రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
వాహన తుక్కు విధానం
Posted On:
25 JUL 2024 12:19PM by PIB Hyderabad
పాత, కాలుష్యకారక వాహనాలను దశలవారీగా తొలగించే వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు గాను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ.. ప్రోత్సాహాకాలు ఇవ్వడంతో కూడిన వాహన తుక్కు విధానాన్ని రూపొందించింది. ఈ విధానాన్ని అమలు చేయడానికి గానూ మోటారు వాహనాల చట్టం, 1988, కేంద్ర మోటారు వాహనాల నియమాలు - 1989 కింద నియమాలను ప్రకటించింది. ఈ మేరకు ఈ కింది నోటిఫికేషన్లను జారీ చేసి, మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది.:
(1) నమోదిత వాహనాల తుక్కు కేంద్రాలు(ఆర్‌వీఎస్ఎఫ్) ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన మోటారు వాహనాల(రిజిస్ట్రేషన్, వాహన తుక్కు కేంద్రం విధులు) నియమాలు, 2021కి సంబంధించిన, తేదీ 23.09.2021న వెలువడిన జీఎస్ఆర్ నోటిఫికేషన్ 653(ఈ) . ఈ నోటిఫికేషన్ 25 సెప్టెంబర్, 2021 నుంచి అమలులోకి వచ్చింది.
(2) ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల గుర్తింపు, పర్యవేక్షణ, నియంత్రణ కోసం 23.09.2021 తేదీన జారీ చేసిన జీఎస్ఆర్ నోటిఫికేషన్ 652(ఈ). ఈ నోటిఫికేషన్ సెప్టెంబరు 25, 2021 నుంచి అమలులోకి వచ్చింది.
(3) వాహనాల రిజిస్ట్రేషన్ రుసుము, ఫిట్‌నెస్ పరీక్ష రుసుము, ఫిట్‌నెస్ ధృవీకరణ రుసుములను సవరించేందుకు ఉద్దేశించిన, తేదీ 04.10.2021న వెలువడిన జీఎస్ఆర్ నోటిఫికేషన్ 714(ఈ). ఈ నోటిఫికేషన్ ఏప్రిల్ 1, 2022 నుంచి అమలులోకి వచ్చింది.
(4) "సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్" అందించి రిజిస్టరు చేసుకున్న వాహనాలకు మోటార్ వాహన పన్నులో రాయితీ ఇచ్చేందుకు గానూ 05.10.2021 తేదీన జారీ అయిన జీఎస్ఆర్ నోటిఫికేషన్ 720(ఈ). ఈ నోటిఫికేషన్ ఏప్రిల్ 1, 2022 నుంచి అమలులో ఉంది.
(5) కేంద్ర మోటారు వాహన నియమాలు 1989లోని 175 నియమం ప్రకారం నమోదైన ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ద్వారా మాత్రమే మోటార్ వాహనాల ఫిట్‌నెస్ పరీక్ష చేయాలని చెప్పే 05.04.2022న జారీ అయిన జీఎస్ఆర్ నోటిఫికేషన్ 272(ఈ) కింద -
(i) భారీ వస్తు రవాణా వాహనాలు/భారీ ప్రయాణికుల మోటారు వాహనాలకు సంబంధించి ఏప్రిల్ 1, 2023 నుంచి అమలులోకి వచ్చింది.
(ii) మధ్యతరహా వస్తు రవాణా వాహనాలు/మధ్యతరహా ప్రయాణికుల మోటారు వాహనాలు, తేలికపాటి మోటారు వాహనాల(రవాణా)కు సంబంధించి జూన్ 1, 2024 నుంచి అమలులోకి వచ్చింది.
(6) 23.09.2021 నాడు ప్రచురితమైన జీఎస్ఆర్ 652(ఈ) మోటారు వాహనాలు(వాహన తుక్కు కేంద్రాల నమోదు, విధులు) నియమాలు, 2021కు సవరణలకు సంబంధించి 13.09.2022 తేదీన జారీ చేసిన జీఎస్ఆర్ నోటిఫికేషన్ 695(ఈ).
