ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కౌమారదశ పిల్లల క్షేమంకోసం రాజీలేని నిబద్దతతో భారతదేశం కృషి చేస్తోందని స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి. భారతదేశ కౌమార దశ పిల్లల క్షేమానికి సంబంధించి పెట్టుబడుల ఆర్ధిక పరిస్థితిపై తయారు చేసిన నివేదిక విడుదల సందర్భంగా మాట్లాడిన కేంద్ర ఆరోగ్యశాఖా కార్యదర్శి.
కౌమారదశ పిల్లల క్షేమంకోసం భారదేశం చేసిన కృషి కారణంగా గణనీయమైన మార్పులు వచ్చాయని ప్రత్యేకంగా పేర్కొన్న నివేదిక. కౌమార దశ పిల్లల ఆరోగ్యం, సంక్షేమం కోసం విస్తృత విధానాలు, కార్యక్రమాల నిర్వహణ చేపట్టిన ప్రభుత్వం.
కౌమారదశ పిల్లల ప్రతిభను అభివృద్ధి చేయడానికి చేస్తున్న నిబద్దమైన కృషి దృఢంగా కొనసాగుతుంది. వారి ఆశలు ఆకాంక్షలకు చేయూతనిస్తూ వారిని సాధికారులను చేస్తూ అందరికీ సరైన భవిష్యత్తు కల్పించడం జరుగుతుంది : శ్రీ అపూర్వ చంద్ర
రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ్య కార్యక్రమ్ ను ప్రారంభించిన మొట్టమొదటి దేశం భారతదేశం. అణగారిన వర్గాల కౌమారదశ పిల్లల అభివృద్ధిపై ప్రత్యేక దృషితో దేశంలోని 253 మిలియన్ల కౌమారదశ పిల్లలకోసం అంకితభావంతో కృషి చేస్తున్న కార్యక్రమమిది
కౌమారదశ పిల్లల సామాజిక ఆర్థిక నేపథ్యాలతో పని లేకుండా దేశంలోని పిల్లలందరినీ చేరుకోవడానికి స్వచ్ఛంద సేవాసంస్థలతో, కమ్యూనిటీ నాయకులతో, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం నెలకొల్పిన కేంద్ర ప్రభుత్వం
Posted On:
25 JUL 2024 2:07PM by PIB Hyderabad
కౌమారదశ పిల్లల ప్రతిభను అభివృద్ధి చేయడానికి భారతదేశం చేస్తున్న నిబద్దమైన కృషి దృఢంగా కొనసాగుతుంది. వారి ఆశలు ఆకాంక్షలకు చేయూతనిస్తూ వారిని సాధికారులను చేస్తూ అందరికీ సరైన భవిష్యత్తు కల్పించడం జరుగుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర స్పష్టం చేశారు.
భారతదేశ కౌమార దశ పిల్లల క్షేమానికి సంబంధించిన పెట్టుబడుల ఆర్ధిక పరిస్థితిపై తయారు చేసిన నివేదిక విడుదల సందర్భంగా మాట్లాడిన కేంద్ర ఆరోగ్యశాఖా కార్యదర్శి ఈ ప్రకటన చేశారు. జెనీవాలో జరిగిన 77వ ప్రపంచ ఆరోగ్య సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమ ఫలితాల మీద ఆధారపడి ఈ నివేదికను రూపొందించడం జరిగింది. మారుతున్న ప్రపంచంలో కౌమారదశ పిల్లు- అత్యవసర పెట్టుబడుల అవకాశం అనే ఈ కార్యక్రమాన్ని పార్టనర్ షిప్ ఫర్ మెటర్నల్, న్యూబార్న్, అండ్ ఛైల్డ్ హెల్త్ ( పిఎంఎన్ సి హెచ్) నిర్వహించింది. గత కొన్ని దశాబ్దాలలో భారతదేశ కౌమార దశ పిల్లల సంక్షేమంలో వచ్చిన మార్పులను ఈ నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావిసోతంది. కౌమారదశ పిల్లల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రప్రభుత్వం అమలు ఏసిన విస్తారమైన విధానాలు, కార్యక్రమాలను ఈ నివేదిక పట్టి చూపింది.
