కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రెండవ రౌండ్ వాటాదారుల సలహా కమిటీల సమావేశాలను నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా


పరిశ్రమ ప్రముఖులు, విద్యావేత్తల నిరంతర భాగస్వామ్య ప్రాముఖ్యతను వివరించిన మంత్రి

సాంకేతిక పురోగతులు, విధాన సంస్కరణలు, భారతదేశ టెలికమ్యూనికేషన్ రంగ సర్వతోముఖ వృద్ధి కోసం వాటాదారుల సలహాల కమిటీల సూచనలు కీలకం

"మేము ప్రతీ సమస్యను ఒక్కొక్కటిగా తీసుకుని, వివరాలను పరిశీలించి, స్పష్టమైన కాలపరిమితి, చర్యలు తీసుకోదగిన అంశాలతో కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తాము": శ్రీ జ్యోతిరాదిత్య సింధియా

Posted On: 16 JUL 2024 5:36PM by PIB Hyderabad

మొదటి రోజు జరిగిన ఫలవంతమైన చర్చల అనంతరం, ఈశాన్య ప్రాంత అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసానిల నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన ఆరు వాటాదారుల సలహా కమిటీలు (ఎస్,ఎ.సి.ల) ప్రారంభ సమావేశాలను టెలికమ్యూనికేషన్స్ శాఖ (డి.ఓ.టి.) కొనసాగించినది. రెండవ రోజు, టెలికమ్యూనికేషన్స్ ఎకో సిస్టమ్ కోసం కీలకమైన మరిన్ని అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల ఎస్.ఎ.సి., ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ ఎస్.ఎ.సి.; అలాగే విద్యావేత్తలు మరియు టెలికమ్యూనికేషన్స్ రంగంలోని రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఎస్.ఎ.సి. అను మూడు ఎస్.ఎ.సి.ల సభ్యులతో నేటి సమావేశాలు జరిగాయి.

ఈ సమావేశంలో డాక్టర్ నీరజ్ మిట్టల్, కార్యదర్శి, టెలికమ్యూనికేషన్స్ విభాగం (డి.ఓ.టి.), శ్రీమతి మధు అరోరా, సభ్యులు (టెక్నాలజీ),  శ్రీ మనీష్ సిన్హా, సభ్యులు (ఫైనాన్స్), అలాగే పరిశ్రమ ప్రముఖులు, విద్యావేత్తలు తదితరులు పాల్గొన్నారు.

సాంకేతికతను ప్రోత్సహించుట, ఆర్ అండ్ డి, టెలికాం ఉత్పత్తుల కోసం గో-టు-మార్కెట్ వ్యూహాలు, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం, మానుఫాక్చరింగ్ ఎకోసిస్టమ్‌ ప్రారంభించడం, పరిశ్రమ-విద్యాసంబంధ సంస్థల అనుసంధానాలు, కొత్త ఆలోచనలు పంచుకోవడం, విధానపరమైన సమస్యలను పరిష్కరించుట సహా పలు కీలక అంశాలను గురించి ప్రభుత్వంతో టు-వే సంభాషణను సులభతరం చేయడానికి ఈ కమిటీలు రూపొందించబడ్డాయి. కొత్త ఆలోచనలు మరియు విధాన సమస్యలను పరిష్కరించడం వంటి కీలక విషయాలను గురించి ప్రభుత్వంతో పరస్పర చర్చలను సులభతరం చేసేందుకు ఈ కమిటీలు ఏర్పాటు చేయబడినవి.

చర్చల అనంతరం శ్రీ సింధియా మీడియాతో మాట్లాడుతూ, “మేము ఈ మూడు కమిటీల కోసం లోతైన అజెండాను గుర్తించాము. ఇప్పుడు, మేము ఈ కమిటీల సభ్యులతో కలిసి పని చేస్తాము. రాబోయే రెండు వారాల్లో ఈ కమిటీల మొదటి ప్రజెంటేషన్ కోసం వివిధ షెడ్యూల్స్ ఉన్నాయి. ఆపై మేము ఒక్కొక్కటిగా సమస్యను తీసుకుని, దాని వివరాలను పరిశీలించి, స్పష్టమైన కాలపరిమితులు, చర్యలు తీసుకోవాల్సిన అంశాలతో కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తాము, ఆ విధంగా మేము మా రంగాన్ని ముందుకు తీసుకెళ్లగలము” అన్నారు.

