హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సైబ‌ర్ నేరాలు

Posted On: 24 JUL 2024 5:13PM by PIB Hyderabad

భార రాజ్యాంగంలోని ఏడో అధికణం ప్రకారం  “పోలీసు”, “మాజ శాంతి” రాష్ర్టాల రిధిలోకి  చ్చే అంశాలుకిలీ వెబ్ సైట్ల ద్వారా చేసే మోసాలు హా అన్ని కాల సైబర్ నేరాల నిరోధంగుర్తింపుర్యాప్తుప్రాసిక్యూషన్  బాధ్య ప్రాథమికంగా రాష్ర్టాలు/  కేంద్రపాలిత ప్రాంతాలదేఆయా రాష్ర్టాలు/  కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ట్టాలను అమలుపరిచే సంస్థలు (ఎల్ఇఏ ర్యలు తీసుకోవసి ఉంటుందిఅవమైన సందర్భాల్లో హాలు అందించడంట్టాలను అమలు రిచే ఏజెన్సీల (ఎల్ఇఏసామర్థ్యాల నిర్మాణానికి విభిన్న కాల కింద ఆర్థికహాయం అందించడం ద్వారా కేంద్రప్రభుత్వం  రాష్ర్టాలు/  కేంద్రపాలిత ప్రాంతాల ర్యకు ద్దతు ఇస్తుంది.

ఒక గ్ర‌, న్వపూర్వ వైఖరితో సైబర్ నేరాలను అదుపు చేసే యంత్రాంగాన్ని టిష్ఠం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం  దిగువ ర్యలు తీసుకుంది.

     I.         సైబర్ నేరాలన్నింటినీ సమగ్ర, సమన్వయపూర్వక వైఖరితో ఎదుర్కొనేందుకు హోం మంత్రిత్వ శాఖ ఒక అనుబంధ కార్యాలయంగా ‘‘భారత సైబర్ నేరాల సమన్వయ కేంద్రం’’ (I4C) ఏర్పాటు చేసింది.

   II.         మేవాత్, జంతారా, అహ్మదాబాద్, హైదరాబాద్, చండీగఢ్, విశాఖపట్టణం, గువాహటిలలో I4Cకి అనుబంధంగా ఏడు జాయింట్ సైబర్ కో ఆర్డినేషన్ టీమ్ లు (జెసిసిటి) ఏర్పాటు చేసింది. రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాలను భాగస్వాములను చేస్తూ ఆయా రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన చట్టాలు అమలు చేసే ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని విస్తరించేందుకు; తద్వారా సైబర్  నేరాలు జోరుగా జరిగే ప్రాంతాలు, బహుళ అధికార పరిధి సంబంధిత అంశాలను పరిష్కరించేందుకు ఇవి ప్రయత్నిస్తాయి. 2023 సంవత్సరంలో హైదరాబాద్, అహ్మదాబాద్, గువాహటి, విశాఖపట్టణం, లక్నో, రాంచి, చండీగఢ్ లలో జెసిసిటిల కోసం ఏడు వర్క్ షాప్ లు నిర్వహించారు.

 III.         రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన  దర్యాప్తు అధికారులను (ఐఓలు) ప్రారంభ దశ సైబర్ ఫోరెన్సిక్  సహకారం అందించేందుకు I4Cకి అనుబంధంగా న్యూఢిల్లీలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన ‘‘నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లేబరేటరీ (దర్యాప్తు)’’ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఈ నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లేబరేటరీ (దర్యాప్తు) ఆయా ఎల్ఇఏలకు సైబర్ నేరాలకు సబంధించిన దర్యాప్తులో సహాయం కోసం  మొబైల్  ఫోరెన్సిక్స్, మెమరీ ఫోరెన్సిక్స్, సిడిఆర్ అనాల్సిస్ సహా 10,200 సైబర్ ఫోరెన్సిక్ సేవలు అందించింది.

IV.         అన్ని రకాల సైబర్ నేరాల మీద ప్రత్యేకించి మహిళలు, బాలలపై జరిగే సైబర్ నేరాల సంఘటనల పైన ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా I4Cలో భాగంగా ’’జాతీయ సైబర్  నేరాల ఫిర్యాదు పోర్టల్‘‘(https://cybercrime.gov.inను ఏర్పాటు చేశారు.  చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఈ పోర్టల్ లో నమోదయ్యే సైబర్ నేరాల పరిశీలన, వాటిని ఎఫ్ఐఆర్ లుగా మార్చడం, తదుపరి కార్యాచరణ చేపట్టడం వంటి చర్యలను సంబంధిత రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన చట్టాల అమలు ఏజెన్సీలు చేపడతాయి.

