కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రజల వ్యాఖ్యలతో పాటు నిపుణుల అభిప్రాయం కోరుతూ ‘డిజిపిన్’ బీటా వర్షనును విడుదల చేసిన తపాలా విభాగం

Posted On: 22 JUL 2024 5:55PM by PIB Hyderabad

పబ్లిక్ సర్వీసులనుప్రైవేటు సర్వీసులను పౌరుల ప్రయోజనాలే ప్రధానంగా ఉండేటట్లు తీర్చిదిద్దడం కోసం సరళతరమైన పరిష్కారాలను ఆచరణలోకి తేవడానికి తపాలా విభాగం భారతదేశంలో ఒక ప్రమాణీకృత జియో-కోడెడ్ అడ్రెసింగ్ వ్యవస్థ ను ప్రవేశపెట్టే  కార్యక్రమాన్ని తలపెట్టింది.  ఈ విషయంలో డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్ (డిఐజిఐపిఐఎన్.. డిజిపిన్) పేరుతో వ్యవహరించే ఒక జాతీయ అడ్రెసింగ్ గ్రిడ్ ను అభివృద్ధి పరచడానికి ఐఐటి హైదరాబాద్ తో సమన్వయాన్ని ఈ విభాగం నెలకొల్పుకొంది.  ఈ వ్యవస్థ జియోస్పేషల్ గవర్నెన్స్ కు ఒక బలమైనసుదృఢ స్తంభం వలె పనిచేస్తుందిదీనితో సార్వజనిక సేవల అందజేత మెరుగు పడుతుంది; అత్యవసర ప్రతిస్పందనలో వేగం, లాజిస్టిక్స్ సంబంధ సామర్థ్యం లో గణనీయ వృద్ధి సాధ్యపడుతాయి.

 

డిజిపిన్’ చిరునామాల రెఫరెన్సింగ్ సిస్టమ్ లా పనిచేస్తుంది. దీని ఉపయోగం భవన నిర్మాణం లో అవలంబించే తార్కికమైన నామకరణ నమూనాల వలెనే దీనిలో నిర్మితమైనటువంటి దిశాత్మక వస్తువుల సహాయంతో ఏ చిరునామాలనైనా కనుగొనవచ్చు.

 

 ‘డిజిపిన్’ ను పూర్తి స్థాయిలో పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉంచాలనే ప్రతిపాదన ఉంది. దీనిని అందరూ సులభంగా ఉపయోగించుకోవచ్చు. డిజిపిన్’ గ్రిడ్ వ్యవస్థ ఒక అడ్రెసింగ్ రెఫరెన్సింగ్ సిస్టమ్. దీనిని చిరునామాను పేర్కొనడం అనేది ఒక ప్రక్రియగా ఉన్న విభిన్న సేవల ప్రదాత సంస్థలు, యుటిలిటీలు సహా ఇతర ఇకోసిస్టమ్స్ కోసం బేస్ లేయర్ గా ఉపయోగించుకోవచ్చు.

 

ఈ వ్యవస్థ జియోస్పేషల్ గవర్నెన్స్ కు ఒక బలమైనసుదృఢ స్తంభం వలె పనిచేస్తుందిదీనితో సార్వజనిక సేవల అందజేత మెరుగు పడుతుంది; అత్యవసర ప్రతిస్పందనలో వేగం, లాజిస్టిక్స్ సంబంధ సామర్థ్యం లో గణనీయ వృద్ధి సాధ్యపడుతాయి.

 

డిజిపిన్’ రాకడ డిజిటల్ పరివర్తన దిశలో భారతదేశం చేపట్టిన యాత్రలో ఒక విప్లవిత్మకమైన అడుగుగా రుజువు కానుంది. ఇది భౌతిక  స్థానాలకువాటి డిజిటల్ ప్రతినిధిత్వానికి మధ్య భారీ అంతరాన్ని పూడ్చుతుంది.

 

ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం కోసం జాతీయ అడ్రెసింగ్ గ్రిడ్ డిజిపిన్’ బీటా వెర్షనును తపాలా విభాగం ఈ నెల 19న విడుదల చేసింది.  దీనికి సంబంధించిన వివరాలను ఇండియా పోస్ట్ వెబ్ సైట్  లోని https://www.indiapost.gov.in/vas/Pages/digipin.aspx  ను సందర్శించి  తెలుసుకోవచ్చు.

 

ప్రతి ఒక్కరు బీటా ప్లాట్ ఫార్మ్ ను ఉపయోగించి తమ నిర్మాణాత్మక సూచనలనుసలహాలను అందించాలంటూ తపాలా విభాగం అందరినీ ప్రోత్సహిస్తున్నది. ఆ యా సూచనలు, సలహాలు డిజిపిన్’ కార్యప్రణాళిక ను ఉత్తమంగా తీర్చిదిద్దడంలో తోడ్పడుతాయని తపాలా విభాగం పేర్కొంది.  ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలనుఆలోచనలనుసూచనలు/సలహాలను సెప్టెంబర్ 22 లోగా digipin@indiapost.gov.in కు ఇ-మెయిల్ ద్వారా పంపవచ్చు.

 

***


(Release ID: 2035764) Visitor Counter : 70