వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
తోలు, పాద రక్షల పరిశ్రమల ప్రతినిధులతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పియూష్ గోయల్ సమావేశం
2030 నాటికి పరిశ్రమ 50 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవాలి: శ్రీ గోయల్
ప్రపంచ స్థాయి ఉత్పత్తులను ప్రదర్శించేందుకు భారీ అంతర్జాతీయ ఎగ్జిబిషన్ ఏర్పాటుకు సూచన
దీర్ఘకాలంలో క్యూ సి ఓ ల అమలుతో పరిశ్రమకు లబ్ది : శ్రీ గోయల్
Posted On:
25 JUL 2024 5:23PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పియూష్ గోయల్ నిన్న న్యూ ఢిల్లీలో జరిగిన తోలు, పాద రక్షల పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యారు. 2030 నాటికి తోలు, పాద రక్షల పరిశ్రమను 50 బిలియన్ డాలర్లకు చేర్చడమే దృష్టిని లక్ష్యంగా పెట్టుకోవాలని మంత్రి వారికి సూచించారు.
స్వదేశీ, అంతర్జాతీయ బ్రాండ్స్ పాల్గొనేవిధంగా ప్రసిద్ధ ఉత్పత్తులను ప్రదర్శిస్తూ భారీ అంతర్జాతీయ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయాలని మంత్రి అన్నారు. అత్యుత్తమ మౌలిక వసతులతో డిజైన్ స్టూడియోను అభివృద్ధి చేసుకోవటానికి పరిశ్రమలో సమన్వయం అవసరం అని పిలుపునిచ్చారు.
నాణ్యత నియంత్రణ ఆదేశాల (క్యూ సి ఓలు) ప్రాముఖ్యతను శ్రీ గోయల్ వివరిస్తూ , వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులనందిచడంతో పాటు "మేక్ ఇన్ ఇండియా" బ్రాండ్ ను ప్రోత్సహించడానికి వీలుగా క్యూ సి ఓలు అమలుచేస్తే పరిశ్రమకి లబ్ది చేకూరుతుందని అన్నారు. పరిశ్రమకి క్యూ సి ఓలపై ఉన్న ఆందోళనలను పరిష్కరించడానికి, క్యూ సి ఓ సర్టిఫికేషన్ ప్రక్రియను మరింత సులభంగా, సౌకర్యవంతంగా చేయడానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు.లఘు, చిన్న యూనిట్లను క్యూ సి ఓల పరిధి నుంచి ఇచ్చిన మినహాయింపు కొనసాగుతుందని మంత్రి తెలిపారు.
వినియోగదారుల కోసం నాణ్యమైన పాద రక్షల కోసం, "మేక్ ఇన్ ఇండియా" బ్రాండ్ ను ప్రోత్సహించడానికి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డి పి ఐ ఐ టి ) 15.03.2024 తేది నుండి తోలు, పాద రక్షల విభాగానికి రెండు క్యూ సి ఓలను నోటిఫై చేసింది. ఇవి 01.08.2024 నుండి అమలులోకి వస్తాయి. తయారీదారులు 01.08.2024 కు ముందు వున్న పాత స్టాక్ ను వెల్లడించి , ఆ స్టాక్ ను 30.06.2025 లోపల అమ్ముకునే అవకాశం కల్పించారు. లఘు, చిన్న యూనిట్లు, ఎగుమతులకు ఉద్దేశించిన పాద రక్షల తయారీకోసం దిగుమతి చేసుకున్న సోల్స్ క్యూ సి ఓ పరిధిలోకి రావు.
1 ఆగస్టు 2024 నుండి అమలు లోకి వచ్చే తోలు,పాద రక్షల రంగానికి క్యూ సి ఓల అమలు, ఇతర అంశాలు
సమావేశంలో పరిశీలనకు వచ్చాయి.
సమావేశంలో ఫుట్ వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, కౌన్సిల్ అఫ్ లెథర్ ఎక్స్ పోర్ట్స్ (సి ఎల్ ఈ ), సెంట్రల్ లెథర్ రీసెర్చ్
ఇన్స్టిట్యూట్ (సి ఎల్ ఆర్ ఐ), నేషనల్ ప్రొడక్తివిటీ కౌన్సిల్, ఇన్వెస్ట్ ఇండియా, బ్యూరో అఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, భారతీయ ఫుట్వేర్ కాంపనెంట్ తయారీదారుల సంఘం, భారతీయ రిటైలర్స్ అసోసియేషన్ (ఆర్ ఏ ఐ) ల నుంచి 120 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.
పుమా, నైక్, అడిడాస్, రీబుక్, బాటా, స్కెచర్స్, లిబర్టీ, మెట్రో షూస్, రెడ్ టేప్, రిలయన్స్ తదితర ప్రముఖ కంపెనీల ప్రతినిధులు కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు.
భారతదేశంలో తోలు, పాద రక్షల పరిశ్రమ ఆర్థిక వృద్ధికి దోహదపడే ఒక చురుకైన రంగం. ఈ పరిశ్రమ భారతీయ సంప్రదాయంతో లోతైన మూలాలతో, సమయానుకూలమైనతతో, భవిష్యత్తు అవకాశాలపై దృష్టి పెట్టే ఈ హస్తకళ ఆధునిక సాంకేతికతతో సామరస్య సమ్మేళనానికి ఉదాహరణ.
అపారమైన ఉపాదులు, భారీ ఎగుమతి అవకాశాలతో, భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద పాద రక్షల తయారీదారుగా ప్రపంచ ఉత్పత్తిలో 10.7శాతం వాటాను కలిగి ఉంది. పరిశ్రమ సామర్థ్యం ప్రపంచ పోటీతత్వానికి ఇది ఒక సూచిక. ఈ రంగం భారతదేశ జి డి పి లో 2 శాతం వాటా తో 4.42 మిలియన్లమందికి ప్రత్యేకించి యువ, మహిళా కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది, .
భారతదేశ పరిశ్రమ తోలు, సాడ్లరీ & హార్నెస్, తోలు వస్త్రాలు, తోలు తొడుగులు, బ్యాగ్స్, ట్రంక్లు, ఇతర ఉపకరణాలు, తోలుపాద రక్షలు, తోలు రహిత పాద రక్షలు, పాద రక్షల భాగాల వంటి పలు ఉత్పత్తి విభాగాలలో ఉత్పత్తి, ఎగుమతి చేస్తుంది.
భారతీయ తోలు, పాద రక్షల అభివృద్ధి కార్యక్రమం (ఐ ఎఫ్ ఎల్ డి పి) పథకం కింద ప్రభుత్వం మౌలిక వసతులు అభివృద్ధి చేయడం, పర్యావరణ సమస్యలను పరిష్కరించడం, పెట్టుబడులు సులభతరం చేయడం, ఉపాధి అవకాశాలు సృష్టించడం, తోలు, పాద రక్షల రంగం లో ఉత్పత్తిని పెంచడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఈ చర్చా కార్యక్రమాన్ని ముగిస్తూ "మేక్ ఇన్ ఇండియా" , "ఆత్మ నిర్భర్ భారత్" లక్ష్యాలకు అనుగుణంగా క్యూ సి ఓల అమలును తోలు, పాద రక్షల పరిశ్రమ స్వాగతిస్తుందన్న ఆశా భావాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు. .
****
(Release ID: 2037476)
Visitor Counter : 61