   V.         ఆర్థికపరమైన మోసాలను తక్షణం ఫిర్యాదు చేసి మోసగాళ్లు నిధులు స్వాహా చేయడాన్ని నివారించేందుకు I4C కింద ‘‘సిటిజెన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్ మెంట్  సిస్టమ్’’ను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఈ వ్యవస్థ 7.6 లక్షల ఫిర్యాదులను పరిశీలనక తీసుకుని రూ.2400 కోట్లకు పైబడి మొత్తాన్ని మోసగాళ్ల చేతుల్లోకి పోకుండా కాపాడింది. ఆన్ లైన్  సైబర్ ఫిర్యాదుల నమోదులో సహాయం అందించేందుకు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ ‘‘1930’’ని ఏర్పాటు చేశారు.

VI.         సైబర్ నేరాల దర్యాప్తు, ఫోరెన్సిక్స్, ప్రాసిక్యూషన్, సర్టిఫికేషన్ వంటి క్లిష్టమైన అంశాల్లో పోలీసు అధికారులు/న్యాయ అధికారులకు ఆన్ లైన్ కోర్సులు నిర్వహించడం, తద్వారా సామర్థ్యాల నిర్మాణం కోసం I4C కింద ‘‘సిట్రైన్’’ పేరిట మాసివ్ ఓపెన్ ఆన్ లైన్ కోర్సుల (ఎంఓఓసి) వేదికను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఈ పోర్టల్ ద్వారా రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 96,288 మంది పోలీసు అధికారులు నమోదు కాగా 70,992 మందికి సర్టిఫికెట్లు జారీ చేశారు.

VII.         పోలీసు అధికారులు అందించిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు 5.8 లక్షల సిమ్ కార్డులు, 1,08,000 ఐఎంఇఐ నంబర్లను భారత ప్రభుత్వం బ్లాక్ చేసింది.

VIII.         వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్ మెంట్లకు చెందిన 6800 మంది అధికారులకు  I4C సైబర్ హైజీన్ శిక్షణ ఇచ్చింది.

IX.         35,000 మందికి పైగా ఎన్ సిసి కాడెట్లకు I4C సైబర్ హైజీన్ శిక్షణ ఇచ్చింది.

   X.         సైబర్ ఫోరెన్సిక్-కమ్-ట్రెయినింగ్ లేబరేటరీలు ఏర్పాటు చేసేందుకు, జూనియర్ సైబర్ కన్సల్టెంట్లను నియమించుకునేందుకు; ఎల్ఇఏ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, జ్యుడిషియల్ అధికారులను శిక్షణ ఇచ్చేందుకు ‘‘మహిళలు, బాలలపై సైబర్ నేరాల నిరోధక’’ పథకం కింద రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు హోం మంత్రిత్వ శాఖ రూ.131.60 కోట్లు ఆర్థిక సహాయంగా అందించింది. 33 రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో సైబర్ ఫోరెన్సిక్-కమ్-ట్రెయినింగ్ లేబరేటరీలు ప్రారంభమయ్యాయి. 24,600 మంది పైగా ఎల్ఇఏ సిబ్బంది, జ్యుడిషియల్ అధికారులు, ప్రాసిక్యూటర్లకు సైబర్ నేరాల చైతన్యం, దర్యాప్తు, ఫోరెన్సిక్స్ పై శిక్షణ ఇచ్చారు.   

XI.         హైదరాబాద్ లో నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లేబరేటరీ (ఎవిడెన్స్) ఏర్పాటు చేశారు. ఐటి చట్టం, ఎవిడెన్స్ చట్టాల నిబంధనల పరిధిలో ఆధారాలతో కూడిన సైబర్ నేరాలకు ఫోరెన్సిక్ మద్దతు అందించడం, ఆధారాలను భద్రపరచడం, వాటిని విశ్లేషించడం తద్వారా కేసు పరిష్కార సమయం తగ్గించేందుకు ఈ లేబరేటరీ సహాయకారి అవుతుంది.

XII.         సైబర్  నేరాలపై చైతన్యం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎస్ఎంఎస్ ల ద్వారా సందేశాలు పంపుతోంది. I4C సామాజిక మాధ్యమ ఖాతా ఎక్స్ (గతంలో ట్విట్టర్) (@CyberDost), ఫేస్ బుక్  (CyberDostI4C), ఇన్ స్టా గ్రామ్ (CyberDostI4C), టెలిగ్రామ్ (CyberDostI4C) వంటి వేదికలు; రేడియో ప్రచార కార్యక్రమాలు, మైగవ్ వంటి బహుళ వేదికల ద్వారా చైతన్య ప్రచారం నిర్వహిస్తోంది. రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాల సహాయంతో సైబర్ భద్రత, రక్షణ చైతన్య వారోత్సవాలు నిర్వహిస్తోంది. వయోజనులువిద్యార్థుల కోసం హాండ్ బుక్ ప్రచురించింది. అలాగే ప్రజల్లో సైబర్ నేరాలపై చైతన్యం పెంచేందుకు ప్రచారోద్యమాలు నిర్వహించాలని రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది.  

కేంద్ర హోం శాఖ హాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ రాజ్యలో ప్రస్తావకు చ్చిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా అందించిన మాధానంలో  వివరాలు తెలియచేశారు.

 

***


(Release ID: 2036718) Visitor Counter : 110


Read this release in: English , Hindi , Hindi_MP , Tamil