గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

క్లిష్టమైన ఖనిజ (క్రిటికల్ మినరల్స్ ) బ్లాక్ ల వేలం

Posted On: 31 JUL 2024 3:47PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం గనులు - ఖనిజాల (అభివృద్ధి- నియంత్రణ) (ఎంఎండిఆర్) చట్టం, 1957 ను ఎంఎండిఆర్ సవరణ చట్టం, 2023 ద్వారా సవరించింది, దీని ద్వారా ఎంఎండిఆర్ చట్టం, 1957 లోని షెడ్యూల్ -1 కు పార్ట్ డి లోని 24 కీలకమైన,  వ్యూహాత్మక ఖనిజాలను వేలం వేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లభించింది. ఇంతవరకు లిథియం, ఆర్ఇఇ, గ్రాఫైట్, వనాడియం, నికెల్, క్రోమియం, గ్లాకోనైట్, ప్లాటినం గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ (పి జి ఇ ), ఫాస్ఫరైట్ వంటి ఖనిజాలున్న 14 కీలకమైన ఖనిజ బ్లాకులను విజయవంతంగా వేలం వేసింది. బీహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఈ బ్లాకులు విస్తరించి ఉన్నాయి.

ఇంకా, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు నుంచి గ్రాఫైట్, గ్లాకోనైట్, గ్లాకోనైట్, పొటాష్, టంగ్ స్టన్, వనాడియం, గ్లాకోనైట్, కోబాల్ట్, క్రోమియం వంటి 21 కీలకమైన ఖనిజ బ్లాకులను వేలానికి నోటిఫై చేశారు.

భారతదేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు కీలకమైన ఖనిజాల సరఫరా కు, అధునాతన సాంకేతిక రంగాలతో సహా కీలక రంగాల అవసరాలను తీర్చడానికి భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది.

అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి అవసరమైన కీలకమైన ఖనిజాల దేశీయ సరఫరా కోసం గనులు-  ఖనిజాల (అభివృద్ధి - నియంత్రణ) చట్టం, 1957 (ఎంఎండిఆర్ చట్టం), ఆఫ్ షోర్ ఏరియాస్ మినరల్ (అభివృద్ధి -నియంత్రణ) చట్టం, 2002 (ఒఎఎమ్ డి ఆర్ చట్టం) లను 2023 లో సవరించారు. కీలకమైన, వ్యూహాత్మక ఖనిజాల అన్వేషణ, మైనింగ్ పెంచడం, హైటెక్ ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడం ఈ సవరణల లక్ష్యం.ఇంకా , కీలకమైన ఖనిజాలతో సహా 29 లోతైన ఖనిజాల కోసం ఎక్స్ ప్లొరేషన్ లైసెన్స్ అనే కొత్త ఖనిజ రాయితీని ప్రవేశపెట్టారు. ఇది ఈ ఖనిజాల కోసం గుర్తింపు, అన్వేషణ కార్యకలాపాలను చేపట్టడానికి లైసెన్స్ దారుని అనుమతిస్తుంది.

అన్వేషణలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి గనుల మంత్రిత్వ శాఖ 22 ప్రైవేట్ ఎక్స్ ప్లోరేషన్ ఏజెన్సీలను (ఎన్ పి ఇ ఎ ) నోటిఫై చేసింది. నేషనల్ మినరల్ ఎక్స్ ప్లోరేషన్ ట్రస్ట్ (ఎన్ ఎంఇటి) నిధులతో ఈ సంస్థలు అన్వేషణ ప్రాజెక్టులను చేపడుతున్నాయి.

2023 లో, గనుల మంత్రిత్వ శాఖ ఆర్ అండ్ డి,  వాణిజ్యీకరణ మధ్య అంతరాన్ని తగ్గించడానికి గనులు, ఖనిజ రంగంలో పనిచేసే స్టార్టప్ లు, ఎంఎస్ఎంఇ లలో పరిశోధన , ఆవిష్కరణలకు నిధులు సమకూర్చడానికి ఎస్ అండ్ టి-ప్రిజం (స్టార్టప్ లు, ఎంఎస్ఎంఇ లలో పరిశోధన , ఆవిష్కరణల ప్రోత్సాహం) ను ప్రారంభించడం ద్వారా ఎస్ అండ్ టి కార్యక్రమం పరిధిని విస్తరించింది.

కీలకమైన ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్న ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చిలీ, మొజాంబిక్ వంటి వనరుల సంపన్న దేశాలతో గనుల మంత్రిత్వ శాఖ ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంది. కీలకమైన ఖనిజాల అన్వేషణ, అభివృద్ధిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చు కోవడం ఈ ఒప్పందాల ఉద్దేశం. 

మంత్రిత్వ శాఖ అధీనం లోని సంయుక్త భాగస్వామ్య కంపెనీ - ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ (కాబిల్) అర్జెంటీనాలోని కాటమార్కా ప్రావిన్స్ లోలిథియం అన్వేషణ, మైనింగ్ కోసం 15,700 హెక్టార్ల భూమిని సేకరించింది. 

2015 నుండి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కీలకమైన ఖనిజాలతో సహా వివిధ ఖనిజాలకు సంబంధించిన 244 జియోలాజికల్ రిపోర్టులు, 324 జియోలాజికల్ మెమోరాండంలను ఖనిజ బ్లాకుల వేలం కోసం ప్రధాన ఖనిజ రాష్ట్రాలకు , గనుల మంత్రిత్వ శాఖకు అందజేసింది.

ఖనిజ వనరుల లభ్యత , విశ్వసనీయ సరఫరా గొలుసు  ద్వారా ఈ కార్యక్రమాలు భారతదేశ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తాయి.

 కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ రోజు లోక్ సభ లో ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపారు. 

 

***



(Release ID: 2040062) Visitor Counter : 49


Read this release in: English , Hindi , Hindi_MP , Tamil