చేస్తున్న కేంద్రం
Posted On:
01 AUG 2024 7:14PM by PIB Hyderabad
దేశంలోని వివిధ ప్రాంతాల్లో విమాన రవాణా సేవలు మెరుగైన కనెక్టివినీ సాధించడంకోసం కేంద్రప్రభుత్వం రూట్ డిస్పర్సల్ మార్గదర్శకాలను (ఆర్ డి జీలు) అమలు చేస్తోంది. వీటి ప్రకారం దేశంలోని రూట్లను కేటగిరీ I, II, II-A , III గా విభజించారు. కేటగిరీ I కిందకు వచ్చే రూట్లను ఎంపిక చేయడానికి అనుసరించాల్సిన నిబంధనలు కింద విధంగా వున్నాయి.
విమానయాన దూరం 700 కిలోమీరట్లకు పైగా వుండాలి. సరాసరి సీట్ ఫ్యాక్టర్ 70 శాతానికి పైగా వుండాలి. ప్రతి ఏడాది వేసవి, శీతాకాల షెడ్యూళ్లలో ప్రయాణికుల సంఖ్య 5లక్షలు వుండాలి.
కేటగిరీ I కిందకు 20 రూట్లు వస్తున్నాయి. ఇవి ముంబై-ఢిల్లీ, ఢిల్లీ-బెంగళూరు, ముంబై-చెన్నై, హైదరాబాద్-ఢిల్లీ, బెంగళూరు-కోల్‌కతా, బెంగళూరు-పూణే, ఢిల్లీ-పాట్నా, ముంబై-కొచ్చిన్, ముంబై-చండీగఢ్, ముంబై-లక్నో, బెంగళూరు-ముంబై, ఢిల్లీ-కోల్‌కతా, ఢిల్లీ- చెన్నై, ముంబై-కోల్‌కతా, చెన్నై-కోల్‌కతా, అహ్మదాబాద్-ఢిల్లీ, ముంబై-జైపూర్, ఢిల్లీ-పూణే, ఢిల్లీ-గోవా, చెన్నై-పూణే.
ఈశాన్య ప్రాంతంలో కనెక్టయ్యే రూట్లను అంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ & కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలు, లడఖ్, అండమాన్ & నికోబార్ దీవులు, లక్షద్వీప్ దీవులలోని స్టేషన్లను కలిపే మార్గాలను కేటగిరీ-IIగా వర్గీకరించారు. షెడ్యూల్ ఆపరేటర్‌లందరూ కేటగిరీ-I రూట్‌లలో వారు నడుపుతున్న సామర్థ్యంలో కనీసం 10% కేటగిరీ-II మార్గాల్లో నడపాలి.
ఈశాన్యప్రాంతంలోని రూట్లలో వున్న హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ము అండ్ కశ్మీర్ కేంద్రపాలితప్రాంతాలు, లడఖ్, అండ మాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ దీవులు, కొచ్చిన్ అగత్తి కొచ్చిన్ స్టేషన్లను కేటగిరీ IIAగా వర్గీకరించారు. షెడ్యూల్ లో వున్న ఆపరేటర్లందరూ కేటగిరీ -1 రూట్లలలో వారు నడుపుతున్న సామర్థ్యంలో కనీసం 1 శాతం కేటగిరీ IIA రూట్లలో నడపాలి.
కేటగిరీ 1, 11, II-A కింద ప్రస్తావించకుండా మిగిలిపోయిన మార్గాలన్నీ కేటగిరీ -111 కిందకు వస్తాయి. ఆపరేటర్లందరూ కేటగిరీ 1 మార్గాలలో నడుపుతున్న సామర్థ్యంలో కనీసం 35శాతాన్ని కేటగిరీ 111 రూట్లలో నడపాలి.
లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మొహోల్ రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానమిది.
****
(Release ID: 2040617)
Visitor Counter : 59