శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

అమెరికన్ చాంబర్ ఆఫ్ ఇండియా 'ఆరోగ్య సంకర్షణ సదస్సు'లో ప్రసంగించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్. అందరికి అందుబాటు ధరల్లో ఆరోగ్య సంరక్షణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించటంపై నొక్కి చెప్పిన మంత్రి


తక్కువ ఖర్చులో సమర్థ బయో మాన్యుఫ్యాక్చరింగ్‌తో ప్రపంచంలోని టాప్ 6 బయో మాన్యుఫ్యాక్చరర్స్‌లో భారత్ ఒకటని తెలిపిన మంత్రి


వైద్యారోగ్య పర్యాటకానికి భారతదేశం అత్యంత డిమాండ్ ఉన్న గమ్యస్థానం, నివారణ ఆరోగ్య సంరక్షణలో మందువరుసలో ఉన్న దేశాల్లో ఒకటి

Posted On: 17 JUL 2024 2:33PM by PIB Hyderabad

తాజ్ హోటల్‌లో జరిగిన "అమెరికన్ ఛాంబర్ ఆఫ్ ఇండియా" (ఏఎంసీహెచ్ఏఎమ్) రెండో "ఆరోగ్య సంరక్షణ సదస్సు" లో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు. 

 

తక్కువ ఖర్చులో సమర్థ బయో మాన్యుఫ్యాక్చరింగ్‌తో పాటు అందుబాటు ధరల్లో ఆరోగ్య సంరక్షణ గమ్యస్థానంగా భారతను వర్ణించారు.

కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), భూ విజ్ఞాన సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ప్రధానమంత్రి కార్యాలయం, అణుశక్తి విభాగం, అంతరిక్ష శాఖ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తన ప్రారంభోపన్యాసంలో మాట్లాడుతూ.. "ఈ కీలకమైన ఆరోగ్య సంరక్షణ సదస్సును నిర్వహించినందుకు, భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వ దార్శనికతను వివరించడానికి నన్ను ఆహ్వానించినందుకు ఆమెరికన్ ఛాంబర్ ఆఫ్ ఇండియాకు నా కృతజ్ఞతలు” అని అన్నారు. ఆరోగ్యరంగానికి సంబంధించి సోదరసోదరీమణులు హాజరైన ఈ సమావేశంలో పాల్గొనడం, తనకు ఆసక్తి ఉన్న ఆరోగ్య అంశం గురించి చర్చించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

 

వైద్యరంగంలో మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం ఉన్న మంత్రి స్వయంగా ప్రఖ్యాత ఎండోక్రైనాలజిస్ట్ కావడం గమనార్హం. జీవక్రియ రుగ్మతలు భారం పెరగటం, విస్తృత వ్యాధులకు సంబంధించి అది విసురుతున్న సవాళ్లు, ఆయుర్ధాయం పెరగటంతో పెరుగుతున్న వ్యాధులకు సంబంధించి నొక్కి చెప్పారు. 

 

'యాక్సిలరేటింగ్ ఇన్నోవేటీవ్ అండ్ యాక్సెసబుల్ హెల్త్ కేర్: టెక్నాలజీ' అనే ఈ సదస్సు ఇతివృత్తాన్ని మంత్రి ప్రశంసించారు. భారతదేశంలో సమకాలీన ఆరోగ్య సమస్యలు, అందరికీ అందుబాటు ధరల్లో ఆరోగ్య సంరక్షణను ఇచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ ఇతివృత్తం చాలా సముచితమని అన్నారు.

ఆరోగ్య సంరక్షణలో అమెరికా-భారత్ భాగస్వామ్యం బలోపేతంపై చర్చించడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణులు, సాంకేతిక నిపుణులు, విధాన నిర్ణేతలు, పరిశ్రమ ప్రతినిధులను ఒక్క దగ్గరికి తీసుకురావటంలో ఈ రకమైన శిఖరాగ్ర సమావేశాలు కీలక పాత్ర పోషిస్తాయని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రధానంగా ప్రస్తావించారు. 

 

ఇటీవలి కాలంలో ఆరోగ్య సంరక్షణలో వచ్చిన మార్పుల గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, "అంటువ్యాధుల నిర్మూలన, వ్యాపించని వ్యాధులను తగ్గించడం, ఆరోగ్య సూచికలను అభివృద్ధి చేయడం, స్థిరమైన పురోగతి సాధించడంతో ఆరోగ్యకరమైన భారత్ కోసం ప్రధాని నరేంద్ర మోడీకి దూరదృష్టి ఉంది" అని అన్నారు. ''కొవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని భారత్ చేపట్టింది. అందుబాటులో ఉన్న ఆరోగ్య సంరక్షణ ప్రతి పౌరుడి హక్కు అని మోడీ ప్రభుత్వం 3.0 గట్టిగా విశ్వసిస్తుందన్న విషయాన్ని ఇది తెలుపుతోంది” అని వ్యాఖ్యానించారు.

