పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
దివ్యాంగుడైన చిన్నారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి విమానయానాన్ని తిరస్కరించిన సంస్థకు రూ.5 లక్షల జరిమానా విధించిన పౌరవిమానయాన డైరెక్టర్ జనరల్
Posted On:
01 AUG 2024 7:15PM by PIB Hyderabad
దివ్యాంగుడైన ఒక చిన్నారి, తన తల్లిదండ్రులతో కలిసి విమానం ఎక్కబోతున్న సమయంలో ఆ విమాన సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించి వారిని విమానంలోకి ఎక్కించుకోలేదు. ఈ ఘటన 7-5-2022న జరిగింది. దీనికి సంబంధించిన ఫిర్యాదు అందగానే దానిపై నిజనిర్ధారణ కమిటీని వేసింది పౌర విమానయాన డైరెక్టర్ జనరల్. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ విమానయాన సంస్థపై రూ. 5 లక్షల జరిమానా విదించింది.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చైతన్యం పెంచడంకోసం దివ్యాంగుపట్ల ఎలా వ్యవహరించాలో సంబంధిత వ్యక్తులందరికీ తెలియజేయడం కోసం దివ్యాంగుల ప్రయాణంకోసం రూపొందించిన పౌర విమానయాన అవసరాలు ( సివిల్ ఏవియేషన్ రిక్వైర్ మెంట్స్ సిఏఆర్ ) సెక్షన్ 3, సిరీస్ ఎం, పార్ట్ 1 విధానం ప్రకారం డిజిసీఏ శిక్షణా కార్యక్రం నిర్వహిస్తోంది. ఇందుకోసం కేంద్ర సామాజిక న్యాయ శాఖ తయారు చేసిన మాడ్యూల్ ప్రకారంఈ శిక్షణను నిర్వహిస్తారు. ఈ శిక్షణను విమానయానసంస్థలో పని చేసే సిబ్బంది అందరికీ, విమానాశ్రయ నిర్వాహకులకు, భద్రతా సిబ్బందికి, పౌర సేవలందించే కస్టమ్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ బ్యూరో అధికారులకు అందిస్తున్నారు.
విమానయానం నిరాకరించినప్పుడు, విమాన ప్రయాణాన్ని రద్దు చేసినప్పుడు, ఆలస్యంగా విమాన సేవలు జరుగుతుంటే సంబంధిత ప్రయాణికులకు అందించాల్సిన సదుపాయాలు అనే పేరుమీద పౌరవిమానయాన అవసరాలు (సిఏఆర్ ) సెక్షన్ 3, సిరీస్ ఎం, పార్ట్ 4 విధానాన్ని డిజిసీఏ విడుదల చేసింది. తద్వారా విమానప్రయాణికులకు తగిన భద్రతను కల్పించడం జరుగుతోంది.
డిజిసీఏ విడుదల చేసిన నియమ నిబంధనల్ని ఆయా విమానయాన సంస్థలు ఎలా అమలు చేస్తున్నాయో తెలుసుకోవడంకోసం డిజిసీఏ దేశవ్యాప్తంగా విమనాశ్రయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుంటుంది.
...............
లోక్ సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర పౌర విమానయాన మంత్రి శ్రీ మురళీధర్ మొమోల్ రాతపూర్వకంగా ఇచ్చిన సమాచారమిది.
***
(Release ID: 2040614)
Visitor Counter : 63