కౌమారదశ పిల్లలు 253 మిలియన్ల మంది భారతదేశంలోనే వున్నారని, ఇది ఈవిషయంలో అత్యధిక జనాభా అని శ్రీ అపూర్వ చంద్ర పేర్కొన్నారు. మన కౌమారదశ పిల్లలు మాన దేశ భవిష్యత్తుకు వెన్నెముకలాంటివారని ఆయన అన్నారు. వారు దేశ ప్రగతికి కారణమవుతారని అన్నారు.
కౌమారదశ పిల్లల ప్రగతికోసం భారతదేశం చేస్తున్న రాజీలేని కృషిని ఆయన వివరించారు. జాతీయ, అంతర్జాతీయ అభివృద్ధి లక్ష్యాలను ముఖ్యంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ( ఎస్ డిజి)లను అందుకోవడానికి వారి ఆరోగ్యం, విద్య, ఉద్యోగ ఉపాధి అనేవి చాలా ముఖ్యమని ఆయన అన్నారు. కౌమార దశ యువత సరిగా జీవించేలా, సరైన నిర్ణయాలు తీసుకునేలా, సమాజానికి సరైన విధంగా సేవ చేసేలా వారికోసం సరైన వాతావరణం కల్పించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని అన్నారు.
రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ్య కార్యక్రమ్ (ఆర్ కె ఎస్ కె) ను ప్రారంభించిన మొదటి దేశ భారతదేశమని ఆయన ప్రత్యేకంగా తన ప్రసంగంలోప్రస్తావించారు. దేశంలోని 253 మంది కౌమారదశ యువతను చేరుకోవడానికి ఈ కార్యక్రమాన్ని తయారు చేశారని మగ ఆడ, గ్రామీణ, పట్టణ అనే తేడా లేకుండా వివాహమైందా, కాలేదా అనే తేడా లేకుండా చదువుకుంటున్నవారితోపాటు చదువుకోని యువతను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని రూపొందించామని అన్నారు.
అణగారిన వర్గాల కౌమార దశ పిల్లల ప్రగతిపై ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించామని స్పష్టం చేశారు. ఆయుష్మాన్ భారత్ కింద అమలు చేస్తున్న పాఠశాల స్థాయి ఆరోగ్య సంక్షేమ కార్యక్రమం పాఠశాల విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకోసం ఉద్దేశించినదని, దీన్ని శిక్షణ పొందిన ఉపాధ్యాయులు నిర్వహిస్తున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. కౌమారదశ బాలికల రుతుస్రావ ఆరోగ్యంకోసం అమలు చేస్తున్న కార్యక్రమంద్వారా రుతుస్రావ ఆరోగ్య విధానాలపై తగిన చైతన్యాన్ని పెంచుతున్నామని ఆయన అన్నారు. కౌమారదశ పిల్లల సామాజిక ఆర్థిక నేపథ్యాలతో పని లేకుండా దేశంలోని పిల్లలందరినీ చేరుకోవడానికి స్వచ్ఛంద సేవాసంస్థలతో, కమ్యూనిటీ నాయకులతో, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం నెలకొల్పి పని చేస్తున్నామని ఆయన అన్నారు.
కోవిన్ ప్లాట్ఫామ్ మాదిరిగానే యు విన్ ప్లాట్ ఫామ్ (వేదిక)ను ప్రారంభించడానికి భారతదేశం సిద్ధంగా వుందని శ్రీ చంద్ర అన్నారు. ఈ ప్లాట్ ఫామ్ అనేది మార్పును తెస్తుందని కౌమార దశ యువత ఆరోగ్య రికార్డులను దాచడమే కాకుండా, వాటిని డిజిటల్ చేస్తుందని తద్వారా వాటి పర్యవేక్షణ, సవాళ్లను గుర్తించడం, వాటిని పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.