“ప్రజలు వైద్య సదుపాయాల కోసం ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లే రోజులు పోయాయి. ఇప్పుడు భారతదేశం ఒక వైద్యారోగ్య కేంద్రంగా మారింది. వైద్యారోగ్య పర్యాటకానికి  అత్యంత డిమాండ్ ఉన్న గమ్యస్థానంగా, నివారణ ఆరోగ్యసంరక్షణలో ముందు వరుసలో ఉన్న దేశాలలో ఒకటిగా ఉంది.” శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి చెప్పిన దాని ప్రకారం గత దశాబ్దంలో ప్రభుత్వానికి ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యతగా ఉంది. పౌరులకు నగదు రహిత వైద్యం అందించే ఆయుష్మాన్ కార్డు వంటి విజయాలను ఆయన గుర్తు చేశారు. డిజిటల్ హెల్త్‌కేర్ మిషన్, పీఎం జన ఔషది… ఆయుష్ వంటి ఇతర వైద్య విభాగాలతో వీటి అనుసంధానం గురించి కూడా ఆయన మాట్లాడారు. 

 

అందరూ సమానంగా ఆరోగ్య సంరక్షణ అందేలా చూడటంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఆరోగ్య సంరక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఏంఎల్) టూల్స్ ఇంటిగ్రేట్ చేయటం ద్వారా ఉపయోగించే సాంకేతికత మన సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుంది. అంతేకాకుండా నిరీక్షణ సమయాలను తగ్గించవచ్చు, ఆరోగ్య సంరక్షణను అందరికి అందంచే విషయంలో పూర్తి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. టెలీమెడిసిన్‌తో తన అనుభవాన్ని పంచుకున్న మంత్రి… ఇది ఆరోగ్య సంరక్షణను మార్చిన విధానం, జమ్మూ కశ్మీర్‌లో మారుమూల గ్రామాలకు కూడా సేవలను అందుబాటులోకి తెచ్చిన తీరును తెలిపారు. 

 

ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో సహకారం పెరగాలని మంత్రి కోరారు. ప్రజారోగ్యం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో ప్రైవేటు భాగస్వామ్యం కూడా అంతే ముఖ్యం. ఒక సమాజంగా మనం సరైన దిశలో అడుగులు వేయాలి. అంతరిక్ష రంగం తలుపులు తెరవటం వల్ల కొన్ని నెలల్లోనే రూ.1,000 కోట్లకు పైగా ప్రైవేట్ పెట్టుబడులు వచ్చాయని, 2022లో ఒక్క స్టార్టప్‌ మాత్రమే ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 200కు పైకి చేరిందని, వాటికి అంతర్జాతీయ స్థాయి సామర్థ్యం ఉందని అన్నారు.
 

 

ట్రాన్స్‌లేషనల్ ఆరోగ్య సంరక్షణలో పరిశోధన, అభివృద్ధిని పెంపొందించడంలో బయోటెక్నాలజీ విభాగం చేస్తున్న కృషిని, ఆ విభాగం సాధించిన విజయాలను మంత్రి గుర్తు చేశారు. బయో మాన్యుఫాక్చరింగ్, బయో ఫౌండ్రీ 2014లో 13 బిలియన్ డాలర్ల నుంచి 2024 నాటికి 130 బిలియన్ డాలర్లకు అనగా 10 రెట్లు పెరిగిందన్నారు.

ఫార్మాసూటికల్ రంగ శక్తిని ప్రధాంగా ప్రస్తావిస్తూ.. "యూఎస్ఏలో ప్రతి పది ప్రిస్క్రిప్షన్లలో నాలుగింటిని భారతదేశం సరఫరా చేస్తుంది, ఇది మన ఫార్మాసూటికల్ తయారీ సామర్థ్యాలను తెలుపుతుంది" అని అన్నారు. భారత్, అమెరికాల మధ్య భాగస్వామ్యం కీలకమని ఆయన పేర్కొన్నారు.

 

ఏఎంసీహెచ్ఏఎం సీఈఓ, డైరెక్టర్ జనరల్  శ్రీమతి రంజన ఖన్నా,..ఏఎంసీహెచ్ఏఎం ఛైర్మన్ & హెపీ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ శ్రీ సోమ్ సత్సంగి.. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ.. బోస్టన్ సైంటిఫిక్ ఇండియా ఉపఖండం వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ మదన్ కృష్ణన్.. విప్రో జీఈ హెల్త్‌కేర్ మేనేజింగ్ డైరెక్టర్ చైతన్య శరవతే కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు.

 

****



(Release ID: 2034331) Visitor Counter : 66