2వ రోజు ప్రధాన అంశాలు

టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ ఎస్.ఎ.సి.: టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ ఎస్.ఎ.సి. అందించే సేవలను మెరుగుపరచడం, టెలికాం ఆపరేటర్స్ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం కోసం అవసరమైన వ్యూహాలను గురించి చర్చించింది. అభివృద్ధి గురించిన అత్యాధునిక & వినూత్న అంశాలు సహా పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలతో ముడిపడి ఉన్న కీలక సమస్యలను గురించి చర్చించారు.

ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ ఎస్.ఎ.సి.: బ్రాడ్‌బ్యాండ్ విస్తరణను మెరుగుపరచడం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించింది. ప్రత్యేకించి ఫైబర్ ఆప్టిక్స్, 5G వంటి అధునాతన సాంకేతికతల విస్తరణ ఆవశ్యకతను వివరిస్తూ, మౌలిక సదుపాయాల విస్తరణను వేగవంతం చేయడం, ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీని మెరుగుపరచడంలో విధానపరమైన మద్దతు అవసరాన్ని కమిటీ ప్రధానంగా ప్రస్తావించింది, నొక్కి చెప్పింది.

విద్యావేత్తలు మరియు టెలికమ్యూనికేషన్స్ రంగంలోని R & D ఎస్.ఎ.సి. : విద్య, టెలికాం రంగాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. టెలికాం రంగానికి నూతన ఆవిష్కరణలు, నైపుణ్యం కలిగిన సిబ్బందిని అభివృద్ధి చేయడంలో ఈ రెండు రంగాల భాగస్వామ్య ప్రాముఖ్యతను కమిటీ ప్రధానంగా ప్రస్తావించింది.

పరిశ్రమల ప్రముఖులు, విద్యాసంస్థల నిరంతర భాగస్వామ్య ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, ఎస్.ఎ.సి.ల సూచనలు సాంకేతిక పురోగతి, విధాన సంస్కరణలకు మాత్రమే కాకుండా, భారతదేశ టెలికమ్యూనికేషన్స్ రంగం యొక్క సర్వతోముఖ వృద్ధికి కూడా సహాయపడతాయని పేర్కొన్నారు.

అంతకుముందు, శ్రీ సింధియా 2024, జూలై 15న శాటిలైట్ కమ్యూనికేషన్ ఎకోసిస్టమ్ ఎస్.ఎ.సి., టెలికాం సెక్టార్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు (ఓ.ఇ.ఎమ్‌లు), టెలికాం ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్ ఎస్.ఎ.సి.ల సభ్యులతో చర్చలు జరిపారు.

టెలికమ్యూనికేషన్స్ శాఖ ఈ చర్చల ఫలితాలను కొనసాగించడానికి కట్టుబడి ఉంది, అలాగే ఈ సమావేశాల ద్వారా సూచనలపై చురుకుగా పని చేస్తుంది. టెలికాం రంగ అభివృద్ధి కోసం సిఫార్సులను అమలు చేయడం, ఉత్పాదక, వినూత్న వాతావరణాన్ని పెంపొందించడం డి.ఓ.టి. లక్ష్యం. మేము ఈ సంప్రదింపు ప్రక్రియలో ముందుకు సాగే క్రమంలో వాటాదారులందరి సహాయ సహకారాలు చాలా కీలకం.

"ఈ కమిటీల ఏర్పాటు ద్వారా, 'ఆత్మనిర్భర్ భారత్' మాత్రమే కాకుండా, రాబోయే రోజుల్లో మన పరిమితులను అధిగమించి భారతదేశంలో టెలికాం సూపర్ పవర్‌ను సృష్టించాలన్న ప్రధానమంత్రి లక్ష్యం స్ఫూర్తిగా, ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలమని మేము ఆశిస్తున్నాము," అని పేర్కొనం ద్వారా భారత కమ్యూనికేషన్స్, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా వాటాదారుల సలహాల కమిటీల (ఎస్.ఎ.సి.ల) చివరి సమావేశాన్ని ముగించారు.

వాటాదారుల సలహాల కమిటీల తదుపరి సమావేశాలు ఆగస్టులో నిర్వహించబడుతాయి, ఈ ప్రారంభ సెషన్‌ ప్రాతిపదికగా తదుపరి చర్చలు కొనసాగుతాయి.

***


(Release ID: 2033927) Visitor Counter : 62