కేంద్ర విద్యాశాఖ అదనపు కార్యదర్శి శ్రీ ఆనందరావు పాటిల్ మాట్లాడుతూ పాఠశాల విద్యకోసం బడ్జెట్ కేటాయింపులు పెంచిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. విద్యాప్రణాళికలో చేసిన మార్పులను తెలియజేశారు. 6వ తరగతి తర్వాత విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడంపై ప్రత్యేక దృష్టిని కేటాయించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రత్యే అవసరాలున్న పిల్లలకోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రత్యేక కృషిని, బాలికల విద్య, మధ్యాహ్న భోజనపథకం అమలు కోసం చేస్తున్న కృషిని వివరించారు. రుతుస్రావ ఆరోగ్య సంరక్షణపై చాలా పాఠశాలలు దృష్టి పెట్టాయని, మిగతా పాఠశాలల్లో కూడా ఆ పని జరిగేలా చూస్తామని ఆయన అన్నారు. భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ కౌమారదశ పిల్లల ఆరోగ్య కార్యక్రమం అమలవుతోందని ఆయన అన్నారు.
కౌమారదశకు చెందిన పిల్లలు ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ వున్నారని వారిలో ఐదో వంతుమంది భారతదేశంలో నివసిస్తున్నారని పిఎంఎన్ హెచ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రజత్ ఖోస్లా అన్నారు. ఈ పిల్లల ప్రగతికోసం భారతదేశం చేస్తున్నకృషిని ఆయన ప్రశంసించారు. వారు ఈ వయస్సులో హింస, ముందస్తు గర్భంలాంటి సవాళ్లను ఎదుర్కొంటూ వుంటారని అన్నారు. కౌమారదశ యువత ప్రగతికోసం పెట్టే పెట్టుబడుల ఆర్థిక, సామాజిక కీలక అంశాలను ఆయనప్రత్యేకంగా ప్రస్తావించారు. కౌమారదశ యువతకోసం 2024-25 బడ్జెట్లో చేసిన 2 లక్షల కోట్ల గణనీయమైన కేటాయింపులను ఆయన ప్రశంసించారు. ఎల్ ఎమ్ ఐ సి లకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు భారతదేశం మార్గదర్శిగా నిలుస్తోందని, కౌమారదశ యువత సాధికారతను ఆచరణ పెట్టిందని ఆయన భారతదేశాన్ని కీర్తించారు.
జనాభా పరంగా వున్న సౌలభ్యాలను వినియోగించుకోవడానికి కేంద్రప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని ప్రపచం ఆరోగ్యసంస్థ ప్రతినిధి డాక్టర్ రొడ్రిగో హెచ్ ఆఫ్రిన్ అన్నారు. పలు ఆరోగ్య సూచికల విషయంలో కీలకమైన విజయాలను సాధించిందని కితాబిచ్చారు. పలు ప్రభుత్వ కార్యక్రమాల మేలు కలయిక కారణంగా కౌమారదశ యువత సంక్షేమానికి దోహదం చేసిందని అన్నారు. కౌమారదశ యువత ప్రగతికోసం చేసే పెట్టుబడులు దేశ భవిష్యత్తుకోసం పెట్టే పెట్టుబడులని ఆయన అన్నారు. వారికోసం పెట్టుబడులు పెట్టకపోతే ఎస్ డీజీలను సాధించడం కష్టమని ఆయన పేర్కొన్నారు.