(7) 23.09.2021 నాడు ప్రచురితమైన జీఎస్ఆర్ 652(ఈ) “ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల గుర్తింపు, నియంత్రణ, పర్యవేక్షణ” నియమాల సవరణలకు సంబంధించి 31.10.2022 తేదీన జారీ చేసిన జీఎస్ఆర్ నోటిఫికేషన్ 797(ఈ).
(8) కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రభుత్వాలు, వాటి శాఖలు, స్థానిక సంస్థలు(మున్సిపల్ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు), రాష్ట్ర రవాణా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన స్వయం ప్రతిపత్తి గల సంస్థలకు చెందిన వాహనాలకు 15 ఏళ్లు పూర్తైన తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పునరుద్ధరించకుండా 16.01.2023న జారీ చేసిన జీఎస్ఆర్ నోటిఫికేషన్ 29(ఈ).
(9) కేంద్ర మోటారు వాహన నియమాలు 1989లోని 175వ నియమం ప్రకారం రిజిస్టరైన రవాణా వాహనాలు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ద్వారా తప్పనిసరిగా పరీక్ష చేయించాలనే తేదీని అక్టోబరు 1, 2024 వరకు పొడిగిస్తూ 12.09.2023 తేదీన జారీ చేసిన జీఎస్ఆర్ 663(ఈ).
(10) 23.09.2021 తేదీన జీఎస్ఆర్ 652(ఈ)గా ప్రచురితమై, చివరగా 31.10.2023 నాడు జీఎస్ఆర్ 797(ఈ)గా సవరించిన “ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల గుర్తింపు, నియంత్రణ, పర్యవేక్షణ” నియమాల సవరణకు ఉద్దేశించిన 14.03.2024 తేదీన జారీ అయిన జీఎస్ఆర్ 195(ఈ).
(11) 23.09.2021 తేదీన జీఎస్ఆర్ 653(ఈ) ప్రచురితమై, 13.09.2022 నాడు జీఎస్ఆర్ 695(ఈ)గా చివరగా సవరించిన మోటారు వాహనాలు(వాహన తుక్కు కేంద్రాల నమోదు, విధులు) నియమాలు, 2021కు సవరణలకు ఉద్దేశించి 15.03.2024న జారీ చేసిన జీఎస్ఆర్ 212(ఈ).
వాహన తుక్కు విధానంతో పాటు రవాణాకు సంబంధించిన కొత్త నియమ, నిబంధనలు, సాంకేతికతలపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రవాణా శాఖల అధికారులు, ఎస్ఆర్‌టీయూ, ఎస్‌టీయూ, ఎస్‌టీసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసు అధికారులకు కేంద్ర రవాణా, రహదారుల శాఖ శిక్షణ ఇస్తోంది. అనేక ప్రఖ్యాత సంస్థల ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మానవ వనరుల అభివృద్ధికి వర్కషాపు, శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
వాహన తుక్కు విధానం అమలు ప్రస్థుత స్థితి:-
(i) దేశవ్యాప్తంగా 60 నమోదిత వాహన తుక్కు కేంద్రాలు(ఆర్‌వీఎస్ఎఫ్), 75 ఆటోమేటెడ్ పరీక్ష కేంద్రాలు పని చేస్తున్నాయి.
(ii) సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్‌పైన కొనుగోలు చేసే వాహనాలపై మోటారు వాహన పన్నుపై 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రాయితీ ప్రకటించాయి. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆర్‌వీఎస్ఎఫ్‌లలో తుక్కుకు ఇచ్చిన వాహనాలపై పెండింగ్‌లో ఉన్న బకాయిలను మాఫీ చేస్తామని ప్రకటించాయి.
(iii) 15.07.2024 నాటికి 96,980 వాహనాలను నమోదిత వాహన తుక్కు కేంద్రాల్లో తుక్కుగా మార్చడమైంది.
2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలు, గాయాలను 50 శాతానికి తగ్గించడానికి చేసుకున్న స్టాక్‌హోమ్ ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం సంతకం చేసింది.
ఈ సమాచారాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గురువారం(25.07.2024) నాడు లోక్‌సభలో రాతపూర్వక సమాధానంగా వెల్లడించారు.
***
(Release ID: 2037390)
Visitor Counter : 83