పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఎల్‌పీజీ కనెక్షన్లు
నాడు పోస్టు చేయడమైనది:
01 AUG 2024 1:49PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా పేద కుటుంబాల్లోని వయోజన మహిళా సభ్యురాలి పేరిట ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్ అందించేందుకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పిఎంయువై) ను 01.05.2016 న ప్రారంభించారు. ఈ పథకం ప్రాథమిక లక్ష్యం పేద కుటుంబాలకు స్వచ్ఛమైన గృహ ఇంధనాన్ని అందించడం ద్వారా, తీవ్రమైన గృహ వాయు కాలుష్యానికి కారణమయ్యే కట్టెలు, బొగ్గు, ఆవు పేడ వంటి సాంప్రదాయ వంట ఇంధనం వాడకంతో సంబంధం ఉన్న తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను తగ్గించడం, వారి ఆరోగ్యాన్ని రక్షించడం. వంట ఇంధనంగా ఎల్‌పిజిని ఉపయోగించడం వల్ల మహిళలు కట్టెలు సేకరించే శ్రమ నుండి విముక్తి పొందుతారు. వంట చేయడానికి వెచ్చించే సమయం తగ్గుతుంది. అటవీ నిర్మూలనను నివారిస్తుంది. 01.07.2024 నాటికి దేశవ్యాప్తంగా 10.33 కోట్ల పీఎంయూవై కనెక్షన్లు ఇవ్వడం జరిగింది.
దేశంలో ఎల్‌పిజి వాడకాన్ని పెంచడానికి, పిఎంయువైని ప్రోత్సహించడానికి కేంద్రం అనేక ప్రచారాలను నిర్వహించడం జరిగింది. ఎల్‌పీజీ పంచాయితీల ద్వారా కనెక్షన్ల నమోదు, పంపిణీ చేయడానికి మేళాలు, శిబిరాలను నిర్వహించడం, అవుట్ ఆఫ్ హోమ్ (ఓహెచ్) హోర్డింగులు, రేడియో జింగిల్స్, ఐఈసీ వ్యాన్లు.. మొదలైన వాటి ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించింది. ఇతర సంప్రదాయ ఇంధనాల కంటే ఎల్‌పిజిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేసింది. ఎల్‌పిజిని సురక్షితంగా ఉపయోగించడం వంటి అనేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా పలు సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. వినియోగదారులు, వారి కుటుంబాల ఆధార్ నమోదు, బ్యాంకు ఖాతాలను తెరవడం, పిఎంయువై కనెక్షన్లు పొందే ప్రక్రియను సరళతరం చేయడం, www.pmuy.gov.in పిఎంయువై కనెక్షన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు, సమీప ఎల్పిజి పంపిణీదారులు, కామన్ సర్వీస్ సెంటర్లు (సిఎస్సి) మొదలైనవి ఏర్పుటు చేశారు. అదేవిధంగా 5 కిలోల డబుల్ బాటిల్ కనెక్షన్ (డిబిసి), 14.2 కిలోల నుండి 5 కిలోల గ్యాస్ కు మార్చుకునే వీలు కల్పించారు. చిరునామా రుజువు, రేషన్ కార్డుకు బదులుగా సెల్ఫ్ డిక్లరేషన్‌పై కొత్త కనెక్షన్ పొందడానికి వలస కుటుంబాలకు అవకాశం కల్పించడం.
ఒఎంసిలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నిరంతరం కొత్త ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్ లను ప్రారంభిస్తున్నాయి. పిఎంయువై పథకాన్ని ప్రారంభించినప్పటి నుండి, ఒఎంసిలు దేశవ్యాప్తంగా 7905 డిస్ట్రిబ్యూటరీషిప్లను ప్రారంభించాయి. వీటిలో 7,325 (అంటే 93%) గ్రామీణ ప్రాంతాలకు సేవలందిస్తున్నాయి (01.04.2016 నుండి 30.06.2024 వరకు). ఈ ప్రయత్నాల ఫలితంగా, పిఎంయువై లబ్ధిదారుల తలసరి వినియోగం సంవత్సరానికి 3.95 ఇంధన రిఫిల్స్ కు మెరుగుపడింది. అంతేకాకుండా, దేశంలో ఎల్పిజి కవరేజ్ ఏప్రిల్ 2016 లో 62% నుండి ఇప్పుడు సంతృప్తత స్థితికి చేరుకుంది.
స్వతంత్ర అధ్యయనాలు, నివేదికలు పిఎంయువై పథకం గ్రామీణ కుటుంబాల జీవితాలపై, ముఖ్యంగా గ్రామీణ మారుమూల ప్రాంతాల్లోని మహిళలు, కుటుంబాలపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపించాయి.
సాంప్రదాయ వంట పద్దతుల్లో కలప, పేడ, పంట అవశేషాలు వంటి ఘన ఇంధనాలను కాల్చే వ్యవస్థ నుండి పిఎంయూవై కి మారింది. పరిశుభ్రమైన ఇంధనం వాడకం ద్వారా గృహంతర్గత వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుంది. సాధారణంగా ఇంటి పొగకు ఎక్కువగా గురయ్యే మహిళలు, పిల్లలలో ఇది మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యానికి దారితీస్తుంది.
గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని కుటుంబాలు తరచుగా సాంప్రదాయ వంట ఇంధనాలను సేకరించడానికి వారి సమయాన్ని, శక్తిలో గణనీయమైన భాగాన్ని వెచ్చిస్తారు. ఎల్‌పీజీ కనెక్షన్ల ద్వారా పేద కుటుంబాల్లోని మహిళలు వంట చేయడానికి వెచ్చించే సమయం, శ్రమ తగ్గింది. తద్వారా వారి వద్ద ఉన్న ఖాళీ సమయాన్ని ఆర్థిక ఉత్పాదకతను పెంపొందించడానికి బహుళ రంగాలలో ఉపయోగించుకోవచ్చు.
వంట ప్రయోజనాల కోసం ఎల్‌పీజీకి మారడం ద్వారా సాంప్రదాయ ఇంధనాల నుండి కలప, ఇతర బయోమాస్ పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఇది అటవీ నిర్మూలన, పర్యావరణ క్షీణత తగ్గడానికి దారితీస్తుంది. ఇది గృహాలకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా విస్తృతమైన పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలకు దోహదం చేస్తుంది.
వంట కోసం ఎల్‌పీజీ ఉపయోగించడం అగ్ని ప్రమాదాలను సైతం తగ్గిస్తుంది, ఇది మహిళలు, పిల్లల భద్రతకు చాలా ముఖ్యమైనది. సాంప్రదాయ వంట పద్ధతులు వాడటం ద్వారా సాధారణంగా జరిగే చిన్న అగ్ని గాయాలు తగ్గించబడతాయి. ఇది సురక్షితమైన ఇంటి వాతావరణానికి దోహదం చేస్తుంది.
కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి లోక్ సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
***
(రిలీజ్ ఐడి: 2040607)
సందర్శకుల సూచీ సంఖ్య : : 128