కౌమారదశ యువత ఆరోగ్యం సంక్షేమంలో పెట్టుబడులనే అంశానికి సంబంధించి కీలక విషయాలపై విక్టోరియా విశ్వవిద్యాలయానికి చెందిన డైరెక్టర్ ప్రొఫెసర్ బ్రూస్ రాస్ ముస్సెన్ మాట్లాడారు. భారతదేశంలోని కౌమారదశ యువత జనాభా ప్రపంచంలోనే అధికమని అన్నారు. వారి సంక్షేమానికి సంబంధించిన ఐదు అంశాలగురించి వివరించారు. ఆయా అంశాల్లో భారతదేశం సాధించిన గణనీయమైన ప్రగతిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. విద్య, నైపుణ్యాభివృద్ధి సాధనతోపాటు, బాల్య వివాహాలు, రహదారి ప్రమాదాల తగ్గింపు కారణంగా జిడిపిలో గణనీయమైన అభివృద్ధి వుంటుందని అన్నారు.
భారతదేశంలో వస్తున్న మార్పుల గురించి న్యూఢిల్లీ ఏఐఐఎంఎస్ సైకియాట్రి ప్రొఫెసర్ డాక్టర్ యతన్ పాల్ సింగ్ బల్హారా మాట్లాడారు. దేశంలో మానసిక ఆరోగ్యాన్ని పోత్పహించడంపై విస్తృతమైన దృష్టిని పెట్టడం గురించి ఈ మధ్యనే విడుదలైన ఆర్థిక సర్వేలో మొదటిసారిగా వివరించారని అన్నారు.
కౌమారదశ యువతకు వారి పెరుగుదల సమయంలనే విద్యపట్ల ఇతర విషయాలపట్ల తగిన చైతన్యాన్ని పెంచాలని లేడీ హార్డింగే మెడికల్ కాలేజీ గైనకాలజీ విభాగ అధిపతి డాక్టర్ రీనా యాదవ్ అన్నారు. ప్రైవసీ విషయంలో వారికున్న హక్కులను గౌరవిస్తూనే లైంగిక, ప్రత్యుత్పత్తి ఆరోగ్య సమస్యలపై వారికి తగిన కౌన్సిలింగ్ చేయాల్సిన ప్రాధాన్యతపై ఆమె మాట్లాడారు.
కౌమారదశ యువతులు ఎదుర్కొనే సవాళ్ల గురించి రాజస్థాన్ కు చెందిన ప్రతినిధి మిస్ ప్రియా రాథోడ్ మాట్లాడారు. బాల్యవివాహాల్లాంటి సమస్యలతోపాటు, క్షేత్రస్థాయి విధాన మద్దతు గురించి మాట్లాడారు. ప్రభుత్వపరమైన మద్దతు పర్యవేక్షణ పెరగాలని, దానిపై మదింపు జరగాలని గ్రామీణ ప్రాంతాల్లో, ఆర్థికంగా వెనకబడిన ప్రాంతాల్లో ఈ పని జరగాలని ఆమె అన్నారు. రుతుస్రావ ఆరోగ్యసంరక్షణ సమస్యలపై కౌమార బాలికల్లో మరింత చైతన్యం పెంచాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖకు చెందిన అదనపు కార్యదర్శి శ్రీమతి ఆరాధన పట్నాయక్, ఇంకా ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
...
నేపథ్యం
.....
కౌమార దశ పిల్లల ఆరోగ్యం, సంక్షేమరంగంలో పెట్టుబడులకోసంగల ఆర్ధిక పరిస్థితిపై పిఎంఎన్ సి హెచ్ తయారు చేసిన నివేదిక కౌమారదశ పిల్లల ప్రగతికోసం చేసేపెట్టుబడి వల్ల వచ్చే ఆర్థిక ప్రయోజనాలను వివరించింది. కౌమారదశ పిల్లల ఆరోగ్యం, విద్య, బాల్యావివాహాల నిరోధం, రహదారుల భద్రత మొదలైన ఏడు కీలకమైన అంశాలను ఈ నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ రంగంలో పెట్టే పెట్టుబడులవల్ల మంచి ఫలితాలు వస్తాయని తెలియజేసింది. ఈ రంగంలో పెట్టే ప్రతి డాలర్ పెట్టుబడికి 4.6నుంచి 71.4 అమెరికా డాలర్ల లాభం వస్తుందని ఈ నివేదిక వివరించింది.
