సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

ఎంఎస్ఎంఈ రంగంలో ఉపాధి కల్పన

Posted On: 25 JUL 2024 5:02PM by PIB Hyderabad

ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను ప్రభుత్వం 01.07.2020న ప్రారంభించింది. ఉద్యమ్‌ పోర్టల్, ఉద్యమ్‌ అసిస్ట్ ప్లాట్‌ఫామ్‌ గణాంకాల ప్రకారం 22.07.2024 నాటికి ఎంఎస్ఎమ్ఈలు 20.51 కోట్ల మందికి ఉపాధి కల్పించాయి. సంవత్సరం వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. :

 

కాలం/ఆర్థిక సంవత్సరం

ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్ పోర్టల్

ఉద్యమ్‌ అసిస్ట్ ప్లాట్‌ఫామ్

మొత్తం

2020-21
(01/07/2020 - 31/03/2021)

2,72,97,074

-

2,72,97,074

2021-22

3,49,53,245

-

3,49,53,245

2022-23

4,47,02,696

13,32,489

4,60,35,185

2023-24

5,59,09,619

1,85,46,114

7,44,55,733

2024-25
( 22/07/2024 వరకు)

1,86,90,757

37,44,638

2,24,35,395

Total

18,15,53,391

2,36,23,241

20,51,76,632


మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూ-జీకేవై).. గ్రామీణ స్వయం ఉపాధి, శిక్షణ సంస్థ (ఆర్ఎస్ఈటీఐ).. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ (డీఏవై-ఎన్‌యూఎల్ఎం), ప్రధానమంత్రి ముద్ర యోజన(పీఎంఎంవై) వంటి పథకాలను ఎంఎస్ఎంఈలతో పాటు దేశంలో ఉపాధి కల్పనను పెంచేందుకు ప్రభుత్వం అమలు చేస్తోంది.

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఎస్ఎంఈ) ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం, తద్వారా మరిన్ని ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తుంది. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ), ఎంఎస్ఎంఈ ఛాంపియన్స్ స్కీమ్, క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ (సీజీటీఎంఎస్ఈ), మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ - క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎంఎస్ఈ-సీడీపీ), రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ (ర్యాంప్) వంటివి ఇందులో ఉన్నాయి.

ఎంఎస్ఎంఈలకు మద్ధతునిచ్చేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. వాటిలో కొన్ని:

i. రుణ హామీ పథకం కింద క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ (సీజీటీఎంఎస్ఈ) ద్వారా వివిధ విభాగాల రుణాలకు 85% వరకు హామీ వర్తింపుతో ఎంఎస్ఈలకు రూ.500 లక్షల ( 01.04.23 నుండి) వరకు పూచీకత్తు లేని రుణం.

Ii. స్వయం సమృద్ధ భారత నిధి ద్వారా రూ.50,000 కోట్ల ఈక్విటీ సహాయం. ఈ పథకానికి భారత ప్రభుత్వం నుంచి రూ.10,000 కోట్ల కార్పస్ నిధి సదుపాయం.

iii. అధిక పరిమితులతో ఎంఎస్ఎంఈల వర్గీకరణకు సవరణ.

iv. సులభతర వ్యాపార, వాణిజ్య నిర్వహణ కోసం 'ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్ పోర్టల్' ద్వారా ఎంఎస్ఎంఈల రిజిస్ట్రేషన్.
v. ఎంఎస్ఎంఈల స్థాయి‌ పైదిశగా మారితే పన్నేతర ప్రయోజనాలు 3 ఏళ్ల పాటు పొడిగింపు

vi. ఐదేళ్లకు రూ.6,000 నిధితో రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ (ర్యాంప్) కార్యక్రమం ప్రారంభం
vii. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్‌సీఎస్).. నైపుణ్యాభివృద్ధి,వ్యవస్థాపగత  మంత్రిత్వ శాఖకు చెందిన స్కిల్ ఇండియా డిజిటల్‌తో ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్ పోర్టల్ అనుసంధానం. శిక్షణ పొందిన మానవ వనరులు, సామర్థ్య పెంపు విషయంలో సంప్రదించేందుకు నమోదు చేసుకున్న ఎంఎస్ఎంఈలకు వీలు.
viii. వివాద్ సే విశ్వాస్ - 1 కింద మినహాయించిన పనితీరు భద్రత, బిడ్ సెక్యూరిటీ, లిక్విడేటెడ్ డ్యామేజీలలో 95 శాతం రీఫండ్ ఇవ్వటం ద్వారా ఎంఎస్ఎంఈలకు ఉపశమనం. కాంట్రాక్టుల అమలులో విఫలమైన ఎంఎస్ఎంఈలకు కూడా ఉపశమనం. 
ix. ప్రాధాన్య రంగ రుణం (పీఎస్ఎల్) కింద ప్రయోజనం పొందేందుకు వీలుగా అనధికారిక సూక్ష్మ పరిశ్రమలను (ఐఎంఈ) అధికారిక పరిధిలోకి తీసుకురావడానికి ఉద్యమ్‌ అసిస్ట్ ప్లాట్‌ఫామ్ (యూఏపీ)ను ప్రారంభం. 

x. 17.09.2023న 'పీఎం విశ్వకర్మ' పథకాన్ని ప్రారంభించి 18 సంప్రదాయ వృత్తుల్లో నిమగ్నమైన చేతివృత్తుల వారు, కళాకారులకు అంతిమ సంపూర్ణ ప్రయోజనాలను అందించటం.

పురుషులు, మహిళా కార్మికులకు సమాన వేతనం చెల్లించడానికి ఉద్దేశించిన సమాన వేతన చట్టం 1976 ఎంఎస్ఎంఈ రంగానికి కూడా వర్తిస్తుంది.

ఈ సమాచారాన్ని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ జితన్ రామ్ మాంఝీ ఈ రోజు లోక్ సభలో లిఖితపూర్వక సమాధానం ద్వారా అందించారు.

 

***

 


(Release ID: 2037387)