ఈ రంగంలో భవిష్యత్తులో పెట్టే పెట్టుబడుల గురించి ఈ నివేదిక పేర్కొంది. వాటిలో కొన్ని ప్రస్తుతం అమలవుతున్న జాతీయ కార్యక్రమాల్లో పెట్టడం జరిగిందని నివేదిక స్పష్టం చేసింది. తద్వారా భారతీయ ఆర్థికపరిస్థితి గణనీయంగా ప్రగతి సాధిస్తుందని పేర్కొంది. అన్ని రంగాల్లో ప్రతి ఏడాది 33 బిలియన్ డాలర్ల పెట్టుబడులుపెడితే ప్రతి ఏడాది 476 బిలియన్ డాలర్ల లాభం వస్తుందని నివేదిక వివరించింది. తద్వారా జిడిపి దాదాపు 10.1 శాతం పెరుగుతుందని తెలిపింది.
ఈ నివేదికలో తెలియజేసిన విధంగానే కేంద్ర బడ్జెట్ 2024-25లో రెండు లక్షల కోట్ల (దాదాపు 26.67 బిలియన్ యుఎస్ డాలర్లు) కేటాయింపులను విద్య, ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ సంబంధిత ప్రోత్సాహకాలకోసం చేశారు. తద్వారా దేశవ్యాప్తంగా 4.1 కోట్ల (41 మిలియన్) యువతకు లబ్ధి చేకూరుతుంది. భారతదేశ భవిష్యత్తయిన కౌమారదశ యువత విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వున్న నిబద్ధతను ఈ కేటాయింపులు తెలియజేస్తున్నాయి. ఈ కేటాయింపుల కారణంగా వారికి సరైన వాతావరణం ఏర్పడి అవసరమైన వనరులు, అవకాశాలు లభిస్తాయి.
కౌమారదశ యువత ప్రగతికి సంబంధించిన ఏడు కీలక కార్యక్రమాల వాస్తవ సమాచారాన్ని ఈ నివేదిక పేర్కొంది. వారికి సంబంధించిన మరింత సంక్షేమంకోసం అదనంగా చేయాల్సిన విషయాల గురించి తెలియజేస్తోంది. దేశ కౌమారదశ యువత జనాభా ఆరోగ్యం, ప్రగతికోసం కేంద్రప్రభుత్వం కట్టుబడి వుందని జాతి ప్రగతిలో వారిది కీలకపాత్రగా గుర్తించడం జరిగిందని నివేదిక పేర్కొంది.
దేశంలోని కౌమార యువత ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను పరిష్కరించడంకోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పలు కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమాల అమలుకోసం సమగ్రమైన విధానాన్ని అనుసరిస్తున్నారు. భౌతిక మానసిక ఆరోగ్యాలు, పోషణ, విద్యతోపాటు హింస దోపిడీలనుంచి భద్రత మొదలైనవాటి గురించి దృష్టి పెట్టారు. కౌమారదశ యువతకోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ కిషోర్ స్వస్థ్య కార్యక్రమ్, పాఠశాల ఆరోగ్య, సంక్షేమం మొదలైన కీలక కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఇవి కౌమార యువత అవసరాల ప్రకారం వారికి ఆరోగ్యభద్రత కల్పించంలో కీలకంగా వున్నాయి. వారిలో ఆరోగ్య ప్రవర్తనను ప్రోత్సహిస్తాయి. వారికి పాఠశాలల్లో కీలక సమాచారాన్ని, సదుపాయాలను కల్పిస్తాయి.
***
(Release ID: 2037606)
Visitor